14-03-2025, 07:52 PM
super super super
నిన్ను కోరే వర్ణం
|
14-03-2025, 07:52 PM
super super super
17-03-2025, 11:21 AM
E7
(పంచ = ఇంటి పక్కన అరుగు ప్రదేశం, ఊళ్లలో ఇంటి పక్కనే తాటాకులతో చిన్న కప్పు ఒకటి వేసుకుని దాని కింద మంచం వేసుకుని కూర్చునేవారు) ఇంటి గేటు తీస్తుండగానే పంచలో కనిపించారు మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మా తాతయ్య, అమ్మ అందరికీ టీ ఇస్తుంది. పిల్లలు ఎవరు లేరు, నిధి ఒక్కటి మూలకి నిలబడి ఉంది. దాని కళ్ళలో కోపం.. పెద్ద మావయ్య సుభాష్ శివని చూడగానే మొదలుపెట్టేసాడు, "ఏరా ఒక్కడివే వెళితే ఎందుకు ఇస్తారు, మాకు చెప్తే తోడుగా వచ్చేవాళ్ళం కదా.. గట్టిగా మాట్లాడి మనకి రావాల్సిన వాటా మనం తెచ్చుకునేవాళ్ళం" ఇప్పుడు అర్ధమైంది నాకు నిధి ఎందుకు కోపంగా ఉందో.. నిధిని చూసి ఇంటికి పొమ్మని సైగ చేశాను. నిధి మెలకుండా వెళ్ళిపోయింది. ఇదంతా చిన్నత్త చూసింది, ఆమె మొహంలో ఆశ్చర్యం నాకు కనిపించినా నేనామె వంక చూడలేదు. "వచ్చే టయానికి అన్నీ వస్తాయిలే మావయ్యా.. దేవుడు మనకి రాసిందంతా మనకే చెందుతుంది. ఇవ్వాళ అందరం ఇక్కడే భోజనం చేద్దాం. రామరాజు గారో.. మీ చేతికి పని చెప్పండి" అంటే నవ్వుతూ "గాడిద కొడకా" అని తిట్టాడు. ఈయన అంతే మెచ్చుకోవడానికి కూడా గాడిద కొడుకనే వాడతాడు. ఏ గాడిద ఈయన్ని ఏం చేసిందో కానీ గాడిదని మాత్రం మర్చిపోడు. కాసేపటికి పిల్లలు కూడా వచ్చారు. ఆడోళ్లంతా కూరగాయలు తరుగుతూ గోంగూర పచ్చడి చేస్తుంటే అమ్మమ్మ మావయ్యలతో పలావు చేయిస్తుంది. తాతయ్య ఒక చేత్తో పప్పు చారు వండుతునే ఇంకో చేత్తో చికెన్ వండేస్తున్నాడు. అందరం కలిసి మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తుంటే నిధికి మొన్న రాత్రి శివ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. శివ వంక చూసి నవ్వింది. చిన్నత్త మళ్ళీ చూసిందని కనిపెట్టేసాడు శివ. రాత్రి అందరూ అంతాక్షరీ ఆడుతుంటే నిధి చిన్నాతో కలిసి పాటలు పాడింది. సురేఖ కూతురు నిధిని, అల్లుడు శివని చూసి అనుమాన పడ్డా మాములుగానే కలిసిపోయారులే ఎంతైనా చిన్నప్పుడు కలిసి ఆడుకున్నవాళ్ళు కదా అనుకుంది. అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెట్టుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు. వసుధ కోడలి గురించి ముచ్చట్లు చెపుతుంటే వింటూ కూర్చున్నాడు శివ. చాలా రోజుల తరువాత అమ్మలో చిన్న పిల్లని చూసాడు. పాటలు పాడింది, నిధితో కలిసి ఎగిరింది. ఒకా చిన్న పిల్లలా అయిపోయింది. వీలైనంత త్వరగా నిధిని పెళ్లి చేసుకుని అమ్మకి ఇచ్చేయాలి, అందరిని ఒక ఇంటికి చేర్చాలి అలా చేర్చాలంటే వీళ్లంతా నా మాట వినాలి. అందరూ నా మాట వినాలంటే అందరిని డబ్బుతో కొనాలి. వసుధ : ఏరా ఏమాలోచిస్తున్నావ్ ? శివ : నీ మొహం మీద చిరునవ్వుకి లెక్క కడుతున్నాను. చాలా ఖర్చు ఎక్కువ. ఐదు కిలోల చికెను ఒక్క పూటలో మెక్కేసారు వసుధ : పోతే పోయిందిలే.. ఎంత సంతోషంగా అనిపించిందో.. నాకైతే ఇలా గొడవలు, మనస్పర్థలు లేకుండా అందరం సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. రోజూ ఇలా ఉండాలి. ఆ రోజు నా సంతోషం పట్టలేక పైకి పోతానేమో అని మాట్లాడుతుంటే అమ్మ నోరు మూసేసాడు శివ. అయ్యో.. ఏదేదో వాగేస్తున్నా.. ఇంకెప్పుడు అననులే శివ : పో మా వసుధ : రేపేనా పందిరి వేసేది, ఇందాక వచ్చినట్టున్నారు. ఈ సారి బొమ్మ ఎవరు కొనిస్తున్నారు ? శివ : కిష్టయ్య వసుధ : వాడా.. ఎప్పుడు మన మీద పడి ఏడవడమే.. ఈ సారి వాడికివ్వడమే మంచిది. మన మీద ఏడుపు తగ్గుతుంది. త్వరగా నువ్వు నిధి పెళ్లి చేసుకుని మొదటి పూజ మీరు జరిపిస్తే చూసి తరిద్దును కదా.. రేపేళ్లి మాట్లాడనా శివ : మాట్లాడు వసుధ : నిజంగా.. వెళ్లి అడిగేస్తాను. శివ : ఇస్తారా వసుధ : ఇవ్వకపోతే ఊరుకుంటామా శివ : ఏం చేస్తావ్ వసుధ : ఇంకా ఎన్ని రోజులు, రోజు నువ్వు నా మొహం నేను నీ మొహం చూసుకోవడమే సరిపోతుంది.. అదే నా కోడలు వస్తే.. పొద్దున్నే లేవగానే దాని మొహం చూసి ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటూ పనులు చేసుకుని. ఎక్కడికైనా వెళ్లాలంటే తోడు తీసుకుని.. త్వరగా పిల్లల్ని కనమని దాని చెవిలో నస పెట్టి, మా ఇద్దరికీ పడక నేను దానితో తిట్టించుకుని ఇద్దరం నీ దెగ్గరికి వస్తే నువ్వు ఎవరి పక్కన నిలుచుంటావురా శివ : నేను ఇంట్లో నుంచి పారిపోతాను వసుధ : నిజం చెప్పు నువ్వు నా పక్కా లేక నీ పెళ్ళాం పక్కా ? శివ : ఒకటి చెప్పనా.. బాధ ఒచ్చినా సంతోషం వచ్చినా నీ కంట్లో దాని కంట్లో ఇద్దరికీ కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి, అవి తుడవడానికి నేను పొడి గుడ్డ పట్టుకుని బండలు తుడుస్తూ కూర్చుంటా.. వసుధ కొడుకు మాటలకి నవ్వుతుంటే తన కంట్లో నీళ్లు మెరవడం చూసి తుడిచాడు. "నిధి సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటా కదా" అంటే సరేలే అంది మంచం మీద వాలిపోతూ.. దుప్పటి కప్పి బైటికి వచ్చి కూర్చున్నాడు. ఫోను చూసుకుంటే గీత నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. రేపు చేద్దాంలే అని పడుకున్నాడు. xxxx
వసుధ : శివా.. శివా.. ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు నలుపుకుని చూస్తే అమ్మ ఏమో చెపుతుంది. శివ : ఏమైంది ? వసుధ : గీత వచ్చింది శివ : గీతా.. అదెందుకు వచ్చింది. లేచి చూస్తే గుమ్మం లోపలికి వచ్చిన గీత హాయ్ బావా అని చెయ్యి ఊపుతుంది. గీత : ఎంటత్తా.. నీ తరపు కోడలు అయితేనే దెగ్గరికి తీసుకుంటావా, మీ ఆయన తరపు చుట్టాలని అస్సలు చూసేలా లేవే శివ : స్పీడు తగ్గించు. నువ్వెంటి ఇక్కడా ? అని లేచి ముందుకు వెళ్ళాడు గీత : అడ్డు తప్పుకో నేను స్నానం చెయ్యకుండా వచ్చా అని బ్యాగు తెరిచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి దూరింది. వసుధ : ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ? శివ : నాకేం తెలుసు.. రానీ అదే చెపుతుంది గీత స్నానం చేసి బైటికి వచ్చాక బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చింది. శివ : ఇప్పుడు చెప్పు ఎందుకు పంపించారు నిన్ను గీత : అబ్బా బలే పట్టేశావ్ రా.. అందుకే నిన్ను వదలట్లేదు వాళ్ళు శివ : చెప్పు గీత : నువ్వేం వ్యాపారం పెడుతున్నావో దెగ్గరుండి చూసుకోమన్నారు, ఆ సిటీలో చేసే ఉద్యోగమేదో నీ దెగ్గర చెయ్యమన్నారు. ఎలాగో కాబోయే వాళ్ళం కలిసి పని చేసుకొమ్మని పంపించారు. వసుధ : కాబోయే వాళ్ళా ! గీత : అవునత్తా బావ నన్ను పెళ్లి చేసుకుంటాడుగా అని నవ్వింది శివ : అమ్మా దానికేమైనా పెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు స్నానం చేసి రెడీ అయ్యి బైటికి వచ్చేసరికి వసుధ టిఫిన్ వడ్డిస్తుంటే తింటుంది గీత. "నేను బైటికి వెళ్ళొస్తా " అని వెళ్ళిపోయాడు. గీత : అక్కడేం జరిగిందో చెప్పాడా వసుధ : చెప్పాడు గీత : నన్ను ఇరికించేసాడు, ఒకవేళ నిధి కాకుండా నేను నీ కోడలిని అయితే నన్ను సాధించవుగా వసుధ : నా కొడుకు ఏ కోడలిని ఇంటికి తెచ్చినా నాకేం అభ్యంతరం లేదు గీతా గీత : కానీ నీ మనసులో అయితే నిధి ఉంది కదా, ఒట్టి మాటలు ఎందుకు వసుధ : ఉంది కానీ నీ మీద ద్వేషం అయితే లేదు కదా గీత : అందుకే శివ అంత పద్దతిగా ఉంటాడు. నీ పెంపకానికి ఫుల్ మార్క్స్ అత్తా వసుధ : వాడిని బాధ పెట్టకండి గీత : నేనారకం కాదులే, ఇంకొంచెం చట్నీ వెయ్యి.. "అత్తా.." అని ఉత్సాహంగా లోపలికి వచ్చిన నిధి గీతని చూసి ఆగిపోయింది. వసుధ : రా నిధి గీత : బాగున్నావా నిధి, నన్ను గుర్తుపట్టావా.. గీతని నిధి : హా.. ఎలా ఉన్నారు గీతా అని ముందుకు వచ్చి కూర్చుంది. వెనకాలే వచ్చారు తోడి కోడళ్ళు సురేఖ మరియు గౌరీ. లోపలికి వచ్చి కూర్చున్నాక గీత వచ్చిన విశేషం తెలుసుకుని కాసింత ఆశ్చర్యపోయారు, నిధి మొహం చిన్నబోతే వసుధ ఎవ్వరికి కనిపించకుండా నిధి భుజం రుద్దడం గీత చూసి నవ్వుతూ వసుధ వంక కళ్ళు ఎగరేసింది. గీత : అత్తా నాకీ ఊరు పరిచయం చెయ్యి రేపు పెళ్లయ్యాక ఇక్కడేగా ఉండేది, అన్నీ తెలుసుకుంటా.. నిధి నాకు తోడు వస్తావా నిధి : హా.. అమ్మా నేను ఇంటికి వెళుతున్నా అని లేచి వెళ్ళిపోయింది గీత తిన్నాక కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి పడుకుంటానని శివ మంచం మీద పడుకుంది. సురేఖ, గౌరీ ఇద్దరు కూడా వెళ్లిపోయారు. వసుధ దేవుడి ముందు కూర్చుంది. xxxxxxxxx గౌరీ : అక్కా శివకి అయితే నీ కూతురిని లేదా నా కూతురిని అనుకున్నాం, ఇదేంటి ఇలా అవుతుంది సురేఖ : మంచిదేగా.. శివకి ఆస్తి వస్తుంది, పిల్ల కూడా ఉంది. మన వల్ల వాడు ఎక్కడ అన్యాయం అయిపోతాడో అని భయం ఉండేది ఇప్పుడు ఆ బెంగ తీరింది అని లోపలికి వెళ్ళిపోయింది. గౌరీకి ఒక్కటి మాత్రం అర్ధమైంది, అక్క కూడా అందరి లానే తన స్వార్ధం తనది, కొంచెం సానుభూతి ఉంది అంతే.. లేచి నిధి దెగ్గరికి వెళ్ళింది. నిధి : రా పిన్ని గౌరి : నీకు శివ అంటే ఇష్టమా కాదా ? నిధి : నువ్వేం అనుకుంటున్నావ్ గౌరి : ఇష్టమనే నిధి : ప్రాణం.. నచ్చితే Rate చెయ్యండి
17-03-2025, 12:23 PM
Superb update writer garu
![]() ![]()
17-03-2025, 12:43 PM
Nice update andi
17-03-2025, 01:42 PM
మంచి రసపట్టు లో పడేశారు
17-03-2025, 03:37 PM
Excellent update
17-03-2025, 03:49 PM
చాలా చక్కగా రాస్తూనారూ చాలా బాగా ఉంది అప్డేట్ సాజల్ గారు సూపర్ సూపర్
17-03-2025, 04:02 PM
Nice update
17-03-2025, 08:57 PM
Nice update
17-03-2025, 10:46 PM
E story oka web series tiyachhu sajal garu super undi
18-03-2025, 06:40 AM
Super
18-03-2025, 07:16 AM
18-03-2025, 02:58 PM
Superoo super
18-03-2025, 09:44 PM
![]() ![]()
18-03-2025, 10:56 PM
Update chala bagundhi
19-03-2025, 04:14 AM
Super
19-03-2025, 04:49 AM
Super update
19-03-2025, 05:55 AM
Super chal bagundi
29-03-2025, 10:59 PM
update plz bro
|
« Next Oldest | Next Newest »
|