Posts: 517
Threads: 15
Likes Received: 3,210 in 424 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
10-02-2025, 08:47 PM
(This post was last modified: 13-02-2025, 10:33 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
లవ్ ఎట్ ఫస్ట్ సైట్..
పొద్దున్న..
నా పేరు సాయికృష్ణ.. ఈరోజే సిటీ కి వచ్చా.. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు.. ఇంత కాలం వూళ్ళో మా మేనమామ ఇంట్లో ఉండి చదువుకున్నాం నేను మా చెల్లి...
కొంచెం పెద్దవాణ్ణి అయ్యా కదా ఎదో పని చేసుకుంటూ చదువుకుందాం అని ఇందాకే బస్సు దిగి.. డిగ్రీ కాలేజీ లో అడ్మిషన్ కోసం వచ్చా.. మొదటి రోజు.. ఇంకా ఎక్కువ మంది రాలేదు.. క్లాస్ కి వెళ్లి ఎక్కడ కూర్చోవాలో చూసుకుని కాసెపుండి వచ్చేసా..
కాలేజీ పూర్తయ్యాక దగ్గర్లో ఒక హాస్టల్ చూసుకొని పని కోసం రోడ్డున పడ్డా..
ఇంత కాలం మావయ్య సాయం చేసాడు.. మరీ ప్రైవేట్ కాలేజ్స్ లో ఫీజులు కట్టకపోయిన తిండి బట్ట ఇచ్చాడుగా.. ఎంత కాలం అని ఆయన్ని ఇబ్బంది పెట్టడం.. చెల్లి కి కూడా పెళ్లి చెయ్యాలి.. ఇప్పటినుంచే దాచాలి..
వెతగ్గా ఆలోచించగా క్యాబ్ డ్రైవింగ్ ఐతే నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు, రాత్రి పూట పని చేసుకోవచ్చు, దొబ్బడానికి పైన ఎవడు ఉండడు కాబట్టి.. అదే మనకు సూట్ అయ్యే పని అని డిసైడ్ అయ్యి..
ఆప్ ఇన్స్టాల్ చేసి క్యాబ్ డ్రైవర్ పోస్ట్‌లు వెతగ్గా.. ఒక అన్న ఈరోజే పనిలో జాయిన్ అవ్వమన్నాడు.. క్యాబ్ అతనిది.. డ్రైవింగ్ మనది.. ఖర్చులు పోను షేర్ చేసుకుందాం అన్నాడు..
ఓ కొబ్బరికాయ కొనుక్కొని లొకేషన్ కి వెళ్లి తాళాలు తీసుకొని చిన్న పూజ చేసుకొని లాగిన్ చేశా...
సాయంత్రం..
ఇప్పటికి రెండు ట్రిప్ లు కొట్టా.. అయ్యబాబోయ్ హైదరాబాద్ ట్రాఫిక్ మామూలుగా లేదు.. కాసేపు ఏదోటి తినేసి మళ్ళీ లాగిన్ అవుదాం అనుకుంటూ ఉండగా బుకింగ్ వచ్చింది..
మొదటి రోజే కదా క్యాన్సిల్ కొట్టబుద్ధి కాలేదు.. ఎక్కడో మూడు కిలో మీటర్లు లోపల లోపల సందులు తిరిగితే 20 నిముషాలకి లొకేషన్ కి వెళ్ళా..
నెమలిపింఛం రంగు చీర..గులాబీ రంగు జాకెట్టు..జడలో మల్లెపూల రంగు మల్లెపూలు... నుదుటిన కుంకుమ బొట్టుతో.. కళ్ళతోనే మాట్లాడుతూ నవ్వితే బుగ్గలు కందిపోతాయేమో అన్నట్టు చిరు మందహాసం చేస్తూ ఉందొ వయ్యారి భామ..
తనని చూసి మైమరచిపోతూ అక్కడే పక్కకి ఆగి తననే చూస్తూ ఉండిపోయా కస్టమర్ కి కాల్ చెయ్యకుండా..
ఈలోపు ఇదిగో ఇక్కడ ఉన్నా అన్నట్టు చెయ్యెత్తి పిలుస్తోంది.. నన్నేనా.. ఓహ్ క్యాబ్ నెంబర్ చూసి గుర్తు పట్టినట్టు ఉంది.. తనేనా క్యాబ్ బుక్ చేసింది..వాహ్..
ముందు కూర్చుంటే బావుండు.. ఎంతో ఆశ పడ్డా..
ప్రంపంచంలో ఉండే మగాళ్లతో తనకి పని లేనట్టు వెనక డోర్ తీసుకొని లొకేషన్ ఉందిగా.. చెప్పాలా అంది..
ఓటీపీ అడిగి ఎంటర్ చేసాక లొకేషన్ కంఫర్మ్ చేసుకున్నా.. హా అక్కడికే అంది..
కార్ రివర్స్ చేసి, ముందుకు పోతూ తనని ఓసారి అద్దంలో చూసా.. అప్పటికే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటల్లో మునిగిపోయింది..
మళ్ళీ చూస్తే ఇదివరకు తనని చాల సార్లు చూసా అన్న ఫీలింగ్.. అప్పుడే తన మొహం అంత అలవాటు అయిపోయిందా అనిపించింది..
పరుగు మూవీలో అల్లు అర్జున్ చెప్పినట్టు.. తనకి తెలీకుండానే తను నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.. ఇదేనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే..
ఆకలి ఏటో పోయింది.. ట్రాఫిక్ ఇంకా ఉంటె బావుండు అనిపించింది.. తనని ఇంకా ఎక్కువ సేపు చూడొచ్చు కదా..
కార్లు తిరగలేని ఇరుకు సందుల్లోంచి కార్ రేస్‌లు చేసుకునే వాళ్ళు ఉండే ఏరియా లోకి వచ్చేసాం.. ఒక్కో విల్లా ఒక్కో ఇంద్ర భవనం లా ఉంది..
ఇంతలో.. తనకి కాల్ వస్తే పక్కనే ఉన్నా 2 మినిట్స్ అని చెప్పింది.. మళ్ళీ ఆకలి మొదలైంది.. తలలో గుండెల్లో కడుపులో ఎదో వెలితి.. ఎంప్టీ అయిపోయిన ఫీలింగ్..
తను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి.. ఒక 2 హౌర్స్ వెయిట్ చేస్తావా.. మళ్ళీ అక్కడికే వెళ్ళాలి.. నైట్ ఈ ఏరియా లో క్యాబ్స్ దొరకడం కష్టం అంది..
అంత కంటే అదృష్టమా అని మనసులో అనుకోని.. ఏదైనా తినేసి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తా అని చెప్పా.. తను అలా గేట్ తీసుకొని వయ్యారంగా నడుస్తూ వెళ్ళిపోయింది..
బిల్డింగ్ పైనంతా హడావిడి మ్యూజిక్ బా సందడిగా ఉంది.. ఎదో బర్త్‌డే పార్టీ లా ఉంది.. ఎంతైనా డబ్బున్న వాళ్ళ ఖర్చులే వేరు..
మళ్ళీ తనని ఇంకో రెండు గంటల్లో చూడొచ్చనే ఆనందంలో.. ఎం తిన్నానో ఎంత తిన్నానో కూడా చూసుకోకుండా మళ్ళీ తనని దింపిన ప్లేస్ కి వచ్చి వెయిట్ చేశా..
రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదేమో ఫోన్ చూస్తుండగానే నిద్ర పట్టేసింది..
గట్టిగా డోర్ కొట్టిన సౌండ్ తో మెలకువ వచ్చింది.. కలా.. నిద్ర మత్తులో ఉన్నానా.. తనని చూడగానే షాక్ అవ్వాలా ఇంకేమనాలో కూడా అర్ధం కాలేదు..
మల్లెపూలు రాలిపోయి.. పెదవులు కందిపోయి.. చీర నలిగిపోయి.. సైలెంట్ గా ఎక్కి వెళ్దాం పద అంది..
ఏమని అడగాలో మైండ్ ప్రిపేర్ అవుతుండగా చూసింది చాలు వెళ్దాం పద అంది..
కార్ స్టార్ట్ చేసి ఏమైనా మాట్లాడడం అనుకుంటూ ఉండగానే తను ఎవరికో ఫోన్ చేసి..
హా అత్తా.. బయలుదేరా.. రేపు కూడా రమ్మంటున్నారు.. నైట్ అంతా ఉండాలిట.. నీతో మాట్లాడమని చెప్పా..
అవతల నుంచి వెళ్తావా అని అడిగినట్టుంది.. నీ ఇష్టం అత్తా.. ముగ్గురు ఉన్నారు చూసి మాట్లాడు అని ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి పడుకుంది..
విషయం అర్ధం ఐంది కానీ సరిగ్గా విన్నానో లేదో అని నా మీద నాకే డౌట్ వచ్చింది..
ఇప్పుడు తనని చూస్తుంటే చెదిరిన ముంగురులు చాటున ఇందాక చూసిన అదే అమాయకపు ముఖం వెనకాల ఇలాంటి ఒక భయంకరమైన నిజం ఉంటుందని ఎక్సపెక్ట్ చెయ్యలేదు..
చేతులు కాళ్ళు వాటి పని అవి చేసుకు పోతున్నాయి.. లొకేషన్ రీచ్ అయ్యా.. తనని లేపబుద్ధి కాలేదు.. కార్ పక్కకి పెట్టి.. అద్దంలో తన మొహాన్ని చూస్తూ అలాగే నిద్రపోయా..
కాసేపటికి భుజం మీద చిన్న కుదుపు.. సడన్ గా లేచి చూస్తే.. వచ్చాక చెప్పవా అంటూ.. కార్ దిగి ఎంతైంది అంది..
ఇందాకటి అంతే అన్నా.. రౌండ్ ఫిగర్ చేసి ఇస్తూ నైట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారులే.. ఉంచుకో అంటూ.. రాత్రి మూడైన ఇంకా లైట్స్ వెలుగుతున్న మూడంతస్తుల బిల్డింగ్ లోకి గేట్ తీసుకొని వెళ్ళిపోయింది..
తనని మళ్ళీ చూడాలని పించింది.. చేతిలో తను ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయ్.. గంటకి ఎంతో..
The following 17 users Like nareN 2's post:17 users Like nareN 2's post
• aarya, amarapremikuraalu, Babu_07, DasuLucky, gotlost69, mrsilentmahesh, nomercy316sa, ramd420, ramkumar750521, Ravi21, Saikarthik, shiva9, Sunny73, Sushma2000, Uday, Uppi9848, yekalavyass
Posts: 517
Threads: 15
Likes Received: 3,210 in 424 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
తనని మళ్ళీ చూడాలని పించింది.. చేతిలో తను ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయ్.. గంటకి ఎంతో..
వెళ్తా.. చూస్తా.. కానీ ఎం మాట్లాడాలి.. ఎదో పిచ్చి ధైర్యం.. కార్ లాక్ చేసి బిల్డింగ్ మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే.. లోపల మెట్ల పక్కన కుర్చీలో కూర్చుని కాళ్ళు టేబుల్ మీద పెట్టి ఫోన్ చూసుకుంటున్నాడో మధ్యవయసు మనిషి..
ఎవరి కోసం అన్నాడు..
ఇందాక వెళ్లిన అమ్మాయి కోసం అన్నా..
ఓహ్.. స్పెషల్ బుకింగ్ ఆ.. పేమెంట్ రిసిప్ట్ చూపించమన్నాడు..
లేదు ఇప్పుడు పే చేస్తా అన్నా..
సరే ఒక్కసారికి లేదా గంటకి 14,000 అన్నాడు..
14 వేలా..
ఎం లేవా అని విసుక్కుంటూ బయటకి పొమ్మన్నాడు..
14 వేలా.. ఇంత కాస్టలీ ఫిగర్ ఆ.. బుర్ర తిరిగిపోయింది.. ఇంకా ఈ పూటకి షాక్ లు తినే ఓపిక లేదు.. పొద్దున్నే కాలేజీ కి వెళ్ళాలి..
ఆప్ ఆఫ్ చేసి హాస్టల్ కి వచ్చి పడుకున్నా..ఇంకా నిద్ర పట్టట్లేదు.. తను నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తోందా..
పొద్దున్న..
నాపేరు వర్ష.. చిన్నప్పటినుంచి అదే పేరు... ఇక్కడకి 10 కిలో మీటర్ల దూరంలో వున్న కాలేజీలో డిగ్రీ చదవాలి.. ఈరోజే జాయినింగ్..
మా రత్తమ్మ అత్త ఉందే.. చాల మంచిది.. నాలాంటి అనాధల్ని చాల మందిని చదివిస్తోంది.. రాష్ట్రంలో మూల మూలల్లో ఉన్న ఆశ్రమాలకు లక్షల్లో డొనేట్ చేస్తూ ఉంటుంది..
నేను కూడా పెద్దయ్యాక తనలా సేవ చేస్తూ గడపాలని నా ఆశ.. అందుకే పొద్దున్న నిద్ర లేచి రాత్రి ఒంటికి అంటుకున్న మురికినంత కడుక్కుని.. తలారా స్నానం చేసి.. దేవత లాంటి మా అత్త కి దణ్ణం పెట్టి కాలేజీ కి బయలు దేరా..
పింక్ కలర్ పంజాబీ డ్రెస్ లో క్రాస్ గా వేసిన చున్నీ ని నడుము పక్క ముడి వేసి మెట్లు దిగుతుంటే మా ఫ్రెండ్స్ అంతా ఓఓఓ అంటూ అరుపులు..
నాకో చిన్న స్కూటీ ఉంది.. మెల్లిగా వెళ్లేసరికి ఒక 10 నిముషాలు లేట్ అయింది.. క్లాస్ లోకి ఎంటర్ అవ్వగానే...ఆడ మగ అందరి చూపు నా మీదే..
నా పక్కన కూర్చో అంటే నా పక్కన కూర్చో అన్నట్టు అందరు వాళ్ళ బెంచ్ మీద ప్లేస్ ఇస్తున్నారు..
ఈలోపు సడన్ గా నా చూపు నిన్న నైట్ వచ్చిన క్యాబ్ డ్రైవర్ మీద ఆగిపోయింది..
వాట్.. ఇతను కూడా మా కాలేజీ ఏనా.. చప్పున వెనక్కి తిరిగి 2nd బెంచ్ లో కూర్చుండిపోయా..
దేవుడా.. నన్ను గుర్తు పట్టేసాడా..
వర్ష... అంత టెన్షన్ పడకు.. క్లాసెస్ అవ్వగానే పరుగో పరుగు.. మధ్యలో మాట్లాడేంత టైం ఎక్కడ దొరుకుతుంది..
ఈలోపు లెక్చరర్ వచ్చి అందర్నీ పరిచయం చేసుకోమంటున్నాడు.. ముందు ఎక్కడ చదివాం.. మా గోల్స్ ఏంటి. మా గోల ఏంటి అంటూ..
లేడీస్ ఫస్ట్ అంటూ మా చేతే మొదలుపెట్టించాడు అయన..
ఇక తప్పదుగా.. నా టర్న్ వచ్చేసరికి.. వర్ష అంటూ నా పురాణం చెప్పాల్సినంత మాత్రం చెప్పి కూర్చున్న..
తను నాకేసి చూస్తున్నాడో లేదో చూడాలని పించింది..
అబ్బాయిలు వాళ్ళ ఇంట్రో మొదలు పెట్టగానే టక్కున ఒక్క క్షణం తల తిప్పి అతన్ని చూసి మళ్ళీ తల ఇటు తిప్పేసా..
నేను చూసినప్పుడు నన్ను చూడట్లేదు కానీ నేను తల తిప్పినట్టు తెలిసి నా వైపు తిరిగినట్టు అనిపించింది..
అయినా రాత్రి వున్న ధైర్యం పగలు లేకపోతె ఎలా.. అయినా ఉంటె మాత్రం చూడాలా ఏంటి.. లైట్ తీస్కో.. అనుకోని.. కాసేపు క్లాసులు వింటే కాసేపు బ్రేక్ ఇచ్చారు..
నేనేదో నా మానాన క్రిందటి సంవత్సరం స్టూడెంట్స్ బల్ల మీద చెక్కిన పేర్లని చదువుకుంటుంటే పక్కన అమ్మాయి కాంటీన్ కి వెళ్దామా అంది..
హ అంటూ లేచా.. చూడకూడదు అనుకుంటూనే మళ్ళీ తల తిప్పి తనని చూసి కళ్లు తిప్పేసా.. చూసేసాడు.. నేను చూస్తున్న అని చూసేసాడు.. అనుకున్నంతా అయ్యింది..
పులిహోర కలపడానికి నేనే పెద్ద గరిటె ఇచ్చినట్టు ఇచ్ఛా అవకాశం.. వాణ్ణి ఎలా తరిమెయ్యాలా అని మనసులో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండగా పదా... అంటూ నా పక్క అమ్మాయి నన్ను లాక్కుపోయింది..
ఛ.. కాలేజీ 1st డే అంటే ఎంత ఎంజాయ్ చెయ్యాల్సిన రోజు.. మూడు పాడు చేసుకోకు వర్షా అని మనసుకి నచ్చచెప్పి.. కొత్త ఫ్రెండ్స్ ని చేసుకునే పనిలో పడ్డా..
తర్వాత క్లాసులు.. అవి మామూలే.. కాలేజీ వదిలి.. స్కూటీ దగ్గరకి వచ్చి బండి వెనక్కి తియ్యగానే.. ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.. అదే అతనే.. పొద్దున్న ఎదో పేరు చెప్పాడు.. హ..సాయి..
సాయి - నీతో కొంచెం మాట్లాడాలి..
నేను - నాకు పనుంది..
సాయి - తెలుసు..
నాకు కోపం వచ్చింది.. నేను ఏ పని చేస్తానో తెలిసే వెటకారం చేస్తున్నాడా.. బండి స్టార్ట్ చేశా..
ప్లీజ్ ఒక్క 10 నిముషాలు.. అంటూ హేండిల్ మీద చెయ్యి వేశాడు.. కోపంగా ఒక్కసారి చూడగానే చెయ్యి తీసేసి ఒక్క అడుగు వెనక్కి వేసాడు...
రేపు మాట్లాడదాం అంటూ బండి స్టార్ట్ చేసి.. ఇంటికి వచ్చేసా..
ఒకే కాలేజీ.. రోజూ చూడాల్సిన మొహమే కదా.. రేపు మాట్లాడతా.. అనుకుని పొద్దున్నించి అందాలని బంధించిన చున్నీ పక్కన పడేసి.. సింక్ దగ్గర టాప్ ఆన్ చేసి చల్లని నీళ్ళని దోసిలి నిండా పట్టి మొహం నిండా రాసుకుంటే.. ప్రాణాలు మళ్ళీ తిరిగివచ్చాయ్..
ఈలోపు అత్త వచ్చింది.. కాలేజీ ఎలా ఉంది అని..
బావుంది అత్త.. థాంక్స్ అన్నా..
థాంక్స్ ఏంటే పిచ్చిదాన.. మేమె నీకు థాంక్స్ చెప్పాలి.. నువ్వంటే కుర్రాళ్ళు పడి చచ్చిపోతున్నారు.. డబ్బే డబ్బు.. ఇక్కడ వున్న అమ్మాయిలంతా ఒక ఎత్తు నువ్వొక్కదానివే ఒక ఎత్తు.. సరే రెస్ట్ తీస్కో.. మళ్ళీ రాత్రంతా నిద్ర వుండదు..
నిన్న వాళ్లేనా అత్తా..
అవును.. నైట్ మొత్తానికి లక్ష..
వావ్.. రానీ అత్తా.. ఎంత డబ్బు వస్తుందో రానీ..
మరి ఒకేసారి ముగ్గురంటే పర్లేదా.. అంది అత్త..
పర్లేదత్త.. లక్ష రూపాయలంటే ఏడుగురి జీవితాలు.. నా ఒక్క రాత్రి చీకటి ఏడుగురికి వెలుగునిస్తే ఆ మజా ఏ వేరత్తా..
పిచ్చి పిల్ల.. సరే పడుకో.. 8 కి లేపుతా..
సాయంత్రం..
లేచాక రాత్రికి కట్టుకునే కోక రైక పక్కన పెట్టి బాత్రూం లోకి దూరా.. మళ్ళీ గుర్తొచ్చాడు వాడు.. అదే సాయి.. అసలు రాత్రే వాడి కళ్ళలో వంద ప్రశ్నలు..
ఇక్కడ దాక వచ్చి కూడా నన్ను లేపకుండా వాడూ పడుకున్నాడు..మామూలుగా ఐతే లేపి డబ్బులు తీసుకు వెళ్ళిపోవాలి కదా.. ఏంటో.. అయినా రేపు మాట్లాడదాం అన్నా కదా.. రేపటి సంగతి రేపు అని..
టవల్ చుట్టి బయటకి వచ్చా.. ఎవరో మంత్రి కొడుకు వచ్చాడట.. మంచి హడావిడిగా ఉంది బిల్డింగ్ అంతా.. ఈలోపు అత్త వచ్చి.. ఒసేయ్ ఎక్కువ రెడీ కాకు.. మంత్రి కొడుకు నిన్ను చూసి నువ్వు కావాలంటే అదో గొడవ.. త్వరగా ఎదో ఒక బట్టలు వేసుకొని బయటకెళ్ళు ముందు అంది..
సర్లే.. అనుకుంటూ చేతికి అందిన ఓ పిచ్చి డ్రెస్ వేసుకొని చీర బాగ్ లో సద్ది సైలెంట్ గా కిందకి వచ్చేసా.. అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసే టైం ఇవ్వలేదు అత్త.. వెళ్ళు త్వరగా అని తరిమేసింది..
ఇక తప్పదు అని ఎదురుగ కనపడ్డ క్యాబ్ ఎక్కి బాచుపల్లి వస్తావా అని అడిగా..
ఓహ్ షిట్.. మళ్ళీ వాడే సాయి... నేను క్యాబ్ బుక్ చేస్తే వాడికే బుక్ అవుతుందని ఇక్కడే వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు.. ఇప్పుడెలా..
The following 24 users Like nareN 2's post:24 users Like nareN 2's post
• aarya, AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, chigopalakrishna, coolguy, DasuLucky, Energyking, gotlost69, jackroy63, jwala, K.rahul, nomercy316sa, ramd420, ramkumar750521, Ravi21, Saikarthik, shiva9, Sunny73, Sushma2000, TheCaptain1983, Uday, Uppi9848, yekalavyass
Posts: 124
Threads: 3
Likes Received: 190 in 84 posts
Likes Given: 399
Joined: Jul 2022
Reputation:
4
Story bagundhi bro continue chyndi
•
Posts: 3,573
Threads: 0
Likes Received: 1,308 in 1,018 posts
Likes Given: 190
Joined: Nov 2018
Reputation:
15
బాగుంది మంచి కాన్సెప్ట్ కుమ్మేయ్ బ్రొ
•
Posts: 525
Threads: 0
Likes Received: 304 in 249 posts
Likes Given: 99
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 3,825
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
Excellent start and a different zonar, plz continue
•
Posts: 529
Threads: 0
Likes Received: 408 in 342 posts
Likes Given: 10
Joined: Sep 2021
Reputation:
4
•
Posts: 408
Threads: 0
Likes Received: 515 in 302 posts
Likes Given: 1,100
Joined: May 2019
Reputation:
14
Yes. Love at first site i.e. Bachupalli. Something to happen today itself at the site.
Wonderful narration. Eagerly awaiting the site episode.
•
Posts: 2,749
Threads: 0
Likes Received: 1,946 in 1,504 posts
Likes Given: 7,704
Joined: Jun 2019
Reputation:
22
Concept chala bagundi bro excellent
•
Posts: 1,630
Threads: 36
Likes Received: 13,259 in 1,583 posts
Likes Given: 725
Joined: Jun 2021
Reputation:
660
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 430
Threads: 0
Likes Received: 451 in 302 posts
Likes Given: 856
Joined: Nov 2018
Reputation:
11
•
Posts: 512
Threads: 0
Likes Received: 387 in 260 posts
Likes Given: 689
Joined: May 2024
Reputation:
8
Wow..eppudu start chestara ani choosa kotha story..start chesesaruu.. Nice
•
Posts: 652
Threads: 0
Likes Received: 455 in 368 posts
Likes Given: 1,431
Joined: Sep 2019
Reputation:
7
•
Posts: 517
Threads: 15
Likes Received: 3,210 in 424 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
(11-02-2025, 10:11 AM)Rishithejabsj Wrote: Story bagundhi bro continue chyndi
Sure Bro.. Chinna Kadha.. 10 days lo avvagotteddam..
(11-02-2025, 10:54 AM)Eswar P Wrote: బాగుంది మంచి కాన్సెప్ట్ కుమ్మేయ్ బ్రొ
Thanks Bro..
(11-02-2025, 11:42 AM)Veerab151 Wrote: Super update
Thank You Bro
(11-02-2025, 12:13 PM)Paty@123 Wrote: Excellent start and a different zonar, plz continue
Sure.. Thanks Bro
(11-02-2025, 03:06 PM)Nani666 Wrote: Nie story andi..
Thankyou andi..
(11-02-2025, 03:38 PM)yekalavyass Wrote: Yes. Love at first site i.e. Bachupalli. Something to happen today itself at the site.
Wonderful narration. Eagerly awaiting the site episode.
Sorry Bro.. Ninnu Disappoint cheyyabotunna..
(11-02-2025, 03:50 PM)Saikarthik Wrote: Concept chala bagundi bro excellent
Thanks Bro..
(11-02-2025, 03:56 PM)3sivaram Wrote: ![[Image: main-qimg-46ad5869e3776bf6dd17bf31ed2f638b.jpg]](https://i.ibb.co/d0pMFmTP/main-qimg-46ad5869e3776bf6dd17bf31ed2f638b.jpg)
Its Deep..
(11-02-2025, 04:06 PM)jwala Wrote: Nice superb update.... 
Thank You Miss
(11-02-2025, 04:20 PM)Sushma2000 Wrote: Wow..eppudu start chestara ani choosa kotha story..start chesesaruu.. Nice
Thanks Ammay..
(11-02-2025, 04:28 PM)Hrlucky Wrote: Manchi katha
Thanks
•
Posts: 517
Threads: 15
Likes Received: 3,210 in 424 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
ఓహ్ షిట్.. మళ్ళీ వాడే సాయి... నేను క్యాబ్ బుక్ చేస్తే వాడికే బుక్ అవుతుందని ఇక్కడే వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు.. ఇప్పుడెలా..
సాయి - హాయ్..
నేను - ఇలా తగులుకున్నావేంట్రా బాబు..
సాయి - నేనేం చేశా.
నేను - సరే..ఇప్పటికే లేట్ ఐంది.. ఫస్ట్ ఏదైనా మాల్ దగ్గర ఆపు. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి.. తర్వాత మాట్లాడతా నీతో తీరిగ్గా..
ఏమనుకున్నాడో ఏమో సైలెంట్ గా బండి స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.. అద్దం లోంచి దొంగ చూపులు మాత్రం ఆపట్లేదు..
నా ఫస్ట్ కస్టమర్ దగ్గర కూడా ఇంత ఇబ్బంది పడలేదు నేను.. సడన్ గా బండి ఆగితే ఏంటా అన్నట్టు చూసా.. మాల్ దగ్గర ఆపాడు..
వాడికేసి చూడకుండా బాగ్ తీసుకొని వాష్ రూమ్ కి వెళ్లి నీట్ గా డ్రెస్ అప్ అయ్యి.. వాడికి కనపడకుండా ఇంకో క్యాబ్ బుక్ చేసుకొని కస్టమర్ దగ్గరకి వెళ్ళిపోయా..
ఎందుకో 1st టైం నా మీద వేరే వాడు ఉన్నా సాయి గాడు గుర్తొచ్చాడు.. రేపు మళ్ళీ ఎదురుపడతాడా.. కాలేజీ మారిపోతే..
పొద్దున్న...
వర్ష వర్ష వర్ష.. అస్సలు మైండ్ లోంచి పొవట్లేదు.. తనకెందుకీ ఖర్మ.. తను చేసే పనులు నాకు కోపం తెప్పించట్లేదు.. బాధ తెప్పించట్లేదు..
మానెయ్యమని అడగాలని ఉంది.. కానీ అలా చెప్పడానికి నేనెవరిని.. నా మాటెందుకు వింటుంది.. కనీసం నా మొహం కూడా చూడట్లేదు తను.. అవును హై క్లాస్ ఫిగర్ కదా.. 14 వేలు..
రాత్రి పిచ్చోడిలా మాల్ దగ్గర అలా వెయిట్ చేస్తూ ఉండిపోయా.. నన్ను చూస్తే నాకే నవ్వు వస్తోంది.. అరేయ్ సాయి గా.. హైదరాబాద్ ఎందుకు వచ్చావ్.. ఎం చేస్తున్నావ్..
నిన్న సరిగ్గా ట్రిప్ లు కూడా కొట్టలేదు.. ఇది కరెక్ట్ కాదు..
ఎదో స్నానం చేశా అంటే చేశా.. తిన్నా అంటే తిన్నా.. కాలేజీ కి వచ్చిన మొదలు తనకోసమే వెతుకుతున్నా..
రాలేదు.. తను రాలేదు... నా వల్లే రాలేదా... నాకు మొహం చూపించలేక.. కాదేమో.. రాత్రంతా అందికదా.. అదీ ముగ్గురితో.. అలసిపోయిందేమో.. అనుదుకే రాలేదేమో..
ఇప్పుడు బాధేస్తోంది.. జాలేస్తోంది.. క్లాస్సేస్ వినబుద్ధి అవ్వట్లేదు..
2 పీరియడ్స్ తర్వాత బ్రేక్ ఇవ్వగానే.. తన ప్లేస్ కి వెళ్ళిపోయా.. చేతిలో 2 వేలు ఉన్నాయ్..
మళ్ళీ ధైర్యం చేసి గేట్ తీసి లోపలి వెళ్ళా.. ఇప్పుడు అక్కడ వేరే వాడు ఉన్నాడు.. డే షిఫ్ట్ వాడేమో..
ఎవరికోసం అన్నాడు.. ఎవరైనా పర్లేదు 2 వేలు ఉన్నాయ్ అన్నా.. ఎంత సేపు ఉంటావ్ అన్నాడు.. రెండు గంటలు అన్నా..
నాకేసి అదోలా చూసి 2000 తీసుకొని రూమ్ నెంబర్ 114 కి వెళ్ళు అన్నాడు..
కాలేజీ నుంచి ఇక్కడకి ఎంత ధైర్యం గా వచ్చానో ఇప్పుడు అందులో సగం కూడా లేదు.. లోపలి అడుగు వేయాలంటే భయం భయం గా ఉంది..
ఈలోపు ఒకడు బాయ్ చెప్తుంటే ఒకామె గుమ్మం లోంచి బయటకి చూస్తూ సెండాఫ్ ఇస్తోంది.. జాకెట్ లోంచి వాడు గుచ్చిన 500 నోటు బయటకు వేలాడుతోంది..
మందు వాసనా.. సిగరెట్ వాసనా గుప్పుమంటోంది.. అసలు వర్ష ఇలాంటి ప్లేసులో ఎలా ఉంటోంది.. అనుకుంటూ ఇందాక చూసిన ఆమె దగ్గరకి వెళ్లి వర్ష అన్నా..
వయ్యారంగా జడ వెనక్కి వేసి లోపలి వెళ్తూ వచ్చిన పని చూసుకుపో అని తలుపులు మూసేసింది..
ఏ తలుపు కొడితే ఏమవుతుందో అని భయపడుతూ 114 దగ్గరకి వెళ్లి తలుపు మెల్లిగా తోసా..
త్వరగా రా.. రాత్రికి చాల బుకింగ్ లు ఉన్నాయ్ అంది..
అదేంటి రెస్ట్ తీసుకోరా మీరు అన్నా...
నాకేసి అదోలా చూసి నవ్వుతూ రెండు వేలకి రెండు గంటలు కావాలంటే మాలాంటి వాళ్ళు 24 గంటలు పని చెయ్యాల్సిందే అని నవ్వుతూ షర్ట్ మీద చెయ్యి వేసింది..
నేను కాసేపు మాట్లాడాలి అన్నా..
1st టైం ఆ అంది..
ఇంకా అప్పుడే కాదులే అంటూండగా.. మంచం మీద కూర్చుంది.. బయట బాలేదు కానీ లోపల అత్తరు పరిమళాలు, మల్లెపూలు, రూమ్ స్ప్రే లు బావుంది..
తనకి ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో.. నన్నే చూస్తోంది.. ఎప్పుడు మీదపడతాన అని..
సూటిగా తన కళ్ళలోకి చూస్తూ.. ఇక్కడ వర్ష అని..
పగలబడి నవ్వుతోంది.. తనకోసం వస్తే నా దగ్గరకి పంపాడా మా ముసలోడు..
లేదు తన దగ్గరకి వెళ్లేంత డబ్బు నా దగ్గర లేదు..
మరింకేం బాధ.. కళ్ళు మూసుకో..పెద్ద తేడా తెలీదు..
లేదు తనతో మాట్లాడాలి..
ఓయ్.. తనిక్కడ ప్రిన్సెస్ లాగా.. ఆ రత్తమ్మ మమ్మల్నే తనతో మాట్లాడనియ్యదు.. ఐన అది పక్క కమర్షియల్.. నీలాంటి వాణ్ణి కన్నెత్తి కూడా చూడదు..
లేదు నాతొ మాట్లాడుతుంది.. నేను తన క్లాసుమేట్..
ఓరిని లవ్వా.. ఇదిగో నీ మంచికోసం చెప్తున్నా..రత్తమ్మ మంచిదే.. వర్ష మంచిదే.. కానీ నువ్వు బిజినెస్ కెలికితే చూస్తూ ఊరుకునేంత మంచిది కాదు.. కావాలంటే నీ 2000 నీకు ఇచ్చేస్తా కానీ.. వెంటనే బయటకి వెళ్ళిపో..
అంటే ఈ బిజినెస్ రత్తమ్మ దా.. వర్ష దా..
అరే.. చెప్తుంటే అర్ధం కావట్లేదా.. వర్ష దే ఇదంతా.. కానీ రత్తమ్మ చెప్పినట్టు వింటుంది.. అదే ఎందుకో మాకు తెలీదు.. ఐన తెలుసుకున్నది చాల్లే.. వెళ్ళారా బాబూ అంటూ నన్ను బయటకి తోసేసింది..
నాకూ అక్కడ ఉండబుద్ధి కాలేదు.. బయటకి వచ్చి ఆ బిల్డింగ్ కేసి చూస్తూ కూర్చున్న..
సాయంత్రం...
సడన్ గా బాల్కనీ లో వర్ష లా కనిపించింది.. ఆటోమేటిక్ గా చెయ్యి గాల్లోకి లేచి హాయ్ చెప్పేశా.. మనసంతా నవ్వు, మొహమంతా ప్రేమ వచ్చేశాయ్..
వెంటనే ఫోన్ తీసి ఓ కాల్ చేసింది.. అప్పుడు ఇందాక టేబుల్ దగ్గర ఉన్నా ముసలోడు నాకేసి స్పీడ్ గా రావడం చూసా.. కొంచెం భయం వేసింది.. ఎం గొడవలు పడాలో ఏమో..
దగ్గరకి రాగానే.. వర్ష నిన్ను పైకి తీసుకురమ్మంది అని చెప్పాడు..
నాకు ఇది కలో నిజమో తెలియలేదు.. అదే ట్రాన్స్ లో వాడి వెనకే వెళ్ళిపోయా.. వాడు ఆ టేబుల్ దగ్గర ఆగి 205 అన్నాడు...
హా అన్నా.. ఎం అర్ధం కానట్టు..
అదే వర్ష రూమ్ నెంబర్.. 205 కి వెళ్ళు అన్నాడు..
ఆ మెట్లు ఎక్కుతుంటే అప్సరసల కోసం స్వర్గారోహణం చేస్తున్నట్టు ఉంది.. పరిసరాలు ఇందాక ఉన్నంత చెండాలంగా లేవు.. ఇందాకే కడిగినట్టు ఉన్నారు..
హార్ట్ బీట్ కూడా 205 అయిపొయింది.. తను అక్కడే నా కోసమే తన రూమ్ గుమ్మం దగ్గర ఎదురుచూస్తోంది..
తనని చూసాక.. రా అంటూ లోపలి వెళ్ళింది.. లావెండర్ పూల నైటీ లో చెవులకి చిన్న దుద్దులు.. నుదిటిన చిన్న కుంకుమ బొట్టు తప్ప ఏమి లేవు.. నిన్న పొద్దున్న లా స్వచ్ఛంగా ఉంది..
గదిలోపలికి వెళ్లి తననే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయా.. దూరం నుంచి తెలీలేదు కానీ బుగ్గల మీద వేళ్ళ మచ్చలు.. చెవి కందిపోయినట్టు ఉంది..
నన్ను కూర్చోమని ఓ కుర్చీ చూపించింది.. అలా కూర్చోగానే వెళ్లి తలుపు బోల్ట్ వేసి వచ్చి తనూ కూర్చుంది..
వర్ష - హ ఇప్పుడు చెప్పు ఎం మాట్లాడాలి.. మూడు రోజుల నుంచి నీ బాధ పడలేకపోతున్న.. అడిగేసేయ్ ఎం అడిగేస్తావో..
నేను - నేనేం అడగ్గలను ఎన్నని అడగ్గలను.. నా ప్రశ్నలు తెలిసే కదా తప్పించుకు తిరుగుతున్నావు.. నువ్వే చెప్పు..
వర్ష - ఎందుకు చెప్పాలి..
నేను - హా.
వర్ష - అదే సాయి..నేను నీకెందుకు చెప్పాలి ఏదైనా అని అడుగుతున్నా..
నేను - నా దగ్గర ఆన్సర్ లేదు..
వర్ష- నాకు కూడా.. నీ ప్రశ్నల దేనికి ఆన్సర్ లేదు..
నేను - మరి మానెయ్యొచ్చుగా..
వర్ష - లేదు నాకు డబ్బు కావలి..
నేను - కాదు.. ఒక మనిషి బ్రతకడానికి నీ అంత సంపాదించక్కర్లేదు..అదే గంటకి 14 వేలు..
వర్ష - కొంచెం కోపంగా చూసింది.. (నాకు అందులో బాధ కూడా కనపడింది..)
వర్ష - సరే.. మానేస్తా మానేసి ఎం చెయ్యాలి..
నేను - చదువుతున్నావ్ గా.. మంచి ఉద్యోగం వస్తుంది..
వర్ష - మరి మధ్యాహ్నం లక్ష్మి అక్క దగ్గరకి వెళ్ళావ్ కదా.. తనకి చెప్పావా మానెయ్యమని.. చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొమ్మని.. (అంటే తనూ చెప్పిందా నేను వచ్చిన విషయం..)
నేను - లేదు..
వర్ష - మరి నాకే ఎందుకు చెప్తున్నావ్.. నువ్వు ఉద్ధరించాలి అనుకుంటే దేశంలో చాల మంది ఆడవాళ్లు ఉన్నారు.. వెళ్ళు.. ఇంక నా వెనక పడకు..
అంటూ లేచి తలుపు తీసింది.. నన్నింక వెళ్ళమన్నట్టు..
కరెక్టే.. తన ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు.. బయటకు అడుగేసి ఇంక ఎదో అడుగుదాం అనుకుంటూ వెనక్కి తిరిగా..
రేపు కాలేజీ లో కలుద్దాం అంటూ తలుపులు మూసేసింది..
కొన్ని ప్రశ్నలకి జవాబులు తెలుసుకుందాం అనుకుంటే కొత్త ప్రశ్నలు మొదలు అయ్యాయి నాలో..
బయటకి వచ్చి క్యాబ్ ఆప్ ఓపెన్ చేశా.. తనని ఎక్కడో చూసినట్టు ఉంది.. ఆ విషయం కదా చెప్పాలనుకున్నది.. ఆ విషయం తప్ప అన్ని మాట్లాడా..చ..
రాత్రి రెండింటి వరకు డ్రైవింగ్ చేసి.. హాస్టల్ కి వచ్చి మొన్నటి సాయంత్రం వర్ష అందాన్ని తలుచుకుంటూ నిద్రపోయా..
The following 21 users Like nareN 2's post:21 users Like nareN 2's post
• aarya, AB-the Unicorn, amarapremikuraalu, Anamikudu, chasemaster62, chigopalakrishna, coolguy, DasuLucky, gora, gotlost69, jackroy63, nomercy316sa, Ravi21, Saikarthik, Shabjaila 123, shiva9, Sunny73, Sushma2000, Uday, Uppi9848, utkrusta
Posts: 512
Threads: 0
Likes Received: 387 in 260 posts
Likes Given: 689
Joined: May 2024
Reputation:
8
Ee mooga prema chala variety ga vundhi
•
Posts: 9,964
Threads: 0
Likes Received: 5,690 in 4,665 posts
Likes Given: 4,916
Joined: Nov 2018
Reputation:
48
•
Posts: 529
Threads: 0
Likes Received: 408 in 342 posts
Likes Given: 10
Joined: Sep 2021
Reputation:
4
•
Posts: 124
Threads: 3
Likes Received: 190 in 84 posts
Likes Given: 399
Joined: Jul 2022
Reputation:
4
Superrrrr bro chala intrest ga undhi mundhu mundhu em jaruguthundho chudali
•
Posts: 3,825
Threads: 0
Likes Received: 1,276 in 1,057 posts
Likes Given: 493
Joined: Jul 2021
Reputation:
22
•
|