Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా
#61
ప్రస్తుత సమాజిక పస్థితులకు అద్దం పట్టే కథ 3 భాగాలు, మొదటి భాగం చదవండి

మా మనసు చెప్పిన తీర్పు
[font=var(--ricos-font-family,unset)][Image: image-2025-03-31-143812814.png][/font]
మా మనసు చెప్పిన తీర్పు - [font=var(--ricos-font-family,unset)]1/3[/font]
రచన[font=var(--ricos-font-family,unset)]: [/font]కే[font=var(--ricos-font-family,unset)]. [/font]లక్ష్మీ శైలజ



నాన్నా, గుడ్ మార్నింగ్ అంటూ సుజిత వచ్చి సోఫాలో కూర్చున్న సుధాకర్ పక్కన కూర్చుంది.



గుడ్ మార్నింగ్ సుజీ అన్నాడు సుధాకర్ సుజిత తల నిమురుతూ. 



ఇంక రెండురోజులే ఉంది నాన్నా అంది గునుస్తూ.



ఏం ఫరవాలేదు తల్లీ. సంతోషంగా వెళ్ళండి. సుధీర్ లేచాడా? అంటూ సుధాకర్ చదువుతున్న పేపర్ పక్కన పెట్టాడు. 



వస్తున్నా నాన్నా అంటూ సుధీర్ కూడా వచ్చి సుధాకర్ కు ఇంకోపక్కన కూర్చున్నాడు.



ఇద్దరూ కవలపిల్లలు. ఇంటర్ పాసయ్యి, ఇంజనీరింగ్ లో జాయిన్ అవడానికి రెండురోజుల్లో కడప కు బయలు దేరుతున్నారు. ఇంతవరకూ స్వంత ఊరు నంద్యాలలోనే చదవడం వల్ల ఇప్పుడు హాస్టల్ కు వెళ్ళడానికి వాళ్ళూ, పంపడానికి పెద్దలూ ఇబ్బంది పడ్తున్నారు. 



అమ్మా, నాకు ఆవకాయ పంపిస్తావా? అంది సుజిత, సూట్కేస్ లో కజ్జికాయలు, కారాలు సర్దుతున్న సుజాతతో.



కొబ్బెరపొడి, శెనక్కాయపొడి కూడా సర్దాను తల్లీ అంది వాళ్ళ నాన్నమ్మ సుందరమ్మ.
 “‘థాంక్యూ యు నాన్నమ్మా అంది సుజిత. సుజాత ఇద్దరికీ బెడ్షీట్స్, స్వెట్టర్ సర్దింది.



అమ్మా, నాకు చట్నీ పొడి ఎక్కువ పెట్టమ్మా. టిఫెన్ కు, అన్నం లో కలుపుకోవడానికి. అన్నిటిలోకి పనికొస్తుంది అన్నాడు సుధీర్.



సుజాతాఇంక పిండివంటలు చెయ్యడం చాలు. వచ్చే వారం మనిద్దరం వెళ్ళి చూసి వద్దాము. అప్పుడు కావాలంటే ఇంకా కొన్ని చేసి తీసుకెళ్దాం అన్నాడు సుధాకర్.



తినే గోలలో పడి చదువు సంగతి పక్కన పెట్టకండి. కడప లో మీ మామయ్య ఉన్నాడని, మీకు కొంచెం హోంసిక్ ఉండదని అక్కడ చేర్పిస్తున్నాము. పేమెంట్ సీట్స్ అయినా మీరు కావాలనుకున్న బ్రాంచేస్ కోసం అంత దూరం పంపిస్తున్నాము. నాన్న ఒక్క జీతం తో మన ఇల్లు గడవాలి. గుర్తుంచుకొని బాగా చదువుకోండి అంది సుజాత.



లేదులేమ్మా…”అంటూ మళ్ళీ సోఫాలో ముడుచుకొని పడుకుంటూ అంది సుజిత.



మనలాంటి వారికి క్యాంపస్ సెలక్షన్స్ లో ఉద్యోగాలు తెచ్చుకోవడం లక్ష్యంగా వుండాలి అని సుధాకర్ అనగానే
 “అవున్నాన్నా. కాలేజ్ బైటకు వచ్చిన తరువాత తక్కువ మందికే ఉద్యోగాలొస్తున్నాయి అన్నాడు సుధీర్.



ఇద్దరమూ తెచ్చుకుంటాములే నాన్నా. నువ్వేం దిగులు పడకు సోఫాలో పడుకుని నిద్ర కళ్ళతో సుజిత అనగానే వాళ్ళమ్మ ఇదుగో నిద్ర తగ్గించుకో ముందు అంది నవ్వుతూ.



మాటలకు అందరూ ముసిముసిగా నవ్వారు. 
అలా చల్లగా సాగుతున్న కుటుంబ నావ ముందు ముందు ఎలా సాగుతుందో చూద్దాం.
…..
రోజు ఉదయం కడపలో ఉన్న సుజాత అన్నగారి ఇంటికి చేరుకున్నారు సుధాకర్, సుజాతలు. పిల్లలు కాలేజ్ లో చేరి రెండు వారాలు అవుతోంది. ఒకసారి చూసి వద్దామని వచ్చారు. వచ్చేప్పుడు అరిసెలు, శనగపిండితో రిబ్బన్ కారాలు లాంటి వంటలు చేసి తీసుకు వచ్చి వాళ్ళ పిల్లలకే కాకుండా వాళ్ళ నివదిన వసుంధరకు కూడా ఇచ్చింది సుజాత.



ఎందుకు సుజాతా ఇవన్నీ అంటూ అవి తీసుకోవడానికి మొహమాట పడింది వసుంధర.



అదేమిటి వదినా, వివేక్ కూడా ఉన్నాడుగా. ముగ్గురూ తీసుకుంటారులే అంది సర్ది చెప్తూ.



సుజాత మేనల్లుడు వివేక్ టీ.టీ.డి. వారి వేదపాఠశాలలో వేదం చదువుతున్నాడు. పెద్ద చదువులు చదివించలేక అక్కడ ఉచితం కదా అని చేర్పించారు. అన్న విద్యాధర్ శివాలయం లో అర్చకుడుగా పని చేస్తున్నాడు. స్వంత ఇల్లు తప్ప పెద్ద సంపాదన లేదు. అందుకే పిల్లలిద్దరినీ వాళ్ళింట్లో ఉంచకుండా హాస్టల్ లో ఉంచారు వీళ్ళు.



అన్నయ్యా, ఒకసారి పుష్పగిరికి వెళ్ళిద్దామా? అంది సుజాత రోజు భోజనాలయిన తరువాత.



అవునే తల్లీ. పుష్పగిరి చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటూ ఉన్నాను అని సుందరమ్మ అనగానే 
అందుకే అత్తయ్యా. వెళ్ళి వద్దాము అని సుజాత అంది.



అలాగే అత్తయ్యా. రేపు ఆదివారం ఉదయం ఇక్కడినుండి జీప్ లో వెళ్దాము. మధ్యాహ్నం ఇంటికి వచ్చేయ్యవచ్చు అన్నాడు విధ్యాధర్.



సరే. జీపు నేను మాట్లాడతాను అన్నాడు సుధాకర్.



సుధీర్, సుజిత పెన్నానది పక్కగా వున్న పుష్పగిరి మీద వున్న దేవాలయ శిల్పకళను ఆశ్చర్యంగా చూశారు. ఐదు నదుల సంగమంలో దక్షిణ కాశీగా పిలువబడే ప్రదేశంలో ఆదిశంకరాచార్యుల వారిచే పూజించబడిన చంద్రమౌళీశ్వర స్వామి వారిని పూజించి, విష్ణుమూర్తిని కూడా అందరూ భక్తిగా దర్శించుకున్నారు.



వాళ్ళింట్లో ఉన్న రెండురోజులూ పిల్లలు ముగ్గురూ చక్కగా కలిసిపోవడం చూసి సుధాకర్ కూడా సంతోషపడ్డాడు. సుజిత చేదబావిలో నీళ్ళు తోడింది. సుధీర్ వీధిలో పిల్లలతో క్రికెట్ ఆడాడు, వివేక్ తో కలిసి.
అలా మొదటి సంవత్సరం చకచకా గడిచిపోయింది. పిల్లలు బాగానే చదువుతున్నారు. హాస్టల్ కు అలవాటు పడ్డారు. కానీ సుజిత తన పనులు తను చేసుకోవడానికి కూడా బాగా బద్ధకంగా తయారయ్యింది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన మూడు రోజులూ ఉదయం లేట్ గా లేవడం, తన బట్టలు వాషింగ్ మెషిన్ కు వేసి రెడీ చేసుకోవడానికి కూడా కదలక పోవడం చూసి సుజాత మందలించింది. ఎప్పుడూ టి.వి. చూస్తూ సోఫాలో పడుకుంటోంది. సుధీర్ కూడా అంతే. ఎప్పుడూ మొబైల్ చూసుకుంటూ ఉండటమే.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
రెండవ సంవత్సరం లో శివరాత్రి పండుగ టైం లో వీళ్ళ పిల్లలతో పాటు వివేక్ కూడా నంద్యాలకు వచ్చాడు. 



 “అమ్మా, శివరాత్రి రోజు మనం నంద్యాలకు పేరు రావడానికి కారణమైన నవ నందులను చూసి వద్దామా? ఒకటి రెండు చూశాము గానీ అన్నీ పండుగ రోజే చూడలేదు అన్నాడు సుధీర్.



అలాగే. కొన్ని చోట్లకు బస్ లు ఉండవేమో. కారు మాట్లాడుకొని వెళ్దాము. నంద్యాలలో ఉన్న మహానందీశ్వర స్వామి దేవళం తో మొదలు పెడదాము. అన్నీ చూసుకొని రాత్రికి ఇంటికి చేరవచ్చు అని సుధాకర్ చెప్పాడు. 



అనుకున్నట్లుగా శివరాత్రి రోజు ఉదయం బయలుదేరి నంద్యాల చుట్టుపక్కల ఉన్న తొమ్మిది నందీశ్వరాలయాలను దర్శించుకొని వచ్చారు. ఇందువల్లనే ఇంగ్లీష్ వారు నంది ఆల్ ను నంద్యాలగా పిలిచారని గుర్తుచేసుకున్నారు.



సుజిత జుట్టు చూసి సుందరమ్మ అయ్యో ఇదేమిటే? జుట్టంతా ఇలా అయిపోయింది. ఎర్రగా, చివరలంతా చిట్లిపోయి ఉంది. షాంపూలతో తలకు పోసుకుంటే ఉన్న జుట్టు ఇలాగే పాడైపోతుంది అంటూ సుజితకు నలుగు పెట్టి శనగపిండితో తలకు పోసింది.



సుధీర్ ను చూడగానే నా తండ్రే. హాస్టల్ తిండి తిని ఎంత చిక్కి పోయావురా? అంటూ సుధీర్ కు స్పెషల్ గా మినప సున్ని ఉండలు చేసి పెట్టింది.



పిల్లలు ఇంట్లో కూడా ఒక సిస్టమ్ కొని పెట్టారు. చెరొక లాప్టాప్ ఉండనే ఉంది. సుధాకర్, సుజాతలు ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఎందుకు? డబ్బులు వేస్ట్ కదా? అన్నారు.



టీ.వి. లో కాకుండా ఇందులో సినిమాలు చూసుకోవచ్చు అని చెప్పారు పిల్లలు. వారం వారం చేసే వీడియో కాల్ సిస్టమ్ లో ఐతే బాగా వుంటుందని కూడా చెప్పారు. 
 వీళ్ళు థర్డ్ ఇయర్ కు వచ్చేటప్పటికి వివేక్ వేద విద్య పూర్తయ్యింది. సుజన వివేక్ పెళ్ళి సుజితతో చేస్తే బాగుంటుందని అనుకుంటోంది. కానీ పౌరోహిత్యం లో నిలకడ లేని ఆదాయం ఉంటుంది అని సుధాకర్ అభిప్రాయపడ్డాడు. వీళ్ళిలా మధన పడ్తున్న సమయంలో పిల్లలిద్దరూ సెలవులకు ఇంటికి వచ్చారు. 
 అప్పుడు పిల్లలతో విషయం కూడా చర్చించారు. సుజాత మేనరికం చేసుకొంటే కొత్తగా వచ్చే అత్తగారితో ఇబ్బందులేమైనా వచ్చే అవకాశముండకపోవచ్చని అనుకుంది. సుందరమ్మ కూడా కోడలి వైపే మాట్లాడింది. కానీ సుజిత తన క్లాస్మేట్ శామ్యూల్ ను ప్రేమించాననీ, ఇద్దరం పెళ్ళి చేసుకుందామని అనుకున్నామని గట్టిగా చెప్పేసింది.



హాస్టల్ లో చేర్పించింది మీరు ఇంట్లో డిస్ట్రబెన్స్ లేకుండా చదువుకుంటారని. అంతేగానీ ఇలా ప్రేమ, దోమ అంటారని కాదు అంటూ సుజాత కోప్పడింది. 



అందులోనూ వర్ణాంతర వివాహానికి సుజాత బాగా కంగారు పడింది. 



సుజితా, ఎంత సర్డుబాటుచేసుకున్నా ఎన్ని కలహాలు వస్తాయో? అప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు మన మాట వినక పోవచ్చు. ఇబ్బంది అవుతుంది అంటూ సుధాకర్ కూడా నచ్చ చెప్పాలని చూశాడు.



అయినా సుజిత వినలేదు. సరేనని వీళ్ళే వెళ్ళి అబ్బాయి తల్లితండ్రులతో మాట్లాడారు. వాళ్ళు ససేమిరా వప్పుకోలేదు. 
మా అబ్బాయిని మీ అమ్మాయి వల్లో వేసుకుంది. పెళ్ళి జరిగితే మేము ఇద్దరినీ ఇంట్లోకి రానివ్వము అని అబ్బాయి తల్లి కేకలు పెట్టింది.



పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా! పెళ్ళి చేద్దామండీ అని వీళ్ళెంతో నచ్చచెప్పాలని చూసినా వాళ్ళు వినలేదు.



తొందరపడవద్దనీ, కొద్దిరోజులకు వాళ్ళు వప్పుకోవచ్చనీ ఇద్దరికీ సుధాకర్ నఛ్చచెప్పాడు.



వివేక్ కు కడపలోనే ఇంటర్మీడియెట్ చదివిన అమ్మాయితో పెళ్ళి చేశారు, సుజాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సుజాత కూతుర్ని చేసుకోవాలనుకున్నా అందని ద్రాక్ష పుల్లన సామెత ను రుజువు చేస్తూ అమ్మాయికి వేరే వూర్లో ఉద్యోగం వస్తే వివేక్ కు అక్కడ మళ్ళీ పౌరోహిత్యం వెతుక్కోవాలి కదా? అన్నారు, సుజాత కూతురి ప్రేమ విషయం కొంచెం చెప్పగానే. 



సుజాతకు కళ్ళ నీళ్ళు వచ్చేశాయా మాటలకు.
నాలుగో సంవత్సరం లో క్యాంపస్ సెలక్షన్ లో వాళ్ళిద్దరికీ, శామ్యూల్ కు కూడా ఉద్యోగాలోచ్చాయి. పరీక్షలు పూర్తవగానే ఎవరికీ చెప్పకుండా సుజిత ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంది. అబ్బాయి తల్లి తండ్రులు వీళ్ళను ఇంట్లోకి రానివ్వలేదు. అబ్బాయి మౌనంగా వుండిపోయాడు.



 “వాళ్ళ తప్పేమీ లేదు. భయం లేకుండా ఇంట్లో చెప్పకుండా పిల్లలు పెళ్ళి చేసుకుంటే ఇలాగే చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకు ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే ఎవరైనా ఇలాగే చేస్తారు అని సుధాకర్ శామ్యూల్ కు సర్ది చెప్పాడు.
ఇప్పుడా పిల్లకు అత్తగారింటి అండదండలు దొరకవు. సంసారం ఎలా గడుస్తుందో? అని సుందరమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.



ఇక అన్నింటికీ మనమే ఆదుకోవాలి నిసృహాగా అంది సుజాత.



సుధీర్ పెళ్ళి కూడా త్వరగా చేద్దాం. లేదంటే మంచి సంబంధం వాళ్ళు పిల్లను ఇవ్వరు అన్నాడు ఆలోచనగా సుధాకర్. 



ముగ్గురూ బెంగుళూరు లో ఉద్యోగాలలో చేరారు. శ్రీరామా ఇన్ లో ఒకే ఫ్లోర్ లో పక్కపక్కనే రెండు అపార్ట్మెంట్స్ తీసుకొన్నారు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#63
ఇక ఆలస్యం చెయ్యకుండా ముందుగా చూసి పెట్టిన సురేఖ సంబంధాన్ని సుధీర్ కు ఖాయం చేసుకొన్నారు. వాళ్ళు కొంచెం దూరం బంధువులయ్యారు. సుజిత పెళ్ళి గురించి ముందుగా తెలిసినా పట్టించుకోలేదు. ముందుగా అనుకున్న సంబంధమే కదా అని పెళ్ళి చేశారు. సుజిత వర్ణాంతరం వల్ల సుధీర్ పెళ్ళికి అడ్డంకి కాకుండా పెళ్ళి జరిగినందుకు వీళ్ళు సంతోషపడ్డారు. పెళ్ళి లో కూడా సుజిత, శామ్యూల్ వీళ్ళతో కలవకుండా దూరంగానే వున్నారు, తల్లితండ్రులను బంధువులు ఎగతాళి చేస్తారని.



వీళ్లిద్దరి పెళ్ళిళ్ళయిన నెలరోజులకు ఒకరోజు ఉదయం సుందరమ్మ తనువు చాలించింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నిద్రలోనే వెళ్ళిపోయింది. తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయిందని ఒక విధంగా బాధను దిగమింగుకున్నాడు సుధాకర్. సుజిత పెళ్ళి సుందరమ్మను ఎక్కువగా బాధించింది. బహుశా దిగులు వల్ల ఆమె త్వరగా వెళ్ళిపోయిందేమో.



విషయం విని, నాన్నా, మేము సిమ్లాలో ఉన్నాము. టూర్ ఆపేసి ఇంటికి వస్తే, మళ్ళీ ఇక్కడకి ఎప్పుడు వస్తామో?... డబ్బులు వేస్ట్ అవుతాయి. నేనిప్పుడు రాలేనులే అంది సుజిత. 



సుధాకర్ సమాధానం ఊహించలేదు. ఇంత స్వార్ధ పూరితంగా ఎలా మాట్లాడింది? బంధాలకంటే వీళ్ళకు డబ్బులు ఎక్కువయ్యాయి అనుకున్నాడు. సుధీర్ కూడా భార్యకు జ్వరంగా వుందనీ ఒక్కడే వచ్చి చూసి ఒక గంట వుండి వెళ్ళాడు. 



అమ్మ వీళ్ళిద్దరినీ ఎంతో శ్రద్ధగా పెంచింది. కృతజ్ఞత వీళ్ళకు ఎందుకు లేకుండాపోయింది? ప్రేమగా చివరి చూపు చూడడానికి కూడా ఇబ్బంది పడ్తున్నారు అనుకున్నాడతను. 



మమతలు, మమకారాలు తగ్గిపోతున్నాయా? హాస్టల్ లో చదవడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళతో గడపలేక పోతున్నారేమో! సుధాకర్ నిస్సహాయంగా అనుకున్నాడు.
ఒక ఆరు నెలలు గడిచేటప్పటికి కూతురు గర్భవతి అని తెలిసింది. 



అమ్మా, నేను చేసుకోలేక పోతున్నాను. నువ్విక్కడకు వస్తావా? అంది సుజిత. 



సుజాతకు ఏం చెయ్యాలో తోచలేదు. సుధాకర్ ఒక్కడూ ఇక్కడ ఎలా? అనుకొని మధనపడ్తూ ఉంది.



సరే. అడిగింది కదా. కొద్ది రోజులు వెళ్ళు. మళ్ళీ ఆలోచిద్దాం. నేను వంట చేసుకుంటాలే అన్నాడు సుధాకర్.



===================================================================
ఇంకా ఉంది...
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#64
మా మనసు చెప్పిన తీర్పు - 2
మా మనసు చెప్పిన తీర్పు - [font=var(--ricos-font-family,unset)]2/3 - [/font]



సుజాత వెళ్ళిన తరువాత ఒక వారం రోజులకు కోడలు కూడా గర్భవతి అని తెలిసింది. ఒక పదిరోజుల తరువాత సుధాకర్ కూడా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సుజాత తలమునకలయ్యే పనులల్లో ఉంది. రెండు ఇళ్ళల్లో ఇద్దరు గర్భవతులను కూర్చోబెట్టి చేసి పెడుతోంది. సంతోషంగా వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ యాభై సంవత్సరాల వయసులో గిరగిరా తిరుగుతోంది.



 ఒక రెండు రోజులకు సుధాకర్ కు అర్థమైంది. సుజాత కూతురినీ, కొడలినీ వదిలి రాలేని పరిస్థితులలో ఉందని. అందుకే అప్పట్నుంచీ సుధాకర్ నంద్యాలకు, బెంగుళూర్ కు వారానికీ, పదిరోజులకూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.



  సారి వచ్చినప్పుడు సుధాకర్ ఒక విషయం గమనించాడు. నెలలు నిండిన గర్భవతులు ఇద్దరూ అపార్ట్మెంట్ బయట నెమ్మదిగా వాకింగ్ చేస్తున్నారు గానీఇంట్లో ఎప్పుడూ సోఫాలోకూర్చోనో, బెడ్ మీద పడుకొనో ఉంటున్నారు, రెస్ట్ పేరుతో. సుజాత రెండు ఇళ్ళల్లోకీ పరుగులు పెట్టీ వారికి సేవలు చేస్తోంది. 



 సుధాకర్ నంద్యాల నుంచి రాగానే సాయంత్రం నాన్నా, నా బెడ్ కొంచెం విదిలించి బెడ్షీట్, పిల్లో కవర్స్ మారుస్తావా? అంది కూతురు సుజిత. వింటున్న శామ్యూల్ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.



 “అలాగే మారుస్తాలే అన్నాడు సుధాకర్. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో పని చేశాడు. 



 “అదేమిటి నాన్నా, మ్యాచింగ్ కవర్స్ వెయ్యాలి కదా? అంది మొహం విసుగ్గా పెడ్తూ.
 సుధాకర్ ఏమీ మాట్లాడలేక పొయ్యాడు.



 రాత్రి కొడుకింట్లోకి వెళ్ళినప్పుడు సుధీర్ నాన్నా, రోజు పని మనిషి రాలేదు. నేను గిన్నెలు కడిగాను. నువ్వు వాటిని సర్దిపెడ్తావా అన్నాడు. 



 కోడలు సోఫాలో కూర్చొని టి.వి. చూస్తోంది. పెడతాలే అన్నాడు సుధాకర్. అతను ఓపిగ్గా బుట్టెడు గిన్నెలూ రాక్ లలో సర్ది పెట్టాడు. 



 కానీ ఒక పది నిముషాల తరువాత సుధీర్ వచ్చి ఏంటి నాన్నా ఇది. చిన్న ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్సన్నీ రాక్ లో కుప్పలాగా పోసేశావు అన్నాడు విసుక్కుంటూ.



 సుధాకర్ ఏమీ చెప్పలేకపోయాడు. అలా సుజాతతో పాటు సుధాకర్ కూడా వాళ్ళకు సహాయం చేసేవాడు. అయినా వాళ్ళకు సంతోషం లేదు.



 ఆరోజు ఉదయం సుధాకర్ అపార్ట్మెంట్ బైట వరండాలో పిట్ట గోడను ఆనుకొని నిలబడి రాత్రి జరిగిన విషయం ఆలోచిస్తూ ఉండగా లిఫ్ట్ దిగి వస్తూ సోమశేఖర్ గారు కనపడ్డారు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. పోయిన ఆదివారం రోజు ఇక్కడే కలిశాడతను. తమ కొడుకు, కోడలు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారని చెప్పాడు.



 “సుధాకర్ గారూ బాగున్నారా? అన్నాడు హుషారుగా నవ్వూతూ.



 సుధాకర్ కూడా తన ఆలోచనలను పక్కన పెట్టీ నవ్వు మొహానికి పులుముకొని బాగున్నామండీ అన్నాడు.



 “ఏమిటీ దిగులుగా వున్నారు? మీ పిల్లలంతా ఇక్కడే వున్నారని చెప్పారు కదా! అంతా బాగున్నారా? ఏమీ ఇబ్బంది లేదు కదా? అన్నాడతను పరిశీలనగా సుధాకర్ ను చూస్తూ.



 “.. . అంతా బాగున్నారండీ అన్నాడు సుధాకర్. 



 “మేము ఇప్పుడే వచ్చాము, ఊర్లోనే ఉన్న ఓల్టేజ్ హోం నుంచి అని చెప్పాడతను, అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ. సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయతనికి.



 సుధాకర్ ప్రశ్నార్థకంగా చూశాడతన్ని. పోయిన సారి కలిసినప్పుడు ఆటో లో వచ్చినందుకు వొళ్ళు పట్టేసిందని చెప్తే వేరే ఊరు నుండి రైలు లో వచ్చి స్టేషన్ నుంచి ఆటో లో వచ్చారని అనుకున్నాడు సుధాకర్.



 “మీరు కరెక్ట్ గానే విన్నారు. మేము కొడుకుల ఇంట్లో ఉండము. అప్పుడప్పుడూ వస్తుంటాము. మాకు ఇద్దరు కొడుకులు. ఇంకో కొడుకు, కోడలు, పిల్లలు బాంబేలో ఉంటారు. ఇక్కడి కొడుక్కు ఇద్దరు పిల్లలు ప్రశాంతమైన మొహం తో చెప్పాడతను. 



 “మేము అందరితో కలసి వుంటే, ఇంటి పనులతో నా కంటే మా ఆవిడ బాగా అలసిపోతుంది. తన పిల్లలకు ఇష్టమైన వంటలే కాదు, వాళ్ళ పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ కూడా చేస్తూనే వుంటుంది. అలా చేయకుంటే కోడళ్ళు ఏమనుకుంటారో నని మొహమాట పడ్తూ వుంటుంది. అందుకని కొంచెం దూరంగా వుంటే ఆవిడ సుఖ పడ్తుందనిఅక్కడ వుంటాము అన్నాడాయన గొంతులో ఎలాంటి బాధ కనపడనీయకుండా.



 సుధాకర్ నిజమే అన్నట్లు మౌనంగా తల ఊపాడు, మనసులో అయోమయాన్ని మొహం లో కనిపించనియ్యకుండా. తరువాత కాసేపు వివిధ విషయాలు మాట్లాడుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.



 ఆరోజు సుజాతా, నీకు బాగా పని పెరిగింది కదూ? అన్నాడు సుధాకర్ జాలిగా.



 “ ఏముంది లెండి. మన పిల్లలకేగా చేస్తున్నాను అంది అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు. 
 సుధాకర్ ఇంకేమీ చెప్పలేక పొయ్యాడు. కానీ సుజాత కొంచెం సన్నబడినట్లుగా అతనికి అనిపించింది.



 ఒక నెల రోజులకు ఇద్దరూ ప్రసవించారు. కోడలి తల్లితండ్రులు వచ్చి నామకరణం జరిగిన తెల్లవారి వెళ్ళిపోయారు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వున్నాయి అని చెప్పారు. దాంతో మొత్తం ఇద్దరూ బాలింతలు, ఇద్దరూ పసిపిల్లల పని సుజాత మీద పడింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#65
ఇక సుజాత అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చిన్న పిల్లల పనులతో ఒక్క క్షణం తీరికలేకుండా గడుస్తోందామెకు. ఒక్కోసారి నిద్ర కూడా తగ్గుతోంది. కూతురూ, కోడలూ తమకు కావలసినవి సరిగ్గా ఇవ్వలేదని విసుగును ప్రదర్శించినా పట్టించుకోనట్లు నవ్వు మొహం తోనే తిరుగుతూ ఉండేది. 
 ఇదంతా చూస్తే సుధాకర్ కు కొంచెం ఇబ్బందిగా ఉండేది. సుజాత మొదట్నుంచీ ఎవరైనా ఏమైనా అన్నా తల వంచుకుని పోయే రకం. ఎదిరించి వాదించదు, ఎవరికీ చెప్పదు. అది వీళ్ళు ముగ్గురూ అలుసుగా తీసుకొని సుజాతకు పనిమనిషికి చెప్పినట్లు పనులు చెప్తున్నారు. శామ్యూల్ ఎవరితో పెద్దగా మాట్లాడడు, ఎవరికీ పనీ చెప్పడు.



 సుజాత ఇబ్బందిని ఎలా తప్పించాలా?. అని సుధాకర్ బాధపడ్తున్నాడు. పైగా సుధాకర్ నంద్యాల నుండి వచ్చినప్పుడు సుధాకర్ కూడా సుజాత లాగే పని చేస్తున్నాడు.



 ఒకరోజు సాయంత్రం అమ్మా, ఏంటిది? వీడి బట్టలు అన్నీ కుప్పలాగా ఇలా మడతేశావు? అన్నీ షర్ట్స్, టి.షర్ట్స్, ఒన్ సీ లు, రాంపర్స్, ప్యాంట్స్, నిక్కర్లు, డ్రాయర్ లు, ఇన్నర్స్ అన్నీ విడి విడిగా పెట్టాలి కదా? అని సుజిత అరుస్తోంది. తన ఎనిమిది నెలల పిల్లవాడి బట్టలు చూస్తూ. 



 సుజాత పరుగు పరుగున వచ్చి, సుజిత దగ్గర నిలబడింది. అన్నీ జానెడు బట్టలు. ఏది ఏమిటో కొంచెం త్వరగా అర్థం కాదు. అన్ని రకాలూ విడివిడిగా గా పెట్టాలంటే స్పేస్ చాలదు. కానీ సుజాత ఇవేవీ కూతురితో చెప్పదు. మౌనంగా వినింది.



 “ సారి సరిగ్గా పెడతాలే సుజీ అని చెప్తూ పిల్లవాడి బట్టలు మార్చేసి వెళ్ళింది.



 రాత్రి కోడలు పాపకు పెట్టే అన్నంలో ఒక స్పూన్ క్వినోవా వెయ్యాలి కదండీ అంది .ఎందుకు వెయ్యలేదు అన్నట్లు. 



 ఎనిమిది నెలల పాప. రెండు రోజులనుంచి అజీర్ణంగా ఉందని కోడలు అనుకుంటూ ఉందని ఈరోజు అన్నం కొద్దిగానే చేసింది. కొంచెం లో క్వినోవా ఎందుకులే అనుకుంది.



 “రేపు వేస్తాలే సురేఖా. పూటకు అన్నం లో చారు కలిపి పెడతాను అంటూ వెండి గిన్నెలో చారన్నం కలిపి అందులో కొంచెం బెల్లం ముక్క, కొంచెం నేతి చుక్క వేసి పాపకు తినిపించింది. 
 ఇదంతా చూస్తున్న సుధాకర్ మా అమ్మ కూడా సుజాత ను ఇలా మాటలు అనలేదు అనుకొని దిగులు పడ్డాడు. అపార్ట్మెంట్ బైట వాచ్మెన్ తొట్లల్లో ఉన్న చెట్లకు నీళ్ళు పెడుతుంటే చూస్తూ. కొంతమంది చెట్ల పూలు కోసుకుంటూ ఉన్నారు.



 అదే సమయంలో సోమశేఖరం గారు చెట్లకు ఎరువులు తెచ్చి ఇచ్చారు వాచ్మెన్ కు. సుధాకర్ ను చూసి పలకరింపుగా నవ్వాడు. 



 “ఎప్పుడొచ్చారు? అన్నాడు సుధాకర్.



 “మేమొచ్చి ఇరవై రోజులయ్యింది అన్నాడతను కుర్చీలో కూర్చుంటూ.



 “అవునా! అన్ని రోజులనుంచీ కొడుకు దగ్గరే ఉన్నారా? అన్నాడాశ్చర్యంగా సుధాకర్ కూడా కూర్చుంటూ, ఆదివారం మాత్రమే ఉంటామని ఇంతకుముందు చెప్పింది గుర్తొచ్చి.



 “అవును పండక్కు వచ్చాము. ఇంకా వెళ్ళలేదు. ఆరోగ్యం బాగుంటే అప్పుడప్పుడూ ఇలా ఒక నెల వుంటాము. కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే వెళ్ళి పోతాము, మాత్రం మొహమాటపడకుండా. రెస్ట్ గా వుంటాము. మన ఆరోగ్యం, సంతోషం మనమే చూసుకోవాలి. మన గురించి ఆలోచించే టైం మన పిల్లలకు లేదు. అందుకే నిర్ణయం. అయితే ఇదంతా ఎవరికీ చెప్పం. మీరొక్కరికే చెప్తున్నా. ఎందుకంటే మీరూ నాలాగే ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించింది అన్నాడు సోమశేఖర్.
  మాటలకు సుధాకర్ మొహం లో మళ్ళీ బాధ కనిపించింది. కానీ నోరు తెరచి ఏమీ చెప్పలేడు.
 “సరే. సరే. మీరేం చెప్పకున్నా నాకర్ధమయ్యింది. జాగ్రత్తపడండి, చాలు అంటూ అతను వాచ్మెన్ దగ్గరకు లేచి వెళ్ళాడు.



 సుధాకర్ సాలోచనగా అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు. 



 తరువాత ఒక రోజు సుజాతతో మనం కొద్దిరోజులు నార్త్ ఇండియా టూర్ వెళ్ళి వద్దామా? అన్నాడు.



 “అమ్మో. ఇప్పుడు టూరా? చిన్న పిల్లలతో వీళ్ళు చేసుకోలేరు కదా? అంది ఆశ్చర్యంగా.



 “ఒక పది రోజులు వెళ్ళి వద్దాము. ఫరవాలేదులే అన్నాడు సుధాకర్.



 పిల్లలకు నాలుగోనెల వున్నప్పుడు వీళ్ళిద్దరూ సినిమాకు వెళ్ళారని కోడలు ఎవరిగురించో మాట్లాడినట్లు ఎగతాళి మాటలు మాట్లాడిన విషయం గుర్తొచ్చింది సుజాతకు.



 కూతురు ఇంట్లో చిన్న పిల్లలతో మేము అవస్థ పడుతుంటే నువ్వు హ్యపీగా సినిమా కు ఎలా వెళ్ళావమ్మా? అని అడిగింది.



  విషయం సుధాకర్ కు కూడా చెప్పలేదామె. కానీ మళ్ళీ ఇంకోసారి సినిమాకు పిలిచినప్పుడు వద్దని చెప్పేసిందామె.



 అది గుర్తొచ్చింది సుజాతకు.
 అందుకే వద్దు. వద్దు. పిల్లలు కొంచెం ఎడపిల్లలు కానివ్వండి. కనీసం వాళ్ళకు ఒక సంవత్సరం నిండితే అప్పుడు మనం సినిమాకేకాదు, నంద్యాలకే వెళ్ళవచ్చు అంది నిక్కచ్చిగా.



 సుధాకర్ ఇంకేమీ మాట్లాడలేకపోయ్యాడు.
 అలా రోజులు గడిచిపోతూ పిల్లలకు ఫస్ట్ బర్త్ డే జరిగేటప్పటకి ఒక వారం తేడాగా వీళ్ళిద్దరూ రెండవసారి గర్భవతులు అయినట్లు డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. నిజానికి పిల్లలకు మూడవ సంవత్సరం వచ్చేవరకు ఇప్పుడు అమ్మాయిలు తరువాతి గర్భం గురించి ఆలోచించడం లేదు. కానీ కోడలి అమ్మగారు 11 నెలలో పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసిన ఫంక్షన్ కు వచ్చినప్పుడు సురేఖకు ఒక ఉపాయం చెప్పింది.



 ఆమె దగ్గరికి మనవడు పాక్కుంటూ వచ్చాడు. వీడు ఇంక నడిచేస్తాడు. వీడికొక తమ్ముడో, చెల్లెలో పుడితే నీ పని పూర్తవుతుంది అంది.



 “అదేంటీ? వీడికి థర్డ్ ఇయర్ రావాలి కదా!? అంది సురేఖ ఆశ్చర్యంగా.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#66
మాట నిజమే కానీఒక మూడేళ్ళల్లో ఇద్దరూ కాలేజ్ కు వెళ్ళే వాళ్ళవుతారు. నువ్వింక రెస్ట్ గా నీ కెరీర్ పనులు చేసుకోవచ్చు. పిల్లలు కనడం అనే పని పూర్తవుతుంది. అందులోనూ మీ అత్తగారు ఉన్నప్పుడే మన పని అవ్వాలి. లేదంటే ఇంత చాకిరీ చెయ్యాలంటే పనిమనుషులు చాలా డబ్బు అడుగుతారు. అందులోనూ ఒకరు చాలరు. ఇద్దరిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఆమె తిరుగుతూ ఉన్నప్పుడే నీ పని పూర్తి చేసుకో అని గీతోపదేశం చేసింది.



 సురేఖ విషయాన్ని సుజితకు సింపుల్ గా చెప్పింది.
 “సుజీ, మన కెరీర్ కూడా చూసుకోవాలి కదా! మన పిల్లలను మూడు సంవత్సరాల వరకు మనం దగ్గరుండి చూసుకుంటే వాళ్ళు కాలేజ్ కు వెళ్ళేటప్పటికి మనం మన కెరీర్ లో బిజీ అవ్వొచ్చు. అందుకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నేను డాక్టర్ సలహా కోసం వెళదాం అనుకున్నాను. నువ్వూ వస్తావా? అంది సురేఖ. 



 సుజిత కూడా తనతో పాటూ ప్రెగ్నంట్ అవుతే మొదటి సారి లాగే రెండవసారి కూడా అత్తగారు ఇద్దరికీ సహాయంగా వుంటారు. తను ఒకతే ప్రెగ్నెంట్ అయితే తనకు సరిగా చెయ్యదేమో అని సురేఖ రకంగా చెప్పింది. 



 సునీతకు కూడా పద్ధతి నచ్చింది. 



 “సరే. నేను కూడా వస్తాలే. నేనూ ఎం.బి. . చెయ్యాలి. పిల్లలకు ఒక రెండు సంవత్సరాలు వస్తే వాళ్ళు కాలేజ్ కు వెళ్తారు. నేను చదువుకోవచ్చు అంది సుజిత.



 అలా సురేఖ, సుజాత శ్రమను దోచుకోవడానికి సుజితను వెపన్ లాగా ఉపయోగించుకుంది. ఫలితంగా సుజాత నంద్యాల ప్రయాణం మళ్ళీ సుదీర్ఘంగా వాయిదా పడింది.



 ఇంకో సంవత్సరానికి ఇద్దరూ ప్రసవించి నామకరణాలు జరిగాయి. ఇప్పుడు సుధాకర్ కు కూడా ఇంతకు ముందు లాగా ఆరోగ్యం సహకరించక పోవడం తో నంద్యాలకూ, బెంగుళూర్ కు ఎక్కువ తిరగలేక బెంగుళూర్ లోనే వుంటున్నాడు.



 కానీ అది కూడా ఒక సమస్యే అయ్యింది. కోడలు ఇంటి ఖర్చులు లెక్కపెట్టి, గొణగటం మొదలుపెట్టింది.



 “అదేమిటీ? సరుకులు తెచ్చి ఇరవై రోజులేగా అయ్యిందీ. అప్పుడే ఎలా అయిపోతాయి? అంటూ సుజాతను నిలదీసింది. 



 “అవును సురేఖా. నెలాఖరు లోపల మళ్ళీ కొంచెం సరుకులు తెప్పించాలి. అన్నీ కొంచెం కొంచెమే వున్నాయి అంది సుజాత.



 “అదే నా ప్రశ్న. పోయిన నెల లాగే నెల కూడా తెప్పించాను అంటూ విసుక్కుంది.



 సుజాత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోయింది.
వింటున్న సుధాకర్ కు సారి తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం వల్ల సరుకులు అయిపోయాయని కోడలు అంటోందని అర్థం అయ్యింది.



 అప్పుడప్పుడూ కూతురి ఇంట్లో కూడా సుధాకర్ భోజనం చేస్తున్నాడు. మరి అక్కడ కూడా వాళ్ళకు కోపంగా వుందేమో అనే ఆలోచన కూడా వచ్చింది.



  సారి ఆదివారం సోమశేఖర్ గారు వాకింగ్ కు వెళ్ళినప్పుడు సుధాకరే అడిగాడు.
 “మీరు వచ్చి కొడుకు ఇంట్లో వుంటారుకదా? అప్పుడు ఇంటి ఖర్చు పెరిగితే వీళ్ళు ఇబ్బంది పడతారాండీ? అని.



  సారి సుధాకర్ మాటలకు అతను పకపకా నవ్వాడు. పెళ్ళయిన తరువాత మన పిల్లలు కూడా మనకు పరాయి వాళ్ళే. వాళ్ళ ప్రేమను మనం డబ్బుతో కొనుక్కోవాలి అన్నాడు నవ్వు ఆపి. 
 సుధాకర్ అతని వైపు అర్థం కానట్టు చూశాడు. వాళ్ళకు కావలసిన వస్తువులు వెండి బంగారాలు, బట్టలు లాంటివి గిఫ్ట్ గా ఇస్తూ వుండాలి అప్పుడప్పుడూ. మన దగ్గర డబ్బుందని వాళ్ళకు తెలుసుగా. డబ్బు మొత్తం ఇవ్వమని అడగలేరు. మనం వాళ్ళకు భారమని వాళ్ళు బాధ పడకూడదు అన్నాడు నెమ్మదిగానే ఒకింత బాధగా కూడా.



 సుధాకర్ అవును. నిజంగా ఇది మంచి పనే అన్నట్లు తల వూపాడు. 



  మధ్యనే మహానంది దగ్గర వున్న రెండెకరాల పొలం అమ్మారు. డబ్బు సుధాకర్ దగ్గరే ఉంది. బహుశా డబ్బు కొడుక్కు ఇచ్చెయ్యలేదని కోడలికి కోపంగా వుందేమో. అది మనసులో పెట్టుకొని ఇలా సాధిస్తోందా అనిపించింది కూడా.



 అందుకే తరువాతి నెలలో వచ్చిన పండుగకు అందరినీ బట్టలు తీసుకొమ్మని చెరి పదివేలు ఇస్తే కోడలు సంతోషించింది. అల్లుడు మొహమాటంగా ఎందుకండీ? అన్నాడు.



 అలా పనులు చేస్తూ కూడా పండుగా, పబ్బాలకు ఎదురు డబ్బులు ఇస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా సంవత్సరం నిండబోతోంది. 



 ఒకరోజు ఉదయం సుజాత జ్వరంతో లేవలేక పోయింది. పిల్లల ఏడుపులు, ఆఫీస్ కు వెళ్ళే హడావిడి లతో ఇల్లు కంగాళిగా అయ్యింది. సుధాకర్ సుజాతను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. మామూలు జ్వరమేగా. రోజు ఇంట్లో టాబ్లెట్ వేద్దాం అంది కోడలు. అయినా సుధాకర్ తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చి, బాగా రెస్ట్ గా కూడా వుండమని చెప్పాడు. ఇక ఇంట్లో తకధిమితక అన్నట్లుగా ఉండింది ఒక వారం రోజులు.



 మళ్ళీ మామూలే. సుజాతకు జ్వరం కొంచెం నెమ్మదించగానే అన్ని పనులూ చేయడం మొదలు పెట్టింది. చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. అలా చెయ్యడం సుజాతకు మామూలయి పోయింది. అందరూ కూడా అలాగే అలవాటై పొయ్యారు.



  రోజు మళ్ళీ సుజాత ఒళ్ళు బాగా వేడిగా వుండి కళ్ళు మూతలు పడుతున్నట్లుగా ఉంటే, నెమ్మదిగా రాత్రి వంటింటి పనులు ముగించుకొని వచ్చి, దిండుకు జారిగిలబడి మంచం మీద కూర్చుంది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#67
 సుధాకర్ సాయంత్రమే అనుకున్నాడు, సుజాత రోజు లాగా లేదు అని. నుదురు తాకి చూసి ఒక టాబ్లెట్ ఇచ్చి ‘‘జ్వరం వుంటే అమ్మాయితో చెప్పొచ్చుగా’’ అన్నాడు. వాళ్ళు చాలా బిజీ గా వున్నారు అంది సుజాత పడుకుంటూ. అమ్మతో రెండు ముక్కలు మాట్లాడలేనంత బిజీ కూతురు అనుకుంటూ నిట్టూర్చాడు సుధాకర్.



 రాత్రి సుజాత నిద్రపోయినా సుధాకర్ చాలాసేపు మేలుకొని వున్నాడు. ఇలా ఎన్ని రోజులు జరగాలి? తమకు విశ్రాంతి ఎక్కడా? తమ ఆరోగ్యాలు క్షీణిస్తూన్నాయి. కొడుకు, కూతురు తమ పనులు జరిగితే చాలన్నట్లు ఉన్నారు. తమ ఇంట్లో వుండకుండా వీళ్ళు ఎక్కడికీ పోలేరని వాళ్ళ ధైర్యం. పెద్దవాళ్ళ గురించి ఆలోచించే సమయం వాళ్ళకు లేదు.



 అందుకే తమకు తామే తమ గురించి ఆలోచించాలి. ఇన్ని రోజులు తమ పిల్లలకు సహాయం చెయ్యడం తమ బాధ్యత అనుకున్నారు. అది వాళ్ళకు అలుసుగా అయ్యింది. ఎవరికోసం చేస్తారన్నట్లు అల్లుడు, కోడలు అనుకుంటేకొడుకు, కూతురు తమ పిల్లలకు చేయడం కోసమే తల్లితండ్రులు ఉన్నారన్నట్లు అనుకుంటూ ఉన్నారు.



 ‘అవసరమైతే సర్వెంట్లను, ఆయాలను డబ్బిచ్చి ఏర్పాటు చేసుకుంటారు. లేకుంటే పిల్లలను క్రెచ్ లలో చేర్చుకుంటారులే అని సుధాకర్ మనసు దిటవు చేసుకొన్నాడు. ఇక్కడి నుండి తాము నిష్క్రమించడం ఒక్కటే తమ ఆరోగ్యం బాగుపడటానికి మార్గంగా కనిపిస్తోంది అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు.



 రెండురోజుల తరువాత మార్కెట్ లో కూరలు కొంటున్న సుధాకర్ కు సోమశేఖర్ గారు పళ్ళు కొనుక్కుంటూ కనిపించారు. మొన్నటి నుంచీ సుధాకర్ మనసులో ఉన్న సందేహం తీర్చుకోవాలని అనిపించి అతనితో పాటుగా ఆశ్రమానికి వెళ్ళాడు.



 అక్కడి వాతావరణం ఆశ్రమంలో లాగా అనిపించలేదు. మన ఇంట్లో మనుషులు తిరుగుతున్నట్లుగానే మామూలుగా వుంది.



 అప్పుడు సోమశేఖర్ గారు ఇలా చెప్పారు. 
 “ మా ఆశ్రమంలో మామూలుగా కొడుకులు, కోడళ్ళ దగ్గర ఉంటే ఉండే మానసిక సంఘషణలు, ఉండవు. ఎత్తిపొడుపు మాటలు, విసుక్కోవడాలు లేవు. ఆదరణ పూర్వకమైన చిరునవ్వులు ఉన్నాయి. కాకపోతే మనం డబ్బుతో ఇక్కడి సౌకర్యాలను కొనుక్కోవాలి అన్నాడు సోమశేఖర్.



 పాలిపోయిన మొహం తో చూశాడు సుధాకర్. అవును. ప్రతి రోజూ స్వంత పిల్లలే వాళ్ళ పనులు జరగడం కోసం తల్లితండ్రులను, అత్తమామలను ఈసడించుకొని మాట్లాడుతూ ఉంటే గుండెల్లో పొంగే దుఃఖం బైటికి కనిపించకుండా అదిమి పెట్టుకొని పిల్లల దగ్గరే కుంగిపోతూ బ్రతికే కంటే ఇంతమంది ఫ్రెండ్స్ దగ్గర వుండటం చాలా సంతోషంగా వుంటుంది అన్నాడు మళ్ళీ.



 ‘నిజమే. ప్రతిరోజూ రాత్రి కాగానే ఉదయం నుంచీ వాళ్ళ చేత పడిన మాటలన్నీ కళ్ళనీళ్ళతో గుర్తుచేసుకొని పొగిలి, పొగిలి ఏడ్చేకంటే అదేమేలు కదా. నా కంటే సుజాత ఎక్కువ మాటలు పడ్తోంది అనుకుంటూ సుధాకర్ ఓల్డేజ్ హోం లోపలికి సోమశేఖర్ వెంట నడిచాడు, అక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయో చూడటానికి. 



 అంతా చూసిన తరువాత నలుగురితో కలిసిపోతూ అందరూ ఇంట్లో లాగే మసలుతూ ఉండటం గమనించి సంతోషమే వేసింది. కుటీర పరిశ్రమల లాగా కొన్ని పనులు కూడా ఇష్టమైతే చేసుకోవచ్చు. దానివల్ల కొంత సంపాదన కూడా ఎవరికి వారే చేసుకోవచ్చు. సేల్స్ ఆశ్రమం వాళ్ళే చూసుకుంటారు. ఇది కూడా నచ్చింది సుధాకర్ కు. అయినా మనమేం ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఎక్కువరోజులు ఉండటం లేదు కదా! అందువల్ల డబ్బు గురించి ఇబ్బంది ఉండదులే అనుకున్నాడు.



===================================================================
ఇంకా ఉంది...
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#68
మా మనసు చెప్పిన తీర్పు - 3
మా మనసు చెప్పిన తీర్పు - [font=var(--ricos-font-family,unset)]3/3 - [/font]
[font=var(--ricos-font-family,unset)] [/font]



తెల్లవారి ఉదయం పదిగంటల సమయం లో సుజాత టిఫెన్ తిని నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంది. రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగా సుజాత గబ గబా పనులు చెయ్యలేక పోతోంది. చిన్న పాప నిద్ర పోయింది. పెద్దవాడు తన ఎదురుగా బొమ్మలతో ఆడుతున్నాడు. కూతురు, అల్లుడు ఉదయం ఎనిమిదికి ఆఫీస్ కు వెళ్ళి పోయారు. 



 అదే సమయంలో సుధాకర్ సుధీర్ ఇంట్లోనుండి సుజిత ఇంటికి వచ్చి సుజాతను పిలిచాడు. సుజాత తలుపు తీస్తే సుధాకర్తో పాటు వేలు పట్టుకొని పెద్దపాప కూడా వచ్చింది. చిన్నవాడు ఇంట్లో నిద్ర పోతున్నాడు. కొడుకు, కోడలు ఇద్దరూ ఆఫీస్ కు వెళ్ళారు. 



రోజూ లాగే వాకిట్లో నిలబడి మాట్లాడకుండా సుధాకర్ లోపలికి వచ్చాడు. నిన్న రాత్రి పెద్దపాప ఏడుస్తోందనీ పాప దగ్గరే పడుకోమని కూతురు చెప్తే అక్కడే పడుకున్నాడు. వృద్ధాశ్రమం గురించి సుజాతతో చెప్పడం కుదరలేదు. అందుకని కొద్దిసేపు కూర్చొని మాట్లాడాలనుకున్నాడు. 
 అతను లోపలికి రావడం చూసి చిన్నవాడు ఇంట్లో వొక్కడే అవుతాడేమో అంది సుజాత. 



ఒక ఫోన్ విడియో కాల్ చేసి పక్కన దిండు మీద పెట్టి వచ్చాలే. ఒకటి నా చేతిలో వుంది అన్నాడు ఫోన్ చూపిస్తూ. 



 అది చూసి సరే అంటూ లోపలి వచ్చింది. పెద్దవాడితో కలిసి పెద్ద పాప ఆడుకుంటోంది. 



నిన్న కూరగాయలకు వెళ్ళినప్పుడు సోమశేఖర్ గారితో కలిసి వృద్ధాశ్రమం చూడటానికి వెళ్ళాను అని సుధాకర్ చెప్పగానే, 
అవునా!? సావిత్రి గారెలా వున్నారు? చాలా రోజులైంది వాళ్ళు ఇక్కడికి వచ్చి అంది సుజాత సోమశేఖర్ గారి భార్య గురించి అడుగుతూ. 



వాళ్ళు మనకంటే చాలా సంతోషంగానే వున్నారు. నేను మనగురించి హోం లో మాట్లాడటానికి వెళ్ళాను అని సుధాకర్ చెప్తూ వుండగానే 
వద్దులెండి. నాలుగు రోజులు ఉంటే జ్వరం తగ్గిపోతుంది అంటూ సుజాత సోఫాలో పడుకుంది, సుధాకర్ ఇంతకు ముందు సినిమాకో, టూర్ కో వెళ్దామని చెప్పినట్లు చెప్పగానే. 
సారి మనం తప్పకుండా వెళ్తున్నాము. జ్వరం ఇప్పుడు తగ్గుతుంది. మళ్ళీ రాదనే నమ్మకం లేదు. నిన్ను నువ్వు చూసుకోవడం లేదు. పిల్లలకు కొంచెం దూరంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంక నువ్వు రానని చెప్పకు. నీ పిల్లలను నువ్వు చూశావు గదా? అలాగే వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకుంటారు. 



ఎక్కడైనా మనం డబ్బు ఇస్తూనే ఉన్నాము, ఏదో ఒక రూపంలో. అదే డబ్బు అక్కడ కడతాము అంతే. నువ్వింక కాదనకు. హోమ్ వాళ్ళతో మాట్లాడాను. పిల్లలందరితో రేపు మాట్లాడి ఎల్లుండి ఆదివారం మనం వెళ్ళే ఏర్పాట్లు చేశాను. మనకు కావలసిన వస్తువులు, బట్టలు రేపు సర్దాలి అన్నాడు సుధాకర్. 



అంతావిని సుజాత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి, తాము వెళ్ళిపోతే చిన్నపిల్లలతో తమ పిల్లలు ఎంత కష్టపడతారో అనుకొని. 



అనుకున్నట్లుగానే సుధాకర్ ఆదివారం రోజు తమ పిల్లలను, కోడలిని, అల్లుడినీ సమావేశపరిచి తాము వృద్ధాశ్రమానికి వెళ్తున్నట్లు చెప్పాడు. 
ఏం మామయ్యా, ఇక్కడ మీకు ఇబ్బంది గా వుందా? శామ్యూల్ అడిగాడు. 
అతనికి ఇంట్లో ఎలా జరుగుతోంది అని పని వివరం తెలియదు. ఆఫీస్ పని మాత్రమే అతని లోకం. 



అవును శ్యామ్యూల్. మేము మీ పిల్లలను చూసే ధ్యాసలో పడి మా ఆరోగ్యాలను చూసుకోలేక పోతున్నాము. ఇద్దరికీ విశ్రాంతి తక్కువవుతోంది. అందువల్ల ముందు మీ అత్తయ్యగారు చాలా నీరసంగా వుంటున్నారు. డాక్టర్ గారు విశ్రాంతి కావాలంటున్నారు అన్నాడు సుధాకర్. 



సరే మామయ్యా. మీకు అక్కడేమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేయ్యండి అని చెప్పి రూం లోనికి వెళ్ళిపోయాడు శామ్యూల్. 



అతను వెళ్ళే వైపు సుజాత నిర్లిప్తంగా చూసింది. 



అత్తయ్యగారికి బాగాలేక పోతే మందులు వాడుకోవాలి గానీ ఇలా ఇల్లొదిలి వెళ్తారా? అంది కోడలు నిష్టూరంగా. వాళ్ళు వెళ్ళిపోతే రేపట్నుంచి ఇంట్లో ఎంత ఇబ్బందీ అని కోడలు కంగారు పడుతోంది. 



నిజమే. కానీ మందుల దారి మందులదీ. మీ అత్తగారి ఆరోగ్యం దారి ఆరోగ్యందీ అయ్యింది కదా. మందులు వాడటమే కాదు. విశ్రాంతిగా కూడా వుండాలి అంటారు డాక్టర్ గారు. ఎదురుగా పిల్లలను చుస్తూ వాళ్ళ అవసరాలను తీర్చకుండా మీ అత్తగారు చూస్తూ కూర్చోలేరు. డాక్టర్ గారు స్థలం మార్పు కావాలన్నారు కూడా అన్నాడు సుధాకర్. 
ఏమ్మా! నీకు బాగా లేనప్పుడు మందులు వాడి విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఎందుకిలా అందరినీ కంగారు పెడతావు? చెయ్యగలిగిన పనులే చెయ్యొచ్చు కదా? ఇప్పుడు చూడు.. అందరూ అన్నిపనులూ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడాలో? అన్నాడు సుధీర్. 



అదేమిట్రా, అలాగంటావు? మీ పిల్లల పనులు మీరు చేసుకోలేరా! కొడుకువైపు వింతగా చూస్తూ అన్నాడు సుధాకర్. 



మేము ఇంట్లో అన్నీ పనులూ చేసి మళ్ళీ ఆఫీస్ కు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది? అమ్మ కూడా వుంటే అందరం తలా ఒక పని చేసుకుంటాము కదా? విసుక్కుంటూ అన్నాడు సుధీర్. 



పనులు సరే. కొడుకు, కూతురూ వుండి కూడా వీళ్ళు వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్తున్నారూ?.. అని చుట్టుపక్కల వాళ్ళు మమ్ములను ఎంత చులకనగా చూస్తారు? మేము మీకేదో అన్నం పెట్టకుండా వేధిస్తున్నట్లు మీరు ఇల్లు వదిలి వెళ్ళి పోవడం ఏంటి? కోడలు కూడా విసుక్కుంది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#69
మీరిద్దరూ అనవసరంగా ఎవరైనా ఏమో అనుకుంటారని ఆవేశపడవద్దు. మా ఇష్ట ప్రకారమే మేము వెళ్తున్నాం. మీకు తెలుసు.. మాకు పిల్లలు ఇష్టమని. మా ఎదురుగా వాళ్ళు ఇబ్బంది పడ్తుంటే చూడలేము. అందుకే కనీసం మేమింకా ఆరోగ్యంగా మిగలాలంటే మాకు ఇపుడు విశ్రాంతి అవసరం అని నెమ్మదిగానే చెప్పాడు సుధాకర్. 
అమ్మా, నీకు బాగలేకుంటే మేము పని చెయ్యమని చెప్తామా? రెస్ట్ కావాలని నువ్వు చెప్పొచ్చుగా? మాకేం తెలుస్తుంది? అందరూ వుండి కూడా ఎవరూ లేనట్లు ఇప్పుడిలా మీరు ఆశ్రమానికి వెళ్ళడం ఎందుకు? పోనీ నంద్యాలలో మన ఇంటికే వెళ్ళండి అంది సుజిత కోపంగా ఏడుస్తూ. 



మాటలకు నిస్సహాయంగా చూసింది సుజాత. 



నంద్యాలకు వెళితే తనకు రెస్ట్ ఉండదు కదా? పని వాళ్ళు ఉన్నా మళ్ళీ ఇంట్లో పనులు చేస్తుంది. అందుకే విశ్రాంతిగా వుంటుందనే ప్రస్తుతానికి ఆశ్రమానికి వెళ్తున్నాం. మాకు ఆరోగ్యం కుదుట పడిన తరువాత నంద్యాల లో మనింటికి వెళ్తాము. 



మిమ్ములను పెంచాము. మీ పిల్లలను కూడా పెంచే శక్తి మాకు లేదు. అందరూ ఇలా ఇల్లు వదలి ఆశ్రమానికి వెళ్ళమని నేను చెప్పడం లేదు. మేము విశ్రాంతి కోసం వెళ్తున్నాం. పూర్వం లాగా అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల లాంటి బంధువుల ఇళ్ళకు వెళ్ళి నెలలు నెలలు ఉండే పరిస్థితి లేదు కదా! తరువాత నేను ఒకరిద్దరు పనివాళ్ళను ఏర్పాటు చేసుకుని అమ్మకు రెస్ట్ ఇవ్వాలి. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి, చాలు అని చెప్పాడు సుధాకర్. 



వింటున్న ముగ్గురూ ఇంకేమీ మాట్లాడలేక పొయ్యారు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. తాము మరీ ఎక్కువగా వాళ్ళను ఇబ్బంది పెట్టామా? అని కూడా వాళ్ళకు అనిపిస్తోంది గానీ వొప్పుకోవడానికి మనసు రావడం లేదు. అహంకారం అడ్డు వస్తోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లయ్యింది వాళ్ళపని. 



పిల్లల గురించి ఇంక ఆలోచించకుండా రేపు ఉదయం తాము చేరబోయే తీరం తమకు ప్రశాంతతను చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారా పండుటాకుల లాంటి దంపతులు. 
===================================================================
సమాప్తం
===================================================================
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#70
నరకం నుండి స్వర్గానికి
రచనL. V. జయ






బెంగుళూరు లో వున్న తన ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి  బై చెప్పి చెన్నై బయలుదేరింది జాగృతి. చెన్నై లో తన క్లాస్ మేట్ రజిని పేయింగ్ గెస్ట్ గా వున్న చోటకి వెళ్ళింది.



జాగృతిని చూసి చాలా ఆనందపడింది రజిని. "ఎలా వున్నావ్? ఎన్నాళ్ళు అయ్యింది మనం కలిసి. యూఎస్ నుండి ఎప్పుడు వచ్చావ్ ? యూఎస్ ఎలా వుందిలో లైఫ్ ? బెంగుళూరు లో కదా చేస్తున్నావ్? ఇప్పుడు చెన్నై ఏంటి?" గలా గలా మాట్లాడుతుంది రజిని .



"ఆగు. ఆగు. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగేస్తే ఎలా?" అని అన్నిటికి సమాధాం చెప్పింది జాగృతి. "వన్ మంత్ అయ్యింది యూఎస్ నుండి వచ్చి. చాలా బాగుంది.బెంగుళూరు వచ్చాక జాబ్ కి అప్లై చేస్తే ఇక్కడ వచ్చింది. మంచి పొజిషన్, శాలరీ ఎక్కువ. అందుకని ఇక్కడకి వచ్చేసాను." అంది జాగృతి.



"నువ్వేమో ఇప్పుడే యూఎస్ నుండి వచ్చావ్. నేను ఇంకొన్నాళ్లలో యూఎస్ వెళ్తున్నాను " అంది రజిని. 



"ఓహ్. వావ్ . కంగ్రాట్స్. అక్కడ జాబ్ వచ్చిందా? " అంది రజిని హత్తుకుంటూ జాగృతి. 



"నాకు పెళ్లి సెటిల్ అయ్యింది. పెళ్లి తరువాత వెళ్ళిపోతున్నాను." అంది రజిని.  



మాట్లాడుతూ రూమ్ వరకు వచ్చారు ఇద్దరూ. రూమ్ చాలా చిన్నగా వుంది. అందులో నాలుగు మంచాలు. మంచాల మధ్యలో నడిచే దారి తప్ప వేరే జాగా లేదు.  విండోస్ లేవు రూమ్ కి. డోర్ లోంచి వచ్చే వెంటిలేషన్ తప్ప వేరేగా గాలి వచ్చే అవకాశం కూడా లేదు. ఖాళీగా వున్న బెడ్ చూపించి "ఇది నీ ప్లేస్. బెడ్ కింద నీ సామాన్లు పెట్టుకో " అంది రజిని. బెడ్ మీద మ్యాట్రెస్ లేదు. బెడ్ కింద సూట్ కేస్, బకెట్, మగ్,కంచం, గ్లాస్, మాసిపోయిన బట్టలు  పెట్టుకున్నారు. ఎక్కడ కబోర్డ్స్ లేవు.     



తరువాత డిన్నర్ కి తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా మంది అమ్మాయిలు వున్నారు. అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని వచ్చి, మెట్ల మీద కూర్చుకుని తిన్నారు. ఎక్కడ డైనింగ్ టేబుల్ కనపడలేదు జాగృతి కి. తిన్నాక అందరూ ఎవరి ప్లేట్స్ వాళ్ళు లైన్ లో నించుని కడుక్కుని ఎవరి రూమ్ కి వాళ్ళు తీసుకుని వెళ్లారు. కాసేపు కాలేజీ విషయాలు మాట్లాడుకుని పడుకున్నారు. జాగృతికి నిద్ర పట్టలేదు. 



మర్నాడు ఉదయాన్నే 3 కి జాగృతి దగ్గరకి వచ్చి రజని "లే ఇంక" అని చెప్పింది. 



"అప్పుడే ఏంటి. నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఇప్పుడే కొంచెం పడుతోంది" అంది జాగృతి.



"ఇంకొంచెం లేట్ అయితే బాత్రూమ్స్ ముందు పెద్ద లైన్ ఉంటుంది. నీకు రోజు ఫస్ట్ డే కదా ఆఫీస్ కి. స్నానం చేసేసి పడుకో కావాలంటే" అంటూ బలవంతంగా లేపింది రజిని. 



'ఇది పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లాగ లేదు. హాస్టల్ లాగా వుంది. ఇంక ఇక్కడే, ఇలాగే బతకాలా?' అని బాధపడింది జాగృతి.   
   
ఆఫీస్ లో , HR ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక, హిమాని ని పరిచయం చేసారు. హిమనీ నార్త్ ఇండియన్ అమ్మాయి. ఆఫీస్ అంతా చూపిస్తూ, అందరిని పరిచయం చేసింది. ఆఫీస్ లో పెద్ద కాంటీన్, లైబ్రరీ, జిమ్, మెడిటేషన్ రూమ్, ప్లే ఏరియా లో టేబుల్ టెన్నిస్, మినీ గోల్ఫ్ ఇలా చాలా వున్నాయి. ఆఫీస్ చాలా నచ్చింది జాగృతి కి. 'ఉండడానికి కూడా సరి అయిన ప్లేస్ దొరికితే బాగుణ్ణు.' అనుకుంది మనసులో. 



"ఎక్కడ పని చేసావ్ ఇంతకు ముందు?" అడిగింది జాగృతిని హిమాని. 



"యూఎస్ లో. కొన్ని రోజుల క్రితమే వచ్చాను" చెప్పింది జాగృతి . 



"నీకు హిందీ వచ్చా". 



వచ్చంది జాగృతి.



"ఎక్కడ వుంటున్నావ్?" 



"నా కాలేజీ ఫ్రెండ్ ఉంది హాస్టల్ లో. అక్కడే ఉంటున్నాను. " 



"ఏమైనా వేరే ప్లేస్ వెతుక్కుంటున్నావా" అడిగింది హిమాని.



" నిన్నే వచ్చాను చెన్నై. నాకు ఇక్కడ ఏమి తెలియదు ఇంకా. చూద్దాం" అంది జాగృతి. 



"సరే. నీకు వేరే ప్లేస్ కావాలంటే చెప్పు. నేను పేయింగ్ గెస్ట్ గా వున్న చోట ఉండచ్చు కావాలంటే" అంది హిమాని.



"సరే. అవసరం అయితే చెపుతాను" అంది జాగృతి. 



రోజు సాయంత్రం తన రూమ్ కి వెళ్తూ, మ్యాట్రెస్ తో సహా కావాల్సిన సామాన్లు అన్ని కొనుక్కుని వెళ్ళింది హాస్టల్ కి. రోజు కూడా నిద్ర పట్టలేదు జాగృతి కి .



నెల రోజుల్లో రజిని పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్ళిపోయింది. హాస్టల్ లో ఉండడం చాలా కష్టంగా వుంది జాగృతి కి . రోజూ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లి, చట్నీ, డిన్నర్ లో బీన్స్ కూర, సాంబార్. సాంబార్ లో ఒక రోజు బల్లిని చూసింది జాగృతి. రోజు నుండి హాస్టల్ లో తినడం మానేసింది. నిద్ర సరిపోకపోవడం తో ఒక రోజు ఆఫీస్ లో మెడిటేషన్ రూమ్ లోకి వెళ్లి పడుకుంది. హిమనీ అది చూసి "చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమయ్యింది. అంతా ఒకే నా?" అని అడిగింది. హాస్టల్ లో తన పరిస్థితి గురించి చెప్తూ ఏడ్చేసింది జాగృతి.



మర్నాడు ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది జాగృతికి. ఫోన్లో ఎవరో పెద్దాయన పాత హిందీ పాటని ఈల వేసి " పాట ఏంటో చెప్పు" అని అడిగారు. ఆయన ఎవరో, ఎందుకు అలా అడిగారో తెలియదు కానీ అడిగిన వెంటనే పాడింది. "కరెక్ట్. నీ గొంతు బాగుంది. యు ఆర్ సెలెక్టెడ్ " అని ఫోన్ పెట్టేసారు పెద్దాయన." ఏమి అర్ధం కాలేదు జాగృతికి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#71
సంభాషణ తనకి జీవితాంతం మర్చిపోలేని ఎన్నో మంచి అనుభూతుల్ని ఇస్తుందని అప్పుడు తెలియలేదు జాగృతికి .   



తరువాత హిమాని వచ్చి అడిగింది "అంకుల్ ఫోన్ చేసారా?" అని. 



" అంకుల్?" అంది జాగృతి .



"నీ పాట విని, నువ్వు సెలెక్టెడ్ అన్నారు. అంకుల్. కృష్ణన్ జి" అని నవ్వుతూ చెప్పింది హిమాని .



"ఓహ్. అంకుల్ అంటే నువ్వు పేయింగ్ గెస్ట్ గా వున్న ఇంట్లో అతనా? ఉదయం ఫోన్ వచ్చింది. ఒక పాటని ఈల చేసి పాట ఎదో చెప్పు అని టెస్ట్ చేసారు " అంది జాగృతి. 



హిమాని నవ్వుతూ "అవును. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. చాలా మంచి వాళ్ళు. నువ్వు అక్కడ చాలా హ్యాపీగా ఉండచ్చు".



 "మరి నువ్వు?". 



" నేను, అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి తరువాత నేను తను వున్న చోటికి వెళ్లిపోతాను" అంది సంతోషంగా హిమాని. 



"ఎవరు? మన కోలిగ్ అవినాష్ నా ?" ఆశ్చర్యంగా అడిగింది జాగృతి. అవునంది  హిమాని.



"నిజమా. హే. కంగ్రాట్స్. ఆమ్ సో హ్యాపీ ఫర్ యూ" అంటూ ఆనందంతో హత్తుకుంది  హిమానిని.



హిమాని పెళ్లి అయ్యి అవినాష్ ఇంటికి వెళ్ళింది.  హాస్టల్ నుండి అంకుల్ వాళ్ల ఇంటికి మకాం మార్చింది జాగృతి . కృష్ణన్ గారు , సుమతి గారు , కృష్ణన్ గారి అమ్మగారు వున్నారు. వాళ్ళ అమ్మాయి యూఎస్ లో MS చేస్తోంది. అందరూ చాలా మంచి వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, సింపుల్ మనుషులు. ఇల్లు కూడా చాలా సింపుల్ గా ఉంది. ఎక్కువ వస్తువులు లేవు ఇంట్లో కానీ కావాల్సినవి అన్ని వున్నాయి. ఒక రూమ్ ఇచ్చారు జాగృతికి. చాలా స్పేషియస్ గా ఉంది రూమ్. రూమ్ లోంచి బయటకి చూస్తే చాలా చెట్లు. ఇది హాస్టల్ కాదు, పేయింగ్ గెస్ట్ అకామడేషన్ కాదు. కృష్ణన్ గారి ఇంట్లో వాళ్ళ కూతురులా వుండే అవకాశం. జాగృతి ఆనందానికి హద్దులు లేవు. 



కృష్ణన్ గారి వాళ్ళ మాట తీరు, పద్దతి చాలా నచ్చాయి జాగృతికి . జాగృతి కూడా చాలా నచ్చింది వాళ్ళకి. జాగృతిని తన ఇంట్లో పేరుతో పిలుస్తారో అడిగి పేరుతోనే పిలిచేవారు వాళ్ళు. జాగృతి కూడ వాళ్ళని అంకుల్, ఆంటీ, పాటి అని పిలిచేది. హిందీ లో, ఇంగ్లీష్ లో మాట్లాడేవాళ్ళు. జాగృతి కి  తమిళ్ సరిగ్గా రాకపోవడంతో తనని ఏడిపించడానికి అప్పుడప్పుడు తమిళ్ లో మాట్లాడి ఆటపట్టిస్తూ ఉండేవారు కృష్ణన్ గారు. అలాగే నేర్పేవాళ్ళు కూడా. సరదాగా ముద్దపప్పు అని, కుట్టి అని పిలిచే వాళ్ళు. వాళ్లతో ఉంటే సొంతవాళ్లతో ఉన్నట్టుగా వుంది జాగృతి కి. కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా అయిపొయింది జాగృతి.



ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలతో,సుమతి గారు పెట్టే మంచి కాఫీ వాసనతో, కృష్ణన్ గారు పెట్టే కర్నాటిక్ సంగీతం వింటూ లేచేది జాగృతి . వేడి వేడి కాఫీ చేతికి తెచ్చి ఇచ్చేవారు సుమతిగారు. ఆఫీస్ కి లేట్ అయిపోతూ ఉంటే టిఫిన్ నోట్లో పెట్టేవారు కృష్ణన్ గారు. సుమతిగారికి  రోజు సాయంత్రం గుడికి వెళ్లే అలవాటు. జాగృతి కూడా ఆఫీస్ నుండి తొందరగా వచ్చిన రోజుల్లో సుమతిగారి తో పాటు గుడికి వెళ్ళేది. ఇద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో TV లేదు. సరదాగా కూర్చుని అందరూ మాట్లాడుకునేవారు. రాత్రిపూట పాత హిందీ పాటలు వినేవాళ్ళు . పాటల్లో సంగీతం, సాహిత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళు .
చాలా ప్రశాంతంగా అనిపించేది జాగృతికి.    



ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు జాగృతిని " మా పెద్ద అమ్మాయి" అని పరిచయం చేసేవాళ్ళు కృష్ణన్ గారు, సుమతి గారు. వాళ్ళ చుట్టాలు కూడా నవ్వుతూ " నీ గురించి విన్నాం. మేము కూడా నీకు చుట్టాలమే." అనేవారు. కృష్ణన్ గారు, సుమతి గారు జాగృతిని కూడా తీసుకుని వెళ్లేవాళ్ళు వాళ్ల చుట్టాల ఇళ్ళకి, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు. జాగృతికి అందరి ఇళ్ళు, వాళ్ళ పద్ధతులు,మాట తీర్లు చాలా నచ్చాయి. అందరూ చదువుకున్నవాళ్ళు, సంస్కారవంతులు. అందరి ఇళ్లలోనూ సంగీత, సాహిత్యాల గురించి,పెయింటింగ్ గురించి చర్చలు జరిగేవి. ఇళ్ళు అంటే ఇలా ఉండాలి, మనుషులు ఇలా ఉండాలి అనుకుంది. 



వీళ్ళని పరిచయం చేసిన తన ఫ్రెండ్ హిమానికి ఎన్నో సార్లు  థాంక్స్ చెప్పింది జాగృతి. హిమని, జాగృతి ఇచ్చింది ఉండడానికి ఒక చోటుని కాదు. ఒక కుటుంబాన్ని.



నరకం నుండి స్వర్గానికి వచ్చినట్టు ఉంది జాగృతికి.



సమాప్తం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#72
సెల్ తెచ్చిన తంటా
[Image: image-2025-04-23-180908833.png]

జీడిగుంట శ్రీనివాసరావు

[b]డిన్నర్ చేసి సాక్షి టీవిలో వార్తలు చూస్తున్న వాసుదేవ్ దగ్గరికి అతని భార్య సునీత వచ్చి, మెల్లగా అంది "ఏమండీ! అమ్మాయి గదిలో నుంచి ఒకటే నవ్వులు, మాటలు. హరిణి ఎవ్వరితోనో మాట్లుడుతోంది. బహుశా ఎవ్వరైనా మగపిల్లాడితో మాట్లాడుతోంది అని అనుమానం గా వుంది" అంది.
[/b]







టీవీ ఆపేసి, “తలుపు కొట్టి పిలిచి అడగలేకపోయావా” అన్నాడు. 







“అడిగాను, చదువుకుంటున్నా. అనవసరంగా ఎందుకమ్మా ఆటంకం పరుస్తావు” అంటూ తలుపు వేసుకుంది. తప్పంతా మీదే. పిల్లల గది అంటూ వాళ్ళని చిన్నప్పుటి నుంచి వేరుగా పడుకోపెట్టారు. యిప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ గదిలోకి రానివ్వడం లేదు” అంది సునీత.. 







“తప్పు నాది అంటావేమిటి, దానికి ఫోన్ ఎందుకే అంటే విన్నావా?” 







“కాలేజీ కి వెళ్లే పిల్ల, ఎక్కడ వుందో ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ కొంటే, యిలా వికవికలు ఏమిటండి” అంది. 







“దాని ఫోన్ డబ్బా ఫోన్, వీడియో రాదు. భయపడక, రేపు ఉదయం అది స్నానానికి వెళ్ళినప్పుడు దాని ఫోన్లో కాల్ లిస్ట్ చూడు, అప్పుడు ఆలోచిద్దాం” అన్నాడు వాసుదేవ్.







ఉదయం హరిణి స్నానానికి వెళ్ళగానే బ్యాగ్ లో వెతికింది సునీత. తాము కొన్న డబ్బా ఫోన్ తప్ప ఏమీ కనిపించలేదు. కాల్ లిస్ట్ చూస్తే సునీత నెంబర్ కి వాసుదేవ్ నంబర్స్ వున్నాయి. ‘అమ్మయ్య.. పిల్ల దారిలోనే వుంది. అనవసరంగా అనుమానించాను’ అనుకుని భర్తకి విషయం చెప్పింది. కూతురు మీద జాలి కలిగి బ్రేక్ఫాస్ట్ పూరీకూర తయారుచేసింది. తల్లి హృదయం కదా.







యిల్లు వూడుస్తున్న పనిమనిషి మంగమ్మ, “అమ్మగారు.. పాపగారి దగ్గర మంచి ఫోన్ ఉందిగా, పాత ఫోన్ నాకివ్వండి అమ్మా, ఎప్పుడైనా పనికి రాకపోతే ఫోన్ చేసి చెప్పగలను” అంది. 







“పాప దగ్గర రెండు ఫోనులు ఎక్కడవే, ఒక్క ఫోను తోనే తలనొప్పిగా వుంటే” అంది సునీత. 







“అదేమిటమ్మా! పాప గారు స్నానం చేసి వస్తున్నప్పుడు చేతిలో కొత్త ఫోన్ పట్టుకుని వున్నారు” అంది మంగమ్మ. 







“నిజమా” అంటూ భర్త చెవిలో వూదింది. 







పుస్తకాల బ్యాగ్ పట్టుకుని “అమ్మా! టిఫిన్ పెట్టు త్వరగా, కాలేజీ కి వెళ్ళాలి” అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి.







ప్లేటులో పూరీలు వేసి కూతురుకి యిచ్చింది సునీత భర్త వంక చూస్తో. బ్యాగ్ పక్కన కుర్చీలో పెట్టి టిఫిన్ తింటోంది హరిణి. వాసుదేవన్ హరిణి బ్యాగ్ తీసుకుని లోపల చూసాడు. కొత్త ఐ ఫోన్ ని బయటకు తీసాడు. టిఫిన్ తిని బ్యాగ్ కోసం చూసుకుని కంగారుగా అటూ యిటు చూసింది. తండ్రి చేతిలో బ్యాగ్, ఐ ఫోన్ ఉండటం చూసి భయం తో వణకటం మొదలుపెట్టింది.







“ఎక్కడిది ఫోన్ నీకు, నెలకు రెండు లక్షలు సంపాదించే నాకే ఐ ఫోన్ లేదు, నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది” అంటూ లాగి లెంపకాయ కొట్టాడు. 







“మీరు ఆగండి, నేను తెలుసుకుంటాను” అంటూ కూతురిని వేరే గదిలోకి తీసుకుని వెళ్లి, “నిజం చెప్పు, ఈ ఫోన్ ఎవ్వడు కొనిపెట్టాడు, ఎవ్వడిది ఈ ఫోటో” అంటూ జుట్టుపట్టుకుని గుంజింది. 







“మా ఫ్రెండ్ యిచ్చాడు అమ్మా, అతను లెక్కలలో ఫస్ట్ వస్తాడు, నాకు లెక్కలు హెల్ప్ చేస్తాను అని ఈ ఫోన్ లో వీడియో కాల్ చేసి నా డౌట్స్ తీరుస్తాడు” అంది ఏడుస్తూ హరిణి.







“అంటే ఐ ఫోన్ నీకు యిచ్చి సహాయం చేసే గొప్పవాడు అని అనుకుంటున్నావా, చిన్న పిల్లలకి చాక్లెట్ యిచ్చి ఎత్తుకెళ్లినట్టే నిన్ను ఈ ఫోన్ యిచ్చి ఎత్తుకెళ్తాడు. చేసింది తప్పు అని తెలిసిందా లేదా” అని అరిచింది సునీత. 







“ఈ రోజు ఫోన్ తిరిగి యిచ్చేస్తాను, యిహ అతనితో మాట్లాడాను, నన్ను నమ్ము అమ్మా’ అంది హరిణి. 



“నువ్వు ఇవ్వక్కరలేదు, కాలేజీ కి కూడా రెండు రోజులు వెళ్లకు వాడి సంగతి తేలేవరకు” అంటూ ఫోన్ తీసుకుని వెళ్లి భర్త చేతికి యిచ్చి “మీరు ఒకసారి కాలేజీ కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ఆ కుర్రాడిని బెదిరించండి. ఎంతవరకు యింట్లో నామీద అరవడం కాదు, మీ ప్రతాపం వాడి మీద చూపించండి” అంది.







ఫోన్ చేతిలోకి తీసుకున్న వాసుదేవ్, “యిదిగో మంగమ్మా.. నీకు ఫోన్ కావాలి అన్నావుగా, ఈ ఫోన్ తీసుకో” అన్నాడు. 







“నాకెందుకు బాబు అంత పెద్దఫోన్, ఏదో మామూలు ఫోన్ చాలు” అంది. 







“తీసుకో మంగమ్మా” అంటూ ఫోన్ యిచ్చేసాడు. 







“అదేమిటి, ఆ అబ్బాయి కి ఫోన్ యిచ్చేసి నాలుగు చివాట్లు పెట్టమంటే మంగమ్మ కి యిచ్చేసారు” అంది మంగమ్మ వెళ్లిన తరువాత. 







“ఆ పిల్లాడికి యిస్తే ఈ ఫోన్ తో యింకో అమ్మాయిని వలలో పడేస్తాడు, వాడి సంగతి మీ తమ్ముడు రికవరీ ఆఫీసర్ గా చేస్తున్నాడుగా.. వాడిని పంపించి బెదిరించమందాం” అన్నాడు.







సునీత తన తమ్ముడు వెంకట్ కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి, “నువ్వు నీ రికవరీ ఏజెంట్స్ ని పంపి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆపిల్లాడి తల్లిదండ్రులని హెచ్చరించి పుణ్యం కట్టుకోరా, మీ బావగారు నన్నూ, దానిని చంపేసేడట్లున్నారు” అంది. 







“నీకెందుకు అక్కయ్య, నేను చూసుకుంటా, వీలుంటే ఆ కుర్రాడి కాళ్ళు విరగకొట్టి రమ్మంటాను” అన్నాడు. 







“ఒరేయ్ అంత పని చెయ్యకు, భయపెట్టి రండి చాలు, వాడూ చిన్నపిల్లాడే గా” అంది సునీత.







రెండవ రోజు పనిమనిషి మంగమ్మ వాచిపోయిన మొఖం తో పనికి వచ్చి, “అమ్మా! మీకు, మీ ఫోన్ కి ఒక నమస్కారం. మా పెనిమిటి నీకు ఈ ఫోన్ ఎక్కడిది, దొంగతనం చేసావా అని తిట్టిపోశాడు. మీరు యిచ్చారు అన్న తరువాత ఫోన్ తీసుకుని చూసి ఫోన్ లో వున్న కుర్రాడి ఫోటో ఎవ్వరిది” అంటూ అనుమానం తో విరగకోట్టాడు అమ్మా. ఫోన్ అంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నాను కాని యిలా దెబ్బలు, అపార్దాలు కూడా వస్తాయి అనుకోలేదు” అంటూ ఫోన్ బల్లమీద పెట్టేసింది.







సునీత తమ్ముడు వెంకట్ తన రికవరీ ఏజెంట్స్ ని తీసుకుని కాలేజి కి వెళ్లి ప్రిన్సిపాల్ తో మాట్లాడి, ఆ కుర్రాడిని అతని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్లి జరిగింది చెప్పాడు.






[b]“ఒరేయ్! చదువుకోమని పంపితే నువ్వు చేసే అని యిదా? అసలు నువ్వు ఐ ఫోన్ ఎలా కొన్నావు? అంటే ఆ నాడు నేను బ్యాంకు నుంచి ఖర్చులు కోసం తెచ్చిన యాభై వేలు నా జేబులోనుంచి కొట్టేసింది నువ్వా, బ్యాంకు నుంచివస్తోవుంటే ఏ జేబుదొంగో కొట్టేసాడు అనుకున్నాను. వేంకట్ గారూ! మా అబ్బాయి మీ అమ్మాయి వంక చూడకుండా నేను ట్రీట్మెంట్ యిస్తాను, మీరు యిహ ప్రశాంతంగా వెళ్ళండి” అని చెప్పి, కొడుకుని బెల్ట్ తో నాలుగు దెబ్బలు వేసి “యిహ సరిగ్గా చదువుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తో కనిపించినా, తెలిసినా చదువు మానిపించి ఆటో కొని యిస్తాను, డ్రైవర్ గా బతకాలి జాగ్రత్తగా వుండు” అన్నాడు.[/b]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#73
యింకో యింట్లో.. 



“ఏమిటే ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తోంది. ఉద్యోగం లేని నీకు అన్ని కాల్స్ ఏమిటి, ఎవ్వరితో మాట్లాడుతున్నావ్?” అన్నాడు రమణ భార్య శ్రీదేవి తో. 



“ఏమిటి.. నేను అడిగేది వినకుండా ఆ సెల్ ఫోన్ లో ఎవ్వరితో మాట్లాడుతున్నావ్?” అన్నాడు మళ్ళీ. 



“అయ్యో! మీరు వచ్చేసారా, వుండండి పాలు వెచ్చపెట్టాను, కాఫీ తీసుకుని వస్తాను” అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్రీదేవి. భార్య వెనుకే వెళ్లిన రమణ కి స్టవ్ మీద గిన్నెలోనుంచి మాడిపోయిన వాసన తో పొగలు వస్తున్నాయి.



“పాలు స్టవ్ మీద ఉదయం పెట్టావా, నీ సెల్ ఫోన్ లాక్కుని పొయ్యిలో పడేస్తాను. యింతకీ ఎవ్వరు నీతో పనిలేకుండా అంతసేపు మాటలుడుతున్నారు?” అన్నాడు. 



“మా అమ్మానాన్నా అండి, సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పుతున్నారు” అంది.



“ఏడిచినట్టు వుంది. చూసావుగా పాలు ఎలా మరిగిపోయి మబ్బుల్లో కలిసిపోయాయో, పాల వాన కురిసేదాకా కాఫీ లేదన్నమాట. పోనిలే నిన్న నిన్న నానపెట్టిన పప్పు దోశలకోసం గ్రైండ్ చేసావా, రెండు దోశలు వేసి తీసుకుని రా” అన్నాడు.



“అయ్యో మీరు దోశలు అంటే గుర్తుకు వచ్చింది, ఉదయం పప్పు మిక్సీ లో వేసి స్విచ్ నొక్కే లోపు మా నానమ్మ ఫోన్ చేసింది, ఆతరువాత మా అమ్మ, ఈలోపున పక్కింటి పిన్నిగారు వచ్చారు. పప్పు రుబ్బుటం మర్చిపోయాను. త్వరగా అన్నం వండుతాను, ఉదయం వండుకోలేదు” అంది. 



వంటగదిలో మినప్పప్పు మిక్సీ లోనుంచి అదోరకం వాసన వస్తోంది. టేబుల్ మీద వున్న భార్య సెల్ ఫోన్ తీసుకుని సిమ్ తీసి అటకమీద పడేసాడు. 



కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఫోన్ తీసుకుని ఆన్ చేసి, ‘నెట్ లేదా’ అంది. 



“ఏమో నాకూ రావడం లేదు” అన్నాడు. 



“అదేమిటండి కాల్స్ కూడా వెళ్ళటం లేదు” అంది. 

“ఈమధ్య ఫ్రీ కాల్స్ అని గంటలు గంటలు మాట్లాడు తున్నారు అని కంపెనీ వాళ్ళు కొంతసేపు సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారుట, ఈ రోజుకి ప్రశాంతం గా వుండు. రేపు రాకపోతే చూద్దాం” అన్నాడు. 



“పోనీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, వాసన వచ్చిన మినప్పప్పు తో ఏమి చెయ్యాలో మా అమ్మని అడుగుతాను” అంది. 



“చాల్లే.. నా ఫోన్ కి కూడా సిగ్నల్స్ ఆగిపోతే కష్టం, ఆ పప్పు పక్కింటి పిన్నిగారికి యిచ్చేసేయి” అన్నాడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ.



మరో యింట్లో.. 



“అర్ధరాత్రి కూడా ఆ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు ఎవ్వరితో అండి?” అని అడిగింది రేవతి భర్త అరుణ్ ని. 



“మా మెయిన్ ఆఫీస్ నుంచి ఫోన్. రేపు ఉదయం బయలుదేరి చెన్నై వెళ్లి అక్కడ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయ్యమని అంటున్నారు” అన్నాడు భార్య వంక చూడకుండా. 



“మరి మొన్న కూడా అదే టైముకి లేచి వరండాలో నుంచుని మెల్లగా మాట్లాడుతున్నారు, అది ఏ ఆఫీస్ నుంచి” అంది.



“చంపేస్తావా నీ ప్రశ్నలతో, నేను ఏమన్నా గుమస్తా ఉద్యోగం చేస్తున్నానా, నాలుగు స్టేట్స్ లో వున్న మా బ్రాంచి ఆఫీసులకు హెడ్ ని. ఏదో ఒక ప్రాబ్లెమ్ తో ఫోన్ చేస్తారు, హాయిగా పడుకోకుండా నా మీద సి ఐ డి లా తయారయ్యావు” అన్నాడు పెట్టె సద్దుకుంటో. 



“త్వరగా వస్తారా లేకపోతే వారం రోజులు ఉండిపోతారా, ఏమీలేదు.. మా అమ్మకి వొంట్లో బాగుండలేదుట. ఒకసారి వెళ్లి చూసి వస్తే బావుంటుంది” అని అంది.



“చూడు.. అక్కడ ఆఫీసులో ఎలా వుందో యిప్పుడే చెప్పలేను, నాలుగు రోజులు అయితే తప్పనిసరిగా పడుతుంది. నువ్వు మీ అమ్మగారిని చూడాలి అనుకుంటే కారు తీసుకుని వెళ్ళు, డ్రైవర్ యిక్కడే వుంటాడు” అని కారులో కూర్చున్నాడు అరుణ్.



క్యాంపు కి వెళ్తే ఈయనకి యిల్లు గుర్తుకు రాదు, భార్య కి ఫోన్ చేసి ఎలావున్నావు అని కూడా అడగడు. మొదట్లో కొంగుపట్టుకుని తిరిగేవాడు, ఆఫీసు నుంచి రోజుకి పదిసార్లు ఫోన్ చెయ్యడం, అటెండర్ ద్వారా సాయంత్రం స్నాక్స్ పంపించడం చేసేవాడు. యిప్పుడు ఏమైందో..



తల్లికి బాగుండలేదు అని తండ్రినుంచి ఫోన్ రావడం తో డ్రైవర్ ని పంపమని ఆఫీస్ కి ఫోన్ చేసింది రేవతి. 



పి. ఏ ఫోన్ తీసి మేడం గొంతు గుర్తుపట్టి, “సార్ కి కనెక్ట్ చేస్తున్నా” మేడం అన్నాడు. 



“మీ సార్ క్యాంపు కి వెళ్ళాలి అన్నారే వెళ్లలేదా” అని అడిగింది రేవతి. 

“లేదు మేడం. సార్ కి ఈ నెలలో క్యాంప్స్ లేవు” అంటూ ఫోన్ లోపలికి కనెక్ట్ చేసాడు. 



“హాయ్ సుశీ! యిప్పటి దాకా నీతోనే వున్నాగా.. అప్పుడే ఫోన్ చేసావు, డబ్బులు ఏమైనా కావాలా” అన్నాడు. 



“సుశీ ఎవ్వరండీ, నేను రేవతిని, మీరు క్యాంపు కి వెళ్తున్నాను అని వెళ్లారు, మీ పి ఏ మీరు ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు, మరి ఈ నాలుగు రోజులు యింటికి రాలేదే” అంది. “ముందు మీరు వేంటనే బయలుదేరి యింటికి రండి, మీతో మాట్లాడాలి” అని ఫోన్ పెట్టేసింది రేవతి.



భయపడుతోనే పెట్టెతో సహా యింటికి వచ్చాడు అరుణ్. హాల్ లో బుగ్గ మీసాల్తో సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ గా పనిచేస్తున్న బావమరిది భయంకర్ కాఫీ తాగుతో కనిపించడంతో అరుణ్ కి అర్ధం అయ్యింది వ్యవహారం చాలా దూరం వెళ్ళింది అని. 



బావగారిని చూసిన భయంకర్ “రండి బావగారు, చెల్లాయ్.. బావగారు వచ్చారు కాఫీ తీసుకునిరా” అన్నాడు. 



“సెక్యూరిటీ అధికారి వాళ్ళకి ఏమిటి మా యిల్లు గుర్తు వచ్చింది” అన్నాడు అరుణ్ సోఫాలో కూర్చుని.



“బావగారూ! మీ బావమరిది గా రావడం నాకు యిష్టం, కాని ఈసారి సెక్యూరిటీ అధికారి గా రావాలిసివచ్చింది, యింతకీ యెవ్వరు ఆ సుశీల?” అన్నాడు. 

యిహ దాచి లాభం లేదు అనుకుని, “ఒకసారి సూపర్ బజార్ లో పరిచయం చేసుకుంది నాతో. 



‘తన ఫోన్ పనిచెయ్యడంలేదు, మీ ఫోన్ నుంచి మా ఫ్రెండ్ నెంబర్ కి ఒక వెయ్యి రూపాయలు గూగుల్ పే చేస్తే మీకు క్యాష్ యిస్తాను’ అంది. అంతే! అప్పటినుంచి ఫోన్ చేస్తో పరిచయం పెంచుకుని, నన్ను తన పుట్టినరోజు కి రమ్మని పిలిచింది. బుద్ది తక్కువతో నేను మీ చెల్లెలికి చెప్పకుండా వెళ్లాను. మేము ఇద్దరే వున్నాము, మిగిలిన వాళ్ళు వచ్చేలోపు జ్యూస్ తీసుకోండి అని యిచ్చింది. అంతే! నాకు ఏమీ గుర్తులేదు. కాని కొన్ని ఫొటోలు మేము కలిసి వున్నవి చూపించి నన్ను డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టింది.



నాలుగు రోజులు క్రితం ఫోన్ చేసి తనకి వొంట్లో బాగుండలేదు అని, కొన్నిరోజులు తన యింట్లో వుండి సహాయం చేస్తే ఫోటో ఒరిజినల్స్ యిచ్చేస్తాను అని ఆశ పెట్టడం తో రేవతి కి క్యాంపు అని చెప్పి వెళ్ళాను అన్నాడు. 



“అంతేనా కథ ఏమైనా నడిచిందా మీ యిద్దరి మధ్యలో” అని అడిగాడు బావమరిది. 



“లేదు, సాలెగూడు లో చిక్కుకుని ఎలా బయటికి రావాలో తెలియక అబద్దం మీద అబద్దం మీ చెల్లెలికి చెప్పి డబ్బులు ఆ కిలాడీ కి దోచిపెడుతున్నాను.” 



అంతా విన్న రేవతి “అన్నయ్యా! నువ్వే ఈయనని దాని చేతిలోనుంచి తప్పించాలి, అయినా ఎవ్వరు జ్యూస్ ఇచ్చినా మీరు తాగేసెయ్యాడమేనా, నాకు మీ విషయం తెలుసు కాబట్టి మిమ్మల్ని అనుమానించటం లేదు, యిహ ఆ అమ్మాయి ఫోన్ తియ్యకండి, మిగిలిన విషయం మా అన్నయ్య చూసుకుంటాడు” అంది.



భయంకర్ ఆ అమ్మాయి ని పట్టుకుని వచ్చి విచారణ చెయ్యగా డబ్బున్న వాళ్ళకి ఫోన్ చేసి మాటలలో దింపి, డబ్బుల కోసం బెదిరించి పబ్బం గడుపుకుంటుంది అని తెలిసి కేసు పెట్టి జైలుకి పంపించాడు. అరుణ్ పూర్వంలాగా సాయంత్రం ఆరుగంటలకు యింటికి వచ్చి రేవతి తో సరదాగా గడుపుతున్నాడు.



అందరి ఇళ్లలో.. 



‘మీకు నాకంటే సెల్ ఫోన్ ఎక్కువైంది’ అని భార్య, 



‘ఎప్పుడూ మన యింటి విషయాలు తెలుసుకోవటానికి మీ అమ్మగారు రోజు రెండు సార్లు ఫోన్ చెయ్యడం మానరా’ అని ఒక యింట్లో, 



‘యిదిగో కొత్త సినిమా వచ్చింది, ఐ మాక్స్ కి వెళ్దాం. కాలేజీ కి వద్దు’ అని అబ్బాయి అమ్మాయి తో, 



‘నన్ను ఎప్పుడు పెళ్లిచేసుకుంటావు, నాకు ఎందుకో భయంగా వుంది’ అని మోసపోయిన ఆడపిల్ల ఫోన్ లో అబ్బాయి తో.. 



యిలా అలా కాదు ఫోన్ లే ఫోన్ లు. మంచి కి సెల్ ఫోన్ ఎంత ఉపయోగ పడుతోందో చెడుకి కూడా ఎక్కువగా ఉపయోగ పడుతోంది. సెల్ ఫోన్ చేతిలో బాంబు లా వుంది జాగ్రత్తగా ఉపయోగించకపోతే పేలిపోతుంది.



సెల్ - 'జైలు సెల్' కాకూడదు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: