Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - సెల్ తెచ్చిన తంటా
#41
పూర్వ విద్యార్థులెందరో ఎక్కడెక్కడో ఉద్యోగాలలోవృత్తుల్లో స్థిరపడినవారుమాస్టారి ఉద్యోగ విరమణ తెలుసుకొని వచ్చారువారిలో కొంతమంది మా మిత్రులు కూడా ఉన్నారుమేమందరం పూలు చల్లుతూ మాస్టారుని సన్మాన వేదిక వరకు తీసుకెళ్ళి వేదిక మీద కూర్చుండబెట్టాముఎందరినో ఉన్నత స్థితికి చేర్చి తాను మాత్రం అలాగే ఉండి బాలల భవిష్యత్తుకు బంగారుబాటలు వేసే బాధ్యతను భుజస్కందాలపై మోసేవాడు ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమేఇది అక్షర సత్యం. 



మాస్టారి పదవీ విరమణ సన్మానం కన్నుల పండువగా జరుగుతున్నదిఅతిథులు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. 



ప్రియ శిష్యుడు భరత్ ఐఏఎస్ మాట్లాడుతూ "మాస్టారు లేకపోతే నేను లేనునేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడుమా నాన్న చేసిన అప్పుకు బదులుగా నేను ఒక మోతుబరి వద్ద జీతం ఉంచబడ్డానుఒక్కరోజు కూడా బడిమానివేయని నేను రాకపోవడానికి గల కారణం తెలుసుకుందామని వచ్చిన మాస్టారు నా పరిస్థితి చూసి నొచ్చుకొనిఅప్పు చెల్లించినన్ను ఋణవిముక్తుణ్ణి చేశారునాలాగే మరెందరికో విద్యాదానం చేసి ఆదుకున్నారునేనేమిస్తే  ఋణం తీరుతుంది?! గురుబ్రహ్మగురుర్విష్ణుగురుదేవో మహేశ్వరగురుసాక్షాత్ పరబ్రహ్మతస్మైశ్రీ గురవే నమఃమా జీవితాలను తీర్చి దిద్దిన గురుబ్రహ్మలకి శతకోటి వందనాలుఅంటూ తన ప్రసంగం ముగించాడు. 



ఇందరి అభిమానానికి పాత్రులైన రామనాథం మాస్టారు ధన్యులుఅలాంటి గురువుని పొందిన మాలాంటి శిష్యులు ధన్యులుఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందులకు ఎంతో గర్వంగా అనిపించింది నాకురోజాకు. 



గొప్ప వ్యక్తులుగా ఎదిగిన తన శిష్యలోకాన్ని చూసి ఆనంద భాష్పాలు జాలువారుతుండగా మురిసిపోతున్నారు మాస్టారు. 
సమాప్తం 
*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#43
బామ్మ....థి గ్రేట్[/url]
[url=https://ibb.co/tP3XRTQ][Image: image-2025-01-22-140350688.png]

దివ్య పండేటి 
రోజు సెలవు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాడు అప్పారావు.
లేస్తూనే ఎదురుగా గోడ మీద ఉన్న దేవుని పటానికి దణ్ణం పెట్టుకుని.....మంచం దిగి...హాల్ లోకి వెళ్ళాడు.
వీధి తలుపు మూసి ఉంది.....వంట గది నుండి వస్తున్న శబ్దాలు విని అటు వెళ్ళాడు పిల్లిలా.
ఉదయం అల్పాహారం తయారు చేస్తున్న భార్య కల్పవల్లిని చూస్తూ.....అడుగులో అడుగేసుకుంటు.....'నా బంగారు బందరు లడ్డు' అనుకుంటూ.....వెనుక నుండి అమాంతం కౌగిలించుకున్నాడు.
ఏమరుపాటులో ఉన్న వల్లి......బిత్తరపోయి.....కంగారులో....చేతిలో ఉన్న అట్లాకాటతో....అప్పిగాడి డిప్ప పగలగొట్టింది.
అసలే బొద్దు గుమ్మ.... మాములుగా కోడితేనే తట్టుకోలేం.....అలాంటిది అట్లకాటతో కొట్టేసారికి.....తల పట్టుకుని...కెవ్వు మని కేక పెట్టాడు.
అతని కేకకి ముందు దడుచుకుని.....అనాకా తాను చేసిన తప్పిదం అర్థమై......భర్తను చెయ్ చేసుకున్నానే అనే పశ్చాత్తాపంతో కుమిలి......కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్లను...బొటబొటా కారుస్తూ....నిలుచుంది.
"నీయమ్మ కడుపు మాడా.ఎంత గట్టిగా కొట్టావే. అసలెందుకు కొట్టావే."గయ్మన్నాడు భార్య మీదా....డిప్ప రుద్దుకుంటూ.
అంతసేపు బాధపడిన వల్లి...అప్పి అదిలింపుతో ఉక్రోషం పొడుచుకొచ్చి...
"నేనేమైనా కలగన్నానా......సెలవురోజు బారెడుపొద్దు పొద్దెక్కి......సూర్యుడు నడి నెత్తిన తైతక్కలాడున్నా కళ్ళు తెరవని మొగుడు.....ఇంత త్వరగా లేచి....పరధ్యానంగా పని చేసుకుంటున్న పెళ్ళాన్ని.....ఆటపట్టిస్తాడని.ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది.కాఫీ తాగుతారా.. టీ పెట్టనా?"
అని అతని సమాధానం కోసం చూడకుండా....కాఫీ కలుపుతోంది.
"ఈమాత్రం దానికి నన్నెందుకు అడిగావ్?"చురచుర చూస్తూ....వంటింటి గట్టు మీద కూర్చున్నాడు అప్పి.
"ఎప్పుడు పాడే పాటేగా....నీ ఇష్టం అని.అదీకాక నేనేం ఇచ్చినా కిక్కురుమనకుండా తాగుతారనే ధీమా ఉంది కాబట్టి."
అంటూ వాలుజాడను...సత్యభామల వెనక్కి నెట్టి..... కప్పు అతనికి ఇచ్చి.....పని చేసుకుంటోంది.
"వల్లి...."గోముగా పిలుస్తూ తన వెనుక చేరిన భర్తను....పక్కకు తప్పించి మరీ పనిలో మునిగింది ఆమె.
"అబ్బా ఆపవే...పని.ఈరోజు అలా బైటికెళదామా....సరదాగా."
"అయ్బాబోయ్ మీరేనా.ఇది మీరేనా.మీరూ....నన్ను.... బైటికి తీసుకెళ్తారా?సునామీ వచ్చేయ్యగలదు.నాకు లేనిపోని ఆశలు కలిపించక పోయి పని చూసుకోండి."అంది వెటకారం ఎక్కువగా...నిస్టురం ఇంకొంచెం ఎక్కువగా.
"అబ్బా నిజంగా వెళదామె.నీమిదోట్టు.ప్లాన్ కూడా వేసా."
తన తలపై చెయ్ వేసి మరి....నిజాయితీగా చెప్తున్నా భర్త మాటలు ఈసారికి నమ్మలనిపించింది వల్లికి.నమ్మేసింది కూడా.....కానీ పైకి మాత్రం.
"సరేలేండి ముందు వెళ్లి స్నానం చేసి రండి.తిందురుగాని. తరువాత మీ ప్లాన్లు వేయచ్చు."
ఆర్భాటంగా ఆరు నెలల క్రితమే అప్పారావు,కల్పవల్లిలా వివాహం జరిగింది.
పెళ్లయిన కొత్తలో......ప్రతిరోజు భార్యని షికారుకి తిప్పిన అప్పి.....తరువాత మారిపోయాడు.
గత మూడు నెలలుగా....పట్టుమని పది సార్లు కూడా భార్యని బైటికి తీసుకెళ్లలేదు అప్పి.ప్రమోషన్ కోసం ఓవర్ టైం చేసి.....రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం.....సెలవురోజుల్లో బద్ధకంగా నిద్రలేవడంతో....కొత్తపెళ్ళాన్ని పంజరంలో చిలకల......ఇంట్లోనే దాచేశాడు భద్రంగా.
ఎప్పుడైనా వల్లి గోముగా అడిగితే.....సరే అనడం....మాట నిలబెట్టుకోలేక...భార్య చేతిలో చివాట్లు తినడం మాములైపోయింది అప్పికి.
ఇప్పుడు వరుసగా మూడురోజులు సెలవులు రావడంతో.....వల్లిని కాస్త ఆనందపరుద్దాం అని.....ప్లాన్ వేసాడు.
@@@@@@
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#44
బీరువాలో చీరలన్ని కట్టి.....విడిచి.....కట్టి......విడిచి.....ఎలాగో ఒకటి సెలెక్ట్ చేసి,కట్టుకుని.....అందంగా తయారైంది వల్లి.
ఇంట్లో ఉంటే నైటీలతో తిరిగే ఆడవాళ్లు.....బైటికెళ్ళాలంటే మాత్రం.....నీటుగా రెడి అవుతారు.వీళ్ళ తాపత్రయం...భర్తకి అందంగా కనిపించాలనా....బైటివారు తమ అందాన్ని పొగడాలనా.
వల్లిని అలా చూడగానే బైటికెళ్లే ప్రోగ్రాం వాయిదావేసి...ఇంకో ప్రోగ్రాం కి రెడి అవుదామని ఉన్నా......ఇంత ఊరించి ఇప్పుడు కాదంటే...మీద పడి రక్కుతుందేమో అని భయపడి....బైటికి నడిచాడు.
భర్త ఎత్తుకి సరిపడ....కాళ్ళకి ఎత్తుమడమల చెప్పులు తగిలిస్తున్న వల్లి......తలుపుకు తాళం కప్ప తగిలిస్తున్న అప్పి.....ఇంటి ముందు ఆగిన ఆటో వంక అయోమయంగా చూస్తున్నారు.....'ఎవరొచ్చారా?' అని.
మనిషికన్నా ముందు వచ్చిన "నారాయణా".....అన్న మాటకి ఇద్దరు మొహాలు చూసుకున్నారు.అప్పి భయంగా వల్లి వంక చూస్తుంటే.....వల్లి కోపంగా చూస్తోంది.
అనుకోకుండా వచ్చిన ఆకాలవర్షంలా.....ఊడిపడిన బామ్మని చూస్తూ.....ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తూ...ఇప్పుడేం చేయాలని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉన్న అప్పిని చూసి...
"ఒరేయ్ పిచ్చిసన్నాసి.పెద్దముండాదాన్ని ఇంత పెద్ద ట్రాంక్కు పెట్టె మోయలేక చస్తుంటే....అలా బెల్లం కొట్టిన రాయిలా నిలుచున్నావ్ ఎరా శుంఠా.రా."అంటూ గదామాయిస్తున్న బామ్మ దగ్గరికి అప్రయత్నంగా వెళ్ళిపోయాడు అప్పి.
పెట్టె అందుకుని లోపలికి రాబోతుంటే....."సాబ్ పైసల్."అన్న ఆటోవాలా పిలుపుతో ఆగి...జేబులో చెయ్ పెట్టాడు.
"నువ్వుండరా బడుదాయ్......ఎంతెంట్రా అబ్బి,కిరాయి."అంది కళ్ళజోడు ఎగదోసుకుంటు బామ్మ.
"రెండొందల్."అన్నాడు వాడు.
"ఎంటెంటి....పది నిమిషాల దూరం కూడా లేదు...నీకు రెండు నూర్లు ఇవ్వాలా.మరి అంత అత్యాశ పనికిరాదురా అబ్బాయ్.ఇందా పదుంచు."అంటూ చిరిగిన పది నోటు అతని చేతిలో పెట్టింది.
"ఏందిది.రెండొందల్ ఇమ్మంటే....పది ఇస్తావ్.చల్......పైసల్ తీయ్ ముందు."ఆవిడ వాటం వాడికి సూతరాము నచ్చినట్టులేదు.
అప్పి నచ్చజెప్పబోయినా.....బామ్మ ఆగడంలేదు...ఆటోవాడు తగ్గడం లేదు... రభసకి ఇళ్లలో జనం....వీధిలోకి వచ్చి.....చోద్యం చూస్తున్నారు.
విసుగొచ్చిన అప్పి...బామ్మకి తెలియకుండా ఆటోవాలతో ఐదు వందలకు క్షవరం చేయించుకుని....జనాలకు ఒక వెర్రినవ్వు విసిరి....బామ్మని ఇంట్లోకి లాక్కుపోయాడు.
@@@@@
బైటికి వెళ్లే ప్రోగ్రాం బామ్మ రాకతో ఆటకెక్కడంతో....మూతి ముడుచుకుంది వల్లి.
తనని శాంతిపజేసేసరికి.....అప్పి గాడి తలప్రాణం తోకదాటి ఏటో పోయింది.
ఇక బామ్మతో విసిగిపోతోంది వల్లి.ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేపేస్తోంది...వాకిలి చిమ్మిచ్చి...ముగ్గులేయిస్తోంది.మడి కట్టించి...వంట చేయిస్తుంది.పూజలు పురస్కారాలు....షరా మాములే.
ఖాళీ సమయంలో కుట్లుఅల్లికలు...కొత్త వంటలు....పద్యాలు,వాటి తాత్పర్యాలు.కనీసం అప్పీతో సరదాగా నవ్వుతూ మాట్లాడినా తప్పే.....ఆడపిల్లల నవ్వు పెదవి దాటకూడదు అంటుంది.
ఆకలికి ఆగలేని...వల్లిని అప్పి తిన్న తరువాతే తినమని ఆర్డర్ పాస్ చేసింది.మధ్యాహ్నం నిద్ర శని అంటుంది.సాయంత్రం పూట కాలక్షేపానికి టీవీ చూసినా తప్పే....అలా చల్ల గాలికి బైటికి తీసుకెళ్లేది.
అలా భర్తతో తిరగాల్సిన టైంలో....ఇలా మామ్మతో తిరుగుతుండటం.....ఒక పక్క కోపం,బాధ....చిర
ాకు కలుగుతున్నాయి వల్లికి.
ఆఖరికి తిధులు,నక్షత్రాలు అంటూ....రాత్రుళ్ళు వల్లిని తనతో పాటు పడుకోమని....భార్యాభర్తల మధ్య దూరం పెడుతోంది.
అలా పదిరోజులపాటు....బామ్మాతో విసిగి,వేసారి....ఇక సహనం నశించి....కోపానంతా అప్పి మీద చూపిస్తూ....తన బాధ చెప్పుకుంది.
"నా వల్ల కాదు.....నేను మా పుట్టింటికి పోతా.ఇలా ఇంట్లోనే పడి ఉండటం నా వల్ల కానే కాదు.పైగా మీ బామ్మా వచ్చిన దగ్గరి నుండి...ఇంట్లో పని ఎక్కువైపోయింది.అప్పడాలు,ఒడియాలు....పచ్చళ్లు అని నా ఒళ్ళు హూనం చేసేసింది.ఉదయం నన్ను బస్ ఎక్కించు....నేను పోతా."
అంటూ ఏడుస్తూ.....ముక్కు తెగ చిదేస్తున్న వల్లిని ఎలా సముదాయించాలో తెలియక తల పట్టుకున్నాడు అప్పి.
దీనికి పరిష్కారం లేదుగాని....తన మూడ్ డైవేర్ట్ చేస్తే మంచిదని....రేపు ఆదివారం కావడంతో...సినిమాకి వెళ్దామని...తనని బుజ్జగించాడు.
@@@@@
హుషారుగా రెడి అయ్యింది వల్లి.ఇంట్లో నుండి...ముఖ్యన్గా బామ్మా నుండి ఒక్క రోజైనా బైటపడుతున్నందుకు.....ఆనందపడిపోతోంది.
ఇద్దరు నవ్వుతూ తుల్లుతూ....బైటికొచ్చేసరికి....
"ఎంటర్రా.....ఇంత ఆలస్యం.పది గంటలకు వెళదాం అని...ఇప్పుడా వచ్చేది.ఎరా అప్పి ఎలా వేళదాం...? ఆటో పిలవకురా....కాస్త దూరానికి కూడా ఆస్తులు అడిగేలా ఉన్నారు.బండి ఉందిగా...పోదాం ముగ్గురం."
అంటున్న బామ్మని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఇద్దరు.
ఆవిడ కూడా తమతో వస్తుంది అనగానే...చీరెత్తుకొచ్చింది వల్లికి.చరచరా లోపలికి వెళ్లిపోయిన భార్య వైపు చూసి...వెనకే వెళ్ళాడు అప్పి.
అప్పిని మింగేసేలా చూస్తూ...."ఎం చెప్పావ్ ఆవిడకి.తయారైపోయింది?"అంది కోపంగా.
"రేపు సినిమాకు 'వెళతాం'.అని చెప్పానే.బామ్మాకి 'వెళదాం' అని వినిపించినట్టుంది కర్మ.వల్లి...నా బంగారు కదు.ఈసారి ఇలా కానిచ్చేద్దాం.బామ్మాకి తెలిస్తే బాధపడుతుంది....బాగోదు.రా."
అని...ఎలాగో పాట్లు పడి...ముగ్గురు బండి మీదే...వెళ్లారు సినిమాకి.
@@@@@@
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#45
 
అంత పెద్ద హాలు ముఖం ఎరగని బామ్మా.....వింతగా చూస్తోంది.తెరమీద బొమ్మ,ఏసీ చల్లదనం.....పక్కన ఉన్న జంట.....వారి బట్టలు...అన్నీ ఇబ్బందే బామ్మకి.
వారిని సినిమా చూడనీకుండా....మధ్యలో మాట్లాడుతూ.....ఏదో ఒకటి అడుగుతూ.....విసిగించేసింది.
బామ్మా పుణ్యమా అని.....సగం సగం అర్థమై కానీ సినిమా చూసి.....ఇంటికెళ్లి వంట చేసే ఒప్పిక లేదని వల్లి అనడంతో....హోటల్ బాట పట్టారు.
అక్కడి వంటకాలను.....వాటి రేట్లను...చూసి బామ్మా కళ్ళు బైర్లుకమ్మాయ్.'ఇంటికి పోయి పెరుగన్నం తింద్దాం.'అని గొడవ చేసి....లాకెళ్లిపోయింది.
కంటి నిండా సినిమా చూడనీలేదు....కడుపు నిండా తిండి తిననివ్వలేదు....ఇది ఇలాగే సాగితే.....తన గతేంటి అని భయం పట్టుకుంది వల్లికి.
ఏదో ఒకటి చేసి....బామ్మని ఇక్కడి నుండి పంపించేయలని...ప్లాన్ల కోసం బుర్రకి పదును పెట్టింది.
@@@@@
తానొకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడని....వల్లి ప్లాన్లేవి బామ్మా ముందు పారలేదు. ఆవిడ ఎడ్డేమంటే తను తెడ్డం అందామనుకుంది.కానీ బామ్మా ఘటికురాలు....ఎవరితోనైనా,'నువ్వే కరెక్టు బామ్మా' అనిపించే రకం.
మరో వారం....వల్లి వొంట్లోని సారమంత పీల్చేసింది బామ్మా.లడ్డులా గుండ్రంగా ఉండే వల్లి....పూతరేకుల తయారైంది.ఇంకో వారానికి జ్వరంతో పడకెక్కింది.
బామ్మా వచ్చిన సరిగ్గా నెలకి నిరసంతో....చీకేసిన మామిడి టెంకల.....వాడిపోయిన గులాబీ మొగ్గల అయిపోయిన ముద్దుల భార్యని చూసి...అప్పికి కూడా కోపం వచ్చేసింది బామ్మా మీద.
కానీ ఏమీ అనలేక...వల్లిని హాస్పిటల్కి తీసుకుపోయాడు.అన్ని టెస్టులు చేసి....కొంచెం నీరసంగా ఉందని.....ఒక్క టానిక్ బాటిల్ ఇచ్చి....చాంతాడంత బిల్ చేతిలో పెట్టారు.
మందులు వాడుతున్నా వల్లిలో ఎలాంటి మార్పు లేదు.....మనిషి నీరసించిపోతోంది.....దానికి తోడు వాంతులు.
ఇక బామ్మా సలహాతో లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకెళితే......అప్పి కొండెక్కి,కోతిల కేరింతలు కొట్టే న్యూస్ చెప్పింది డాక్టర్.
"కంగ్రాట్స్ అప్పరావుగారు మీరు తండ్రి కాబోతున్నారు.మీ వైఫ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.ఇది వరకు మీ వైఫ్ ఓవర్ వైట్ తో ఉన్నారనుకుంటా కదా....కానీ ఇప్పుడు నార్మల్ అయ్యారు.బేబీ కారియింగ్ కి ఎలాంటి ప్రాబ్లెం లేదు.బైటి ఫుడ్ కాకుండా...ఇంటి భోజనం ప్రిఫర్ చేయండి."
అప్పి ఆనందానికి అవధులేవు.వల్లిని జాగర్తగా చూసుకోవాలని....బామ్మా ఆటలు ఇక సాగానీకూడదని...గట్టిగా అనుకున్నాడు.
వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పి....అప్పటికప్పుడు వచ్చేయమన్నాడు.
వల్లి కాలు కిందపెట్టడానికి వీల్లేదని బామ్మకి,తల్లికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు.
రెండు రోజులకు ట్రంకు పెట్టె సర్దుకుని...ప్రయాణమైన బామ్మని బస్ ఎక్కించి...తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు వల్లి,అప్పి.
@@@@@
వల్లికి పండంటి మగ బిడ్డ పుట్టాడు.వాళ్ళ తాతగారి పేరు పెట్టుకుని మురిసిపోయాడు అప్పి.పెద్దఎత్తున బంధువులను పిలిచి....బిడ్డకి నామకరణం చేసాడు.
ఆప్పుడే తల్లి,బామ్మల మాటలు అప్పి చెవిన పడ్డాయ్.
"చాలా థాంక్స్ అత్తయ్య.మీరే పూనుకోకుంటే.....ఈరోజు ఇలా ఉండేది కాదు పరిస్థితి."అంది అప్పి తల్లి.
"అమ్మేం చేసింది వదినా?"అర్ధం కాక అడుగుతున్న ఆడపడుచుని చూసి...
"ఎం చెప్పమంటావ్.అప్పిగాడి పెళ్ళైయాక రెండు నెలలు నేను ఇక్కడే ఉన్నా కదా.వీళ్ళు రోజు బైటికెళ్లడం....బైటే తినేసి రావడం.పెళ్లిలో సన్నజాజి తీగల ఉన్న వల్లి.....చూస్తుండగానే డ్రమ్ముల తయారైంది.బైటి తిండి మంచిది కాదురా అంటే...పర్లేదులెమ్మ అనే వాడు."
"మొన్నామధ్య వీళ్ళు పండక్కి ఇంటికొచ్చినప్పుడు....మన డాక్టర్ చూసి.అమ్మాయి వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంది...ఇలా అయితే ప్రెగ్నెన్సీ అప్పుడు కష్టమవుతుంది.అంది.అదే మాట అత్తయ్యకి చెప్పా."
"దాంతో ఇక్కడికొచ్చారు.ఎం చేసారో గాని....వల్లి మునుపటిలా మారిపోయింది.అందుకే థాంక్స్ అత్తయ్య గారు."అంటూ హత్తుకుంది అప్పి తల్లి...బామ్మని.
వారి మాటలు విన్న తరువాత అప్పికి ఒక్కొక్కటి అర్ధమైంది.రోజు తాను ఆఫీస్ కి వెళ్లిపోతే....రోజంతా వల్లికి ఇంకేం పని ఉండదు.ఇంట్లో ఖాళీగా తిని కూర్చోడం తప్పా.పైగా ఎప్పుడైనా అలిగి...వంట చేయకపోతే బైటి నుండి ఆర్డర్ చేసేవాడు.
దాంతో శారీరక శ్రమలేక వల్లి.....బరువు పెరిగిపోయింది.అది తగ్గించాడానికే బామ్మా...వల్లిని నాలుగు గంటలకు నిద్రలేపడాలు.తనకి ఎడతెగని పనులు పురమాయించడాలు.తాము బైటికెళ్తాము అంటే.......తానూ వచ్చి,బైటి తిండి తిననివ్వకుండా గొడవ చేయడం.
అది అర్ధమైయ్యాక...తాము బామ్మని ఎంత అపార్ధం చేసుకున్నామో తలుచుకుని బాధపడ్డాడు.లోపలున్న బామ్మని చూస్తూ....
"బామ్మా.....తుసి గ్రేట్ హో."అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్ళాడు.
బాబుకి స్వెటెర్ అల్లుతోంది వల్లి......బామ్మా ఎందుకు అల్లికలు నేర్పిందో అర్ధమైందా?పెద్దలు ఎం చెప్పినా......ఎం చేసినా మన మంచికే.


సమాప్తం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#46
Good story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#47
ఎల్లలు లేని స్వార్ధం
రచనCh. ప్రతాప్ 






ఆర్ధ రాత్రి ఒంటి గంట అయ్యింది. న్యూయార్క్ నగరం హాయిగా మత్తులో నిదురిస్తోంది. ఎయిర్ కండిషనర్ చల్లదనం లో మెత్తటి ఫోం బెడ్ పై దట్టమైన రగ్గు కప్పుకొని భార్య కౌగిల్లో వెచ్చ గా ఆదమరిచి నిద్రిస్తున్నాడు వేణు. ఇంతలో అతని నిద్రకు భంగం కలిగిస్తూ ప్రక్కనే టేబుల్ పై వున్న సెల్ ఫోన్ మోగింది. సాధారణం గా సమయం లో అతనికి ఎవరూ ఫోన్ చెయ్యరు. అలాంటిది ఫోన్ వచ్చిందంటే ఏదో అర్జంట్ మెసేజ్ అయి వుంటుంది. ఏమై వుంటుందబ్బా అనుకుంటూ ఇంగ్లీషులో ఒక బూతు తిట్టి ఉదుటున లేచి సెల్ అందుకున్నాడు.



ఆవతలి వైపు నుండి భాస్కర్ బావా ! చాలా ఘోరం జరిగిపోయింది. నాన్న మనకు ఇక లేరు వెక్కుతున్నట్లు స్పష్టం గా వినిపిస్తోంది.



వేణుకు వున్న కాస్త మత్తు కూడా దిగిపోయింది. ఏమిటి భాస్కర్ నువ్వంటున్నది ? ఆతృతగా అడిగాడు.



నిన్న రాత్రి ఊపిరి సరిగ్గా అందక ఆయాసపడ్తుంటే శ్యామా నర్శింగ్ హోం లో చేర్పించాం. ఆక్సిజన్ పెట్టారు. అయినా పొద్దునకు పరిస్థితి బాగా క్షీణించింది.డాక్టర్లు ఎంత ట్రై చేసినా ప్రాణాలు కాపాడలేకపోయారు. పావు గంట క్రితమే ఆయన వెళ్ళిపోయారు ఏడుస్తున్నాడు భాస్కర్. వేణూకి దుఖం లో నోటి మాట రాలేదు.



బావా ఇక్కడ నేనొక్కడినే అన్నీ చూసుకోవాలి, నాకు సాయం గా వుండడానికి వెంటనే బయలుదేరి రా! అభ్యర్ధించాడు భాస్కర్.



ఒకె!, నువ్వేం వర్రీ అవకు.నేను వెంటనే బయలుదేరుతున్నాను. కాని రాజీకి మాత్రం రావడం కుదరదు. ఇప్పుడు ఎయిత్ మంత్ కదా! స్టేజిలో ట్రావెలింగ్ చాలా ప్రమాదకరం. ఆమెను ఏదో విధం గా మేనేజ్ చెస్తాను, అక్కడ అందరికీ ధైర్యం చెప్పుఅంటూ ఫోన్ పెట్టేసాడు వేణు.



భార్యకు నిద్రా భంగం కలుగకుండా నెమ్మదిగా లేచి లివింగ్ రూం లోనికి వెళ్ళి లాప్ టాప్ ఆన్ చెసి ట్రావెలింగ్ సైట్లు వెదికాడు. ఆతని అదృష్తం, ఉదయం ఏడుగంతలకు న్యూయార్క్ ముంబాయి ఫ్లైట్ లో టిక్కెట్ దొరికింది. క్రెడిట్ కార్డ్ స్వాప్ చేసి టికెట్ కంఫర్మ్ చెసి ప్రింట్ కూడా తీసి రిలీఫ్ గా ఊపిరి పీల్చుకున్నాడు. ఆఫ్ సీజన్ కావడాన్న టికెట్ట్ సులభం గా దొరికింది లేకపోతే ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చేదొ ? తర్వాత వెళ్ళి రాజీని నిద్ర లెఏపి జరిగిన సంగతి చెప్పాడు. నాన్న పోయారనగానే బావురుమంది రాజి. ఆమెను సముదాయించదం వేణుకి చాలా కష్టం అయ్యింది. కొంతసేపటికి ఆమె నార్మల్ అయ్యింది. ప్రెగ్నెన్సీ కారణం గా వేణూ ఒక్కడే వెళ్ళడానికి సమ్మతించింది.



అప్పటికప్పుడే ఆమెకు తోడుగా వుండడానికి న్యూయార్క్ లో సౌత్ ఎవెన్యూ లొ వుండే తన స్నేహితుడు కిరణ్ భార్య కొన్ని రోజులు వుండే ఏర్పాటు కూడా చేసాడు వేణు. పద్దెనిమిది గంటల తర్వాత హైదరాబాద్ చేరుకున్నాడు వేణు. ఆసుపత్రి లో మార్చురీ నుండి అప్పుడే రాఘవరావు గారి పార్ధివ శరీరాన్ని తిసుకు వచ్చి వారి స్వంత ఇంటిలో వుంచారు. ఆయన భార్య యశోద శోకదేవతలా వుంది. భాస్కర్ సంగతి చెప్పనవసరం లేదు. చేష్టలుడిగిన వానిలా కూర్చోని వున్నాడు. భాస్కర్ భార్య గీత కాస్త అటూ ఇటూ తిరుగుతూ కావల్సిన ఏర్పాట్లను చూస్తోంది. వేణు, పరిస్థితిని గమనించి వెంటనే రంగం లోకి దిగాడు. ఊళ్ళొ వున్న స్నేహితులను సంప్రదించి గంట లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాడు. పంతులు గారి నుండి, ఆంబులెన్స్ వరకు అన్నీ సరిగ్గా సమకూరాయి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#48
భాస్కర్ ఆర్ధిక పరిస్తితి దృష్ట్యా ఇరవై వేల రూపాయలను చకా చకా ఖర్చు పెట్టేసాడు వేణు. రాఘవ రావు గారి అంత్య క్రియలు అతి ఘనం గా జరిగాయి. రాఘవ రావు గారు పని చెసి రిటైర్ అయిన కాలేజి మొత్తం వచ్చారు. అందరితో కలుపుగోలుగా వుంటూ నోట్లో నాలుకలా మెలిగే రాఘవరావు గారు తన మొత్తం సర్వీస్ లో అజాత శత్రువు అనే బిరుదును సంపాదించారు. ఎవరినైనా నొప్పించే విధం గా ఒక్క మాట కూడా మాట్లాడి వుండరు. అటువంటి మంచి మనిషికి అందరూ అశ్రుతర్పణాలతో వీడ్కోలు పలికారు.



తర్వాత దశ దిన కార్యక్రమం కుడా ఘనం గా జరిగింది. వేణు స్నేహితుల సాయం తో కార్యక్రమం లోటూ రాకుండా జరిపించాడు. ఇంట్లో అంతా సర్ధుకున్నాక అత్తగారిని తనతో తిసుకువెళ్ళే ప్రపోజల్ పెట్టాడు వేణు.



బావా, నాన్న లేరు, ఇంక అమ్మ తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు ? వున్న దాంట్లో సర్ధుకొని అమ్మను మేము జాగ్రత్తగా చూసుకుంటాము, అమ్మను ఇక్కడే వుండనివ్వు భాస్కర్ అన్నాడు.



"అది కాదు భాస్కర్, అత్తగారికి చేంజ్ ఆఫ్ ప్లేస్ చాలా అవసరం. ఇక్కడే వుంటే మావయ్య గారి స్మృతులు అనుక్షణం వెంటాడుతూ వుంటాయి. అందుకే అక్కడికి తీసుకు వెళ్తాను. వాతావరణం మార్పు వలన ఆవిడ త్వరగా కోలుకునే అవకాశం వుంది అందరినీ కన్విన్స్ చేసాడు వేణు.



రాజీ కూడా ఫోన్ చేసి అన్నయతో, అమ్మతో మాట్లాడి వారిని ఒప్పించింది. వీసా ఫార్మాలిటీస్ పూర్తి చేయించి వారం తర్వాత యశొదను తీసుకొని అమెరికాకు తిరిగి బయలుదేరాడు వేణు. రాజీ అమ్మను చూసి ఎంతో పోంగిపోయింది. అపార్ట్ మెంట్ లో అటాచ్డ్ బాత్రూం వున్న గది, ఫోను, టి వి, డి విడి ప్లేయర్ వగైరా సమకూర్చారు.



నాకెందుకు తల్లీ హడావిడీ అం తా ? అడిగింది యశోద.



అదేమిటండీ అలా అంటారు ? ఇక్కడ వున్నంత కాలం ఫ్రీ గా వుండండి. పైగా మీకు లోటు రానివ్వనని భాస్కర్ వాళ్ళకి మాటిచ్చాను కూడా వినయం గా అన్నాడు వేణు.



రాజీకి ఎంతో సంతోషం గా అనిపించింది. అమెరికా వచ్చిన నాలుగేళ్ళలో అమ్మను ఎంతో మిస్ అయ్యింది. ఇక కొన్నాళ్ళ పాటు అమ్మ దగ్గర హాయిగా వుండవచ్చు అనుకొని ఆనందించింది. ఆమ్మను తన స్వంత తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే వేణు లాంటి భర్త దొరకడం నిజంగా తన అదృష్టం గా భావించింది.



ఇంతలో కిరణ్ నుండి ఫోన్ వచ్చింది. వేణు ఎత్తాడు.



ఏమిట్రా నువ్వు చేసిన వెధవ పని. ముసలిదానిని నీ దగ్గరకు తెచ్చుకున్నావు. అక్కడ మీ బావ దగ్గర వదిలేస్తే పోయేదిగా ? అన్నాడు కిరణ్ చికాకుగా. 



ఒరేయ్ కిరణ్. నన్నెంత తక్కువగా అంచనా వేసావురా ? నేనేమైనా తెలివి తక్కువ వాడిననుకున్నావా ? ప్రతీ పనిలో లాభ నష్టాలు బేరీజు వేస్తే గాని పని చెయ్యను నేను. ఇప్పుడు రాజీకి ఎనిమిదో నెల. ఆరోగ్యం అంతంత మాత్రం గా వుంది. కంప్లీట్ బెడ్ రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పారు. డెలివరీ అయిన తర్వాత తల్లినీ, పిల్లనీ కొంత కాలం కంటికి రెప్పలా చూసుకోవాలి. నా వల్ల ఇదంతా జరిగే పనేనా ? ఇక్కడేమో రోజుకు ఇరవై డాలర్లు ఇస్తామన్నా కూడా నమ్మకమైన పని మనుషులు దొరకరు. అందుకే ఆవిడను వెంటబెట్టుకు వచ్చాను.



ఆడాళ్ళందరూ సెంటిమెంటల్ ఫూల్స్. కాస్త ప్రేమ నటిస్తే ఠక్కున వలలో పడిపోతారు. ఒక రెండు సంవత్సరాలపాటు వేళ కింత అన్నం పడేస్తే చాలు ఇంట్లో పనంతా చేస్తూ కుక్కలా పడుంటుంది ముసలిది. ఇక నాకేం చీకూ చింతా లేదు. నౌ ఐకెన్ కాన్సంట్రేట్ ఆన్ మై కెరీర్ విజయగర్వంతో నవ్వుతూ చెప్పాడు వేణు.



వేణూ ! యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి ఇంటెలిజెంట్ ఫెలో నాకు ఫ్రెండ్ కావడం నాకెంతో అదృష్టం. నీ నుండి నేను నేర్చుకోవల్సింది చాలా వుంది మెచ్చుకొలుగా అంటూ డిస్కనెక్ట్ చేసాడు కిరణ్. బెడ్రూంలో ఎక్శ్టెన్షన్ నుండి ఇదంతా విన్న రాజీకి కళ్ళు తిరిగినంత పనయింది. భర్త కుత్సిత తత్వాన్ని, మనీ మైండెడ్ నెస్ అర్ధం అయ్యాక నవ నాడులు కృంగి బెడ్ పై కుప్పకూలిపోయింది. జరిగే తంతు తెలియక పాపం యశోదమ్మ తన గదిలో లవకుశ సినిమా టి వి లో చూస్తూ ఆనందిస్తోంది. 
***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#49
Nice story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#50
చివరకు మిగిలేది..
రచన. అన్నపూర్ణ
 



ఆసరా రీహాబిటేషన్ సెంటర్ రూంలో ప్రాణం ఉండీ లేనట్టు బెడ్ మీద నిస్సహాయంగా పడుకుని వుంది దీప! కంట నీరుకూడా రాని మనసులోనే రోదిస్తోంది. ఎదురుగా ఉన్న కిటికీలోనుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాస్తంత ఓదార్పు నిస్తాయి ఆమెకు. 



చెట్లమీద సందడిచేస్తూ గూడు కట్టుకుని పిల్లలను సాకే పక్షులు, పూలచుట్టూ తిరిగే భ్రమరాలు, రెక్కలు ఆర్చుతూ ఎగిరే రంగు రంగుల సీతాకోక చిలుకలు జీవిత సత్యానికి
ప్రతీకలుగా తోస్తున్నాయి ఆమెకు. 



అందాలతో ఆకర్షించడం పూల తప్పా.. మకరందాన్ని కోరి చేరవచ్చిన భ్రమరానిది తప్పా! అంటే అది ప్రకృతి సహజ పరిణామం అంటారు. 



కానీ మనుషులకు కొన్ని హద్దులు, నియంత్రణలు వున్నాయి. అదే పెళ్లి అనే కట్టుబాటు. పవిత్ర బంధం ! బంధాన్ని తెంచుకున్నాను చేజేతులా.. అనుకుంది. 



ఇప్పుడు విచారించి ఉపయోగంలేదు. తిరిగిరాని అమూల్య జీవితం అది. 



''దీపా ! ఇదిగో టాబ్లెట్ వేసుకునే టైం ఐనది..” అంటూ ఇచ్చాడు శేఖర్. 



ఆలోచనలనుంచి బయటకు వచ్చి, టాబ్లెట్ అందుకుని అతడు చూడకుండా తలగడ కిందపెట్టి, నీళ్ళుమాత్రం తాగింది, తనకు ఇదే శిక్ష అనుకుంటూ. 



కళ్ళు సరిగా కనిపించక, వెన్నెముక దెబ్బతిని, నడుము వొంగిపొయి, మెల్లిగా చేయగలిగిన సేవ చేస్తున్నాడు శేఖర్.. ఆమె దగ్గిరే ఉండి. 



 ఇది మరీ నరక యాతన అనిపిస్తోంది దీపకు. అతడి మంచితనాన్ని, జాలిని, ప్రేమనూ భరించడమే కష్టంగావుంది. 



మంచితనానికి నేను అర్హురాలిని కాదు. దూరంగా వెళ్లిపోండి. నన్నుపశ్చాతాపంలో కాలి పోనివ్వండి.. ఒంటరిగా వదిలిపెట్టు శేఖర్ ! అని అరవాలని ఉంది.. ఆమెకు. 
 ఏది చేయలేక నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది. 



భరద్వాజకు ఇద్దరు అమ్మాయిలు. రైల్వెలో వుద్యోగం చేసే అతడికి ఉత్తర్ ప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ డివిజన్లకు మధ్య ప్రతి రెండేళ్లకు బదిలీలు ఉంటాయి. అందువలన పెద్ద కూతురు దీపను విశాఖపట్నం అమ్మమ్మ గాయత్రి దగ్గిర ఉంచాడు. రెండో కూతురు రూపకి ఇంకా ఐదేళ్లు. కూడానే ఉంటుంది. ఇద్దరికీ ఏడు ఏళ్ళు తేడా. 



 హై కాలేజ్ చదువుకి దీపను విశాఖలో ఉంచాడు. తరచుగా చూసివెళ్లే వీలు ఉంటుందని. అక్కడే పీజి చేసింది దీప. గాయత్రికి గుడిలో పరిచయం వున్న అర్చకుడు ''దీపకి సంబంధాలు చూస్తున్నారా.. మంచి సంబంధం ఉంది. అబ్బాయి మెరైన్ ఇంజినీరు. మంచి కుటుంబం. ''అన్నాడు ఒకరోజు. 



 ''మంచిమాట చెప్పారు. ఇప్పుడే నాకు ఆలోచన వచ్చింది. మిమ్ములను అడగాలని అనుకుంటున్నాను. అమ్మాయి, అల్లుడితో చెబుతాను. వివరాలు చెప్పండి అని తెలుసుకుని భరద్వాజతో చెప్పింది. 



 ''చదువు బాధ్యత తీసుకున్నారు. పెళ్లికూడా మీబాధ్యతే.. అలాగే చూదండి ! అన్నాడు భరద్వాజ, అత్తగారితో. 
గాయత్రి, శేఖర్ తల్లి తండ్రులతో మాటాడి అన్ని సిద్ధం చేసాక భరద్వాజ వచ్చి పెళ్లి జరిపించి వెంటనే వెళ్లిపోయాడు. 



మూడేళ్ళలో ఇద్దరు పిల్లలు కలిగారు దీపకి. వాళ్ళతోనే రోజులు గడిచిపోతుంటే శేఖర్ కంపెనీలు మారినా జాబ్ ఒకటే కనుక ఎప్పటిలా సెలవు ఇచ్చినపుడు వచ్చి వెడుతున్నాడు. 



 పిల్లలు హైకాలేజ్ చదువుకి వచ్చేరు. దీపకి టీవీ, బుక్స్, సినిమాలు, టైంపాస్ అయ్యాయి. ఒకరోజు మూవీ థియేటర్లో హఠాత్తుగా కనిపించాడు మధుకర్!



మధు శేఖరుకి బంధువు. పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చాడు. బ్యాంకు ఆఫీసర్గా గుంటూరులో పనిచేసేవాడు.. ఆతర్వాత పెళ్ళికి వచ్చాడు. అప్పుడప్పుడు బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు కలియడం జరిగేది. 



అతడికి పెళ్లి జరిగినా, భార్య సునంద లెక్చరర్ గా పనిచేయడం వలన ఇద్దరూ ఓకే వూళ్ళో వుండే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను కూడా శేఖరులాగే సెలవులకు సునంద వున్న వూరు వెళ్లడమో, ఆమె మధు వున్న చోటుకి రావడమో జరిగేది. 



 ఇలా చెరొక చోట వుండే భార్యా భర్తలు దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం లేకుండా పోయినది. ఉద్యోగాన్ని వచ్చే డబ్బును వదులుకోలేదు.. కానీ.. సంతోషాలను వదులుకున్నారు. డబ్బు మహిమ అది !



మధుకర్ పూల మధువును గ్రోలే భ్రమరం లాంటి స్వభావం గలవాడు. పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. ఏవూళ్లో ఉంటే అక్కడో మగువతో ఎంజాయ్ చేసేవాడు. తెలిసి, సునంద గొడవపడేది. అలా అని జాబుని వదులుకోదు. ఇప్పుడు వైజాగ్ వచ్చాడు. 



దీప సాన్నిహిత్యం లభించింది. ఒంటరిగా పిల్లలతో ఇబ్బందులు పడుతోంది. సహాయంగా వుంటాను అనుకున్నాడు. శేఖర్ గురించి పూర్తిగా తెలుసును. 



అతను అమాయకుడు. మధుకర్ వైజాగ్ రావడం నా కుటుంబానికి అండ, నాకు నిశ్చింత.. అని సంతోషించాడు. అంతేకానీ నాకూ దీపకి మధ్య బంధం సడలిపోతుందని
గ్రహించలేదు. 



అలాగే వాళ్ళ ముగ్గురి జీవితాలు గడిచి పోతున్నాయి. 
అటు సునంద, ఇటు శేఖర్ ఇద్దరూ నష్టపోయారు. విషయాన్ని సునంద త్వరలోనే గ్రహించింది. మధు బుద్ధి తెలుసుకుంది. 



 శేఖర్ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఐనా దీపని నిలదీయలేదు. మధుని రావద్దని చెప్పలేదు. 
దీపను మందలించి పరువును పోగొట్టుకోలేడు. అందుకే తెలియనట్టు దూరంగా ఉండటం మొదలుపెట్టేడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడిక గొడవ పడితే వాళ్ళు కూడా దూరం అవుతారు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#51
శేఖర్ బంధువే కాబట్టి అతను వున్నా వస్తూనే వున్నాడు మధు. అప్పుడు భోజనం, సినిమాలు, జాలీ ట్రిప్పులు.. అన్ని శేఖర్ కుటుంబంతోనే !



 శేఖర్ వచ్చినా అతడితో పరాయివాడు వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఎప్పుడూ హెల్త్ బాగాలేదు అంటూ డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. మూడేళ్లు ఇలా గడిచింది. 
మధుకర్ రిటైర్ అయ్యాక సునంద వుండే వూరిలో స్థిరపడక తప్పలేదు. 



అలాగే శేఖర్ కూడా రిటైర్ అయి వైజాగ్ వచ్చేసాడు. పిల్లలు ఉద్యోగాలకు బెంగుళూర్ వెళ్లారు. 



 వాళ్లకి నచ్చిన అమ్మాయిలను అమ్మ నాన్నలకు చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి రావడంలేదు కబురు తెలిసిన దీపకి హార్ట్ అట్టాక్ వచ్చింది. ఆరోగ్యం పాడైంది. కేన్సర్ అన్నారు. కొడుకులు ఇద్దరూ చూసి వెళ్లారు. 'ఇకరాలెం. వెరీ బిజీ ' అన్నారు. 



 బంధువులు 'అలా అనకూడదు. అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయ్యారు. కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత మీదే అంటె.. మా అమ్మ మాకేమి చేసింది? కొడుకులా పట్టించుకుందా? లేదు. ఎప్పుడూ హోటల్ భోజనమే. నాన్నగారిని కూడా పట్టించుకోలేదు. మేము ఎందుకు పట్టించుకోవాలి? అన్నారు కోపంతో. 



అంతకంటే తల్లిని గురించి పబ్లిక్కుగా బైటికి చెప్పలేక. వాళ్లకి తెలుసును. మధు అంకుల్, అమ్మ.. మధ్య వుండే సంబంధం.. తండ్రి అమాయకత్వం వాళ్లకు కోపం తెప్పించేది. అమ్మని నాన్న ఎందుకు కోపగించడు.. ఎందుకు ఇంత సహనంగా ఉంటాడు.. అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటం, దీపని ఎదిరించి మాటాడటం మొదలుపెట్టారు. ఏనాడూ ఇంటి భోజనం తినలేదు. దీపకు వంట చేయడం బద్ధకం.. ఫుడ్ ఆన్లైన్ ఆర్డర్ చేసేది. లేదంటే హోటల్స్కి వెళ్లి తినమనేది. 



ఆలా పెరిగినవాళ్లకు దీప అంటె అస్సలు ప్రేమలేదు.. శేఖర్ ఎప్పుడూ షోర్ మీదనే ఉండేవాడు. 



ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అతనితో గడిపినదె తక్కువ. డబ్బు ఇచ్చేసి బాగా పెంచుతున్నా, వాళ్లకి లోటులేదు అనుకునేది. డబ్బుతో ప్రేమ కొనలేనని తెలుసుకోలేదు. 
 శేఖర్ ఇక దీపకి సేవలు చేయలేక రీహాబిటేషన్ సెంటర్లో చేరిపించాడు. ఓపిక వున్నప్పుడు వెళ్లి చూసొస్తాడు.. 



నేను డబ్బు సంపాదించాను. జీవితాన్ని పోగొట్టుకున్నాను. తప్పు నాదే! ఆవుద్యోగం మానుకుని వేరే జాబ్ చేయవలసింది. నా కుటుంబానికి అన్ని ఇచ్చాను అనుకున్నాను. వాళ్లకు నేను అక్కరలేకుండా పోయాను అనుకున్నాడు. 



 దీప ఇప్పుడు విచారిస్తోంది. అందరూ ఉండి ఎవరూ లేనట్టు అయ్యానని కుమిలిపోతోంది. 



కొడుకుల ప్రేమకు దూరమై బాధ పడుతోంది. శేఖరుకి తీరని ద్రోహం చేసానే అని దుఃఖ పడుతోంది. 



అనారోగ్యం పట్టి పీడిస్తోంది. మధు, సునందాలు హాపీగా వున్నారు. నష్టపొయిన్ది నేనే అని తెలుసుకుంది. 
కాలేజ్ల్లో కాలేజీలో అందరూ నువ్వు చాలా అందంగా ఉంటావ్.. అనేవారు.. దీపని. తల్లి తండ్రి దూరంగా ఉండటం వలన స్వేచ్ఛగా స్నేహితులతో గడిపేసేది. అమ్మమ్మకి ఆస్నేహితులు మగవారని తెలియదు. ఇల్లు తప్ప ఏమి తెలియదు ఆవిడకు. 



పెళ్లి చూపులకు శేఖర్తో బాటు వచ్చిన మధు చాలా అందగాడు. ఆరోజే అతను దీపను ఆకర్షించాడు. 
నేను అతడిని చేసుకుంటాను అని అమ్మమ్మతో చెప్పింది. ఆవిడ చీవాట్లు పెట్టింది. 



''నీకు మతిపోయినదా? శేఖరుకి నెలకి అయిదు లక్షలు జీతం. మధుకి పాతికవేలు. మనిషి బాగుంటే చాలా! సంపాదన ముఖ్యం. శేఖర్ నే ఒప్పుకో.. అని నచ్చచెప్పింది. 
దీపకి నేను నచ్చాను. శేఖర్ కాదు.. అని ఆనాడే గ్రహించిన మధు చాలా సులువుగా ఆమెను లొంగదీసుకున్నాడు. 
ఆతర్వాత శేఖర్ లేకపోడం మధు తన అవకాశాన్ని వినియోగించుకోడం జరిగిపోయాయి. 



నీ అందం వయసు వృధా చేసుకోకు. అని పొగిడి లొంగదీసుకుని తన అవసరం గడుపుకున్నాడు మధు. తప్పు ఎవరిదీ అంటె ముగ్గురిదీ! 



'ఎదుటివారిని లొంగదీసుకునే చాతుర్యం మధుది. సులువుగా పడిపోయే బలహీనత దీపది. ఎదుటివారిని కనిపెట్టలేని అమాయకత్వం శేఖర్ ది. '



అందుకే ఇద్దరూ భార్యా భర్తలుగా సుఖపడలేక నష్టపోయారు. శారీరక సుఖాలు, అందం శాశ్వతం కాదు. అందమైన జీవితం, కుటుంబంలో సుఖ శాంతులు నిలబెట్టుకోలేని మనుషులు, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. అదీ అనారోగ్యం కూడా ఉంటే, ఇక నరకమే! అనైతిక సంబంధాలు, అవసరం గడుపుకునే తాత్కాలిక ఆకర్షణలు! అవి జీవితాలను ఛిద్రం చేస్తాయి. 



 ప్రేమ, అనురాగం, ఒక బంధం, బాధ్యత, ఏర్పడేది.. కట్టుబాటు వున్నప్పుడే. ఎండమావులవంటి ఆకర్షణ జీవితాన్ని కూలదోస్తుంది. విషయం గ్రహించేసరికి ఏదీ మిగలదు.  
ఇప్పుడు ఏం లాభం! పోగొట్టుకున్నది తిరిగిరాదు. 



సమాప్తం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#52
వెలుతురులోకి
రచన: శిరిప్రసాద్






ధరణి గులాబీ రంగు చీర, మాచింగ్ బ్లౌజ్ లో అందంగా మెరిసిపోతోంది. పౌర్ణమి చంద్రుడిలా ఆమె ముఖం వెలిగిపోతోంది. కళ్ళు పెద్దవి కావడంతో వాటికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. దానికి తోడు మధ్యస్థంగా నుదురు, పదునుగా కనిపించే ముక్కు, కొద్దిగా గులాబీ వర్ణంలో చెక్కిళ్ళు, లేతగా కనిపిస్తున్న ఎర్రటి పెదాలు, నున్నటి చుబుకం, ధరణి అందాన్ని నిర్వచించ లేక పోతున్నాయి.



ఎంత నిర్వచించలేని అందమున్నా, సమాజంలో స్థాయిని పెంచేందుకు, అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు, అప్సరసే స్వర్గం నించీ దిగొచ్చిందా అనిపించేందుకు దానికి పై అద్దకాలు అవసరం. ధరణి పనిని లూ రియల్ పేస్ మేకప్ ద్వారా చేసుకుంటుంటుంది. ఎంతో ఖరీదు చేసే మేక్ అప్ కిట్ కింద నెలకి పది వేలు ఖర్చుపెడుతుంది. అంతేనా అంటే, కాదు. నెలకి రెండు సార్లు బ్యూటీ పార్లర్ కి వెళుతుంది. సగటున ఖర్చు నెలకి యిరవై వేలవుతుంది. లిప్స్టిక్ కింద వెయ్యి రూపాయలవుతుంది. నెయిల్ పోలిష్ కింద మరో వెయ్యి రూపాయలు. 



మేకప్ కింద యింత ఖర్చు పెడుతున్నప్పుడు శరీరాన్ని కప్పివుంచే బట్టలకి యెంత పెట్టాలి? 
ఖరీదైన కుర్తా సెట్స్ ధరణి వార్డ్ రోబ్ లో మూడు వున్నాయి. మూడు సెట్స్ ఒకేసారి మూడు లక్షలకి కొన్నది. కంపెనీ ఎం డీ విజిట్ కి వచ్చినప్పుడు వేసుకుంటుంది. కొన్ని ముఖ్యమైన రోజుల్లో  సామాన్యులకి ప్రవేశం లేని  స్టూడియో  లో తీసుకున్న పది సెట్స్ టాప్స్, బోటమ్స్ , కుర్తీస్ , రోజు వాడకం కోసం కనీసం రెండు వేలు ఖరీదు చేసే కాటన్ సారీస్ యాభై వరకు వుంటాయి. ప్రత్యేకమైన ఫంక్షన్స్ కోసం సిల్క్ చీరెలు పదివేల నించి లక్ష ఖరీదు చేసేవి కొన్ని వున్నాయి. క్యాజువల్ డ్రెస్ లు, జీన్స్ పాంట్స్, షర్ట్స్ వంటివి పది జతల పైగానే వుంటాయి . అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమ్స్ వాడుతుంది.



ఇక యాభై లక్షల విలువ చేసే బెంజ్ కార్ లో యీ అందాల భామ ఆఫీస్ కి వెళ్తూ వుంటుంది. అయిదేళ్ల కిందట కొనుక్కున్న హ్యుండై కారు, ఎప్పుడో కొనుక్కున్న టీ వీ ఎస్ స్కూటర్ జ్ఞాపకార్ధం గారేజ్ లో వుంచుకుంది . ప్రతి మూడు నెలలకి వాటిని వాడుతూ, సర్వీసింగ్ చేయిస్తుంది. 



ధరణి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది. ఒక మధ్య తరగతి కుటుంబం నించి వచ్చింది. చదువులో ఎప్పడూ నెంబర్ వన్ గా వుండేది . టీ లో ఇంజనీరింగ్ చేసి యూ ఎస్ లో మాస్టర్స్ చేసింది. అక్కడే ప్రొఫెసర్ రిఫరెన్స్ తో టాప్ కంపెనీ లో జాబ్ తెచ్చుకుంది. ఐదేళ్లలో మూడు కంపెనీలు మారి ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో స్థిర పడింది. మేధస్సు తో పాటు, యింగితం వున్న వ్యక్తి కాబట్టి చురుగ్గా వుండడంతో పై స్థాయికి త్వరత్వరగా  ఎదిగింది. శాలరీ ప్యాకేజీ సంవత్సరానికి రెండు కోట్లు. కంపెనీ షేర్స్ పది వేలున్నాయి. ఏటా లాభంలో వాటా కింద యాభై లక్షలు సంపాదిస్తుంది. టాప్ కంపెనీలని క్లైంట్స్ గా చేర్చి టాప్ మానేజ్మెంట్ మెప్పు పొందింది. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. ఊరు నించి ఒక మధ్య తరగతి భార్య భర్తలని తెచ్చి తోడుగా వుంచుకుంది . వాళ్ళే ఆమెకి అన్నీ అవసరాలు తీరుస్తుంటారు. ఇంకా పెళ్ళి చేసుకోలేదు. 



అప్పుడప్పుడు పబ్స్ కి వెళ్తూ ఉంటుంది. తనతో స్నేహం చేసే మధ్య వయస్కులు ఇద్దరున్నారు. వాళ్ళతో కాసేపు డ్రింక్స్, కాసేపు డాన్స్ , మళ్ళీ డ్రింక్స్. తర్వాత బయట స్టార్ హోటల్ లో బఫెట్. తర్వాత మూడ్ ఉంటే ఫ్రెండ్ ని యింటికి తీసుకెళ్లి రాత్రి ఎంజాయ్ చేస్తుంటుంది. అది పెద్ద తప్పు పని అనుకోదు. ఆకలేస్తే హోటల్లో అన్నం తిన్నట్టు. ఒక భౌతిక అవసరం. అంతే. అవసరం కోసం పెళ్లి అనే గుదిబండని తగిలించుకోడం ఎందుకు, అనుకుంటుంది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఇలాంటివి తప్పుకాదని అనుకుంటుంది. అయితే ఎందుకో అవి రహస్యం గా వుండాలని కోరుకుంటుంది. అక్కడే అది తప్పు పని అవుతుందని తెలుసుకోలేక పోతుంది. విచిత్రం!



రోజు కార్పొరేట్ ఆఫీస్ నించి వైస్ ప్రెసిడెంట్ [ పబ్లిక్ రిలేషన్స్ ] వస్తున్నాడు. మనోహర్. 
హైదరాబాద్ లో ఒక అనాధాశ్రమానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీ తరఫున ఒక వ్యాన్ డొనేట్ చేయడానికి వస్తున్నాడు. మనోహర్  సీ యీ కి అత్యంత సన్నిహితుడు. అతగాడి దగ్గిర మార్కులు కొట్టేయాలని మరింత అందంగా తయారైంది ధరణి. అనాధాశ్రమాల గురించి నెట్ లో కొంత మేటర్ సేకరించి చిన్న స్పీచ్ తయారు చేసుకుంది. కార్యక్రమంలో మాట్లాడాల్సి వస్తే తన హోదాకి తగ్గట్టు మాట్లాడాలి కదా!



ధరణి చక్కగా తయారై ఆఫీస్ కి వెళ్ళింది. అనాధాశ్రమానికి మనోహర్ ని, ధరణి ని తీసికెళ్లేందుకు ఆఫీస్ లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ లలిత సిద్ధంగా వుంది. ముగ్గురూ కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు. 



'ధరణీ మేడం , మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటున్నారు?' అడిగాడు మనోహర్. 
'నా పెళ్ళి పట్ల మీకెందుకో  అంత ఇంటరెస్ట్?'



' మీరు జీవితంలో అన్నీ సాధించారు. చక చకా పైకెదుగు తున్నారు... పెళ్ళీడు వచ్చేసింది... యింకా ఏమి అడ్డం వస్తున్నాయో... తెలుసుకుందామని...'



'ఏవీ అడ్డం రావట్లేదు... టైం వచ్చినప్పుడు అదే అవుతుంది... '



'అఫ్ కోర్స్, టైం వస్తే  అవుతుంది లెండి... టైం ఎప్పుడా, అని...'



' టైం వచ్చినప్పుడు మీకు ఇన్విటేషన్ పంపిస్తాను... తప్పకుండా రండి...'



'స్యూర్ ... నేనేమిటి, బోర్డు మొత్తం వస్తుంది... అప్పుడు వాళ్ళకి యిక్కడ ఏర్పాట్లు కూడా నేనే చూసుకోవాల్సి వస్తుంది...'



'తప్పకుండా....'



ముగ్గురూ లేచారు. 
'మీరు ఫెర్ఫ్యూమ్ వాడతారో?... మగవాళ్ళని యిట్టే పడేస్తుంది...'



'థాంక్స్... పెర్ఫ్యూమ్స్ లో ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ ఫేమస్ కదా!... అదే, ఏదో దొరికే వెరైటీ వాడుతుంటాను... '
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#53
'నైస్... '



లలితకి యీ సంభాషణ నచ్చలేదు. వాళ్ళిద్దరినీ తొందర పెట్టింది. తొందర పెట్టడం అంటే, పదే పదే వాచ్ చూసుకోడమే. 



అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు. ఏంతో విశాలమైన క్యాంపస్. యోగా కోసం ఒక బిల్డింగ్, మెడిటేషన్ హాల్, లైబ్రరీలు మరో బిల్డింగ్ లో.  చివరి బిల్డింగ్ లో ఒక భాగం వృద్ధాశ్రమం, మరో భాగంలో అనాధ పిల్లలకి ఆశ్రయం.



అక్కడ ఆడుకునే పిల్లలు కొందరు, ఆడుకోలేని దివ్యాంగులు కొందరు, అస్వస్థత తో కొందరు కనిపించారు. ఒక వైపు అమాయకమైన ఆనందం, మరో వైపు కళ్ళు తడిపే దృశ్యం. సృష్టిలోని వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. 



బిల్డింగ్ వెనక మీటింగ్ హాల్ లో చాలామంది ఆహుతులు ఎదురుచూస్తూ కూర్చున్నారు. మీటింగ్ లో ధరణి ఆశ్రమ నిర్వాహకులకి వ్యాన్ తాలూకు కాగితాలు అందించింది. మనోహర్ కూడా ఫోటో కోసం చెయ్యి వేసాడు. నలుగురైదుగురు మాట్లాడారు. ధరణి ప్రిపేర్ అయిన స్పీచ్ కూడా పూర్తిగా చెప్పలేక పోయింది. అందుక్కారణం అస్వస్థత తో కనిపించిన చిన్నారులు. ఆమె మనస్సులో వాళ్ళే మెదులుతున్నారు. అక్కడ సభలో వున్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ విచారంగానే కనిపిస్తున్నారు. అలాంటి సమావేశానికి ఖరీదైన దుస్తులు వేసుకొచ్చినందుకు, మేకప్ దట్టించినందుకు, నాలుగు దిశలా వ్యాపిస్తున్న పెర్ఫ్యూమ్ వేసుకొచ్చినందుకు చిన్నతనంగా ఫీల్ అయింది ధరణి.



ఫొటోల్లో అందంగానే కనిపిస్తుంది. ఫోటోలు అన్నీ న్యూస్ పేపర్స్ లో వస్తాయి. కొన్ని టీ వీ ఛానెల్స్ లో కూడా చూపిస్తారేమో. కానీ ధరణి, జీవితంలో మొదటి సారి విచారపడింది. ఇలాంటి మీటింగ్స్ కి రాకూడదు, అని ఒక క్షణం అనిపించింది. 



మరుక్షణం ఆలోచన తప్పనిపించింది. కడుపులో దేవినట్టనిపించింది. రక రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళు జన్మలో పాపం చేసారో , యీ జన్మలో యింత చిన్న వయసులో యిలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఆశ్రయం కల్పించి యింత మంచిగా చూసుకుంటున్నయీ ఆశ్రమ నిర్వాహకులని  అభినందించాల్సిందే. వాళ్ళకి సేవ చేస్తున్న స్టాఫ్ ఎంత మంచివాళ్ళో . ధరణి గుండె బరువెక్కింది.
మీటింగ్ అయిపోయాక ముగ్గురూ ఆఫీస్ కి బయల్దేరారు.
******
ఇంటికి చేరిన  ధరణి కి మనస్సు మనస్సులో లేదు. ఆశ్రమం చుట్టూ తిరుగుతోంది. లోపల అనారోగ్యం తో బాధ పడుతూ, సంతోషంగా కనిపిస్తున్న పిల్లలు, వృద్ధులు, వాళ్లకి సేవ చేస్తున్న ఆయాలు, రేపో మాపో పోతారనిపిస్తున్న మంచాల్లోని పిల్లలు కనిపిస్తున్నారు. 



డ్రెస్ మార్చుకుని కప్ బోర్డు లోని స్కాచ్ విస్కీ బాటిల్ టీపాయ్ మీద పెట్టింది.ఫ్రిడ్జ్ లోంచి సోడా బాటిల్స్ తీసి టీపాయ్ మీద పెట్టింది. కిచెన్ లో హాట్ ప్యాక్ లో పెట్టిన చికెన్ టిక్కా ని ఓవెన్లో రెండు నిముషాలు వేడి చేసి డ్రాయింగ్ రూమ్ లోకి తెచ్చుకుంది. సోఫా లో కూర్చుని స్కాట్లాండ్ నించే తెప్పించిన అందమైన గ్లాస్ లో విస్కీ సుమారుగా ముఫై ఎం ఎల్ వేసుకుంది. సోడా తో గ్లాస్ని  సగం వరకు నింపింది. ఒక డ్రాప్ రుచి చూసింది. లేచివెళ్లి ఫ్రిడ్జ్ లోంచి ఐస్ క్యూబ్స్ తెచ్చుకుంది.  ఒక పీస్ గ్లాస్ లో వేసుకుని టేస్ట్ చేసింది. బాగుందనిపించింది.



పక్కనే వున్నరిమోట్ తో టీ వీ ఆన్ చేసింది. న్యూస్ చూస్తూ గ్లాస్ లోని విస్కీ ని కొద్ది కొద్దిగా చప్పరిస్తొంది. సంతోషానుభూతిని, సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, పొందుతోంది. క్షణాల్లో మధ్యాహ్నం ఆశ్రమంలోని సీన్స్ మదిలో మెదిలాయి. అంతే. విస్కీ లోని చెడుతనము నాలుక్కి తగిలింది.



కడుపులో మళ్ళీ దేవినట్టయింది. ఒక్క గుటకలో మిగిలిన డ్రింక్ తాగేసింది. మరో అయిదు నిముషాల్లో మరో రెండు డ్రింక్స్ గటగటా తాగేసింది. ఇక తాగలేక పోయింది. విస్కీ వగరుగా, కొంచం తియ్యగా అనిపించింది. తాగాక ఇక చాలనిపించి, బాటిల్ ని మళ్ళీ కప్ బోర్డు లో పెట్టేసింది. కొంచం మత్తుగా అనిపించి సోఫాలో వాలిపోయింది.



ఒక గంట తర్వాత నరసింహ వచ్చి ధరణిని లేపి, వేడి వేడి చపాతీలు, చికెన్ వేపుడు తెచ్చి టీపాయ్ పెట్టి తినమని రిక్వెస్ట్ చేసాడు. నెమ్మదిగా రెండు చపాతీలు తిని ఇక చాలంది. మిగిలిన ఫుడ్ ని తీసి కిచెన్ లోకి వెళ్ళాడు నరసింహ. మిగిలిన ఐటమ్స్ అన్నీ గిన్నెల్లో పెట్టుకుని తను తీసికెళ్ళాడు. నెమ్మదిగా లేచి బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద వాలిపోయింది ధరణి.  



తర్వాతి రోజు ఆఫీస్ కి వెళ్లిన గంటకి లలితని తన కేబిన్ కి పిలిచింది ధరణి. 
లలిత ధరణి కేబిన్ కి వెళ్లి ఎదురుగా నిలబడింది. మేడం విషయం గురించి అడుగుతుందో అని ఎదురుచూస్తోంది. తన దగ్గిర పెండింగ్ ఇష్యూస్ ఏమీ లేవు కూడా. 
'లలితా, నీకు అనాధాశ్రమం గురించి ఎలా తెలిసింది?'



అమ్మయ్య, అనుకుంటూ లలిత చెప్పింది, 'నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం . నేను నెల నెలా వెయ్యి రూపాయలు డొనేట్ చేస్తుంటాను...'



' సీ ... మనం యీ రోజు సాయంత్రం ఒక సారి అక్కడికి వెల్దామా?...'



'అలాగే మేడం '



సాయంత్రం ఆఫీస్ అయ్యాక లలిత ధరణి దగ్గిరకి వచ్చింది. నిజానికి ధరణికి టైమింగ్స్ అంటూ వుండవు. అయినా అయిదింటికి లలితతో వెళ్ళడానికి సిద్ధమైంది. ఇద్దరూ ధరణి కారులో ఆశ్రమానికి వెళ్ళారు . అక్కడ స్వామి రామానంద ని కలిసారు . ఒకసారి పిల్లల్ని చూడాలని వుంది, అన్నది ధరణి. ముగ్గురూ పిల్లలు వుండే బిల్డింగ్ కి వెళ్ళారు. స్వామి రామానంద పిల్లల్ని చూపిస్తూ, 'వీళ్ళిద్దరూ పోలియో బాధితులు, వీళ్ళు ఆరుగురు మానసికంగా ఎదగని పిల్లలు, వీళ్ళిద్దరూ పుట్టు గుడ్డి , యీ పిల్లగాడు ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకున్నాడు, యీ యిద్దరూ తలస్సేమియా వ్యాధితో బాధపడుతూ, చావు కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళు పదిమంది ఆనాధలు, అడుక్కుంటుంటే సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకొచ్చి మాకు అప్పగించారు.... యింకా నలుగురు రకరకాల కాన్సర్ వ్యాధులతో బాధపడుతూ ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో వున్నారు...ముగ్గురికి గుండెలో చిల్లు వుంది. వాళ్ళకి శస్త్రచికిత్స చేయించాలి ' అని వివరించాడు. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#54
'అందరూ అనాధలేనా స్వామీ?' ధరణి ప్రశ్నించింది. 



'అందరూ కాదమ్మా.... కొంతమంది పేద తల్లితండ్రులు వాళ్ళ పిల్లలికి ట్రీట్మెంట్ మేము యిప్పిస్తామని  మా దగ్గిర వదిలి వెళ్ళారు . మేము భగవంతుడి ప్రసాదమని భావించి వాళ్ళని కూడా చేరదీసాము..... మాకు వచ్చే డొనేషన్లు సరిపోవు.... ఎవరికి  ట్రీట్మెంట్ అత్యవసరమో, వాళ్ళకి చేయిస్తుంటాము...'



'తలస్సేమియా పిల్లలు యిద్దరికీ ట్రీట్మెంట్ ఖర్చు చాలా వుంటుంది కదా?'



'అవునమ్మా.... రక్త మార్పిడికి, మందులకి నెలకి ముఫై వేలవుతుంది ... శస్త్రచికిత్స చేయించాలంటే ఒక్కొక్కరికీ కనీసం పాతిక లక్షలవుతుంది... '



ధరణి ఆలోచిస్తూ, కిచెన్ వైపు నడిచింది. అక్కడ వంటలు చూసి ఆశ్చర్యపడింది. మేడం వైపు ప్రస్నార్ధకంగా చూస్తోంది లలిత . 



' పిల్లలిద్దరి చికిత్సకీ  నెలనెలా ముఫై వేలు నేను యిస్తాను. వాళ్ళిద్దరి సర్జరీ కి ఏర్పాట్లు కూడా చూస్తూ వుండండి... ' అంది ధరణి.



 'భగవత్ ప్రసాదం తల్లీ,' అన్నాడు స్వామి.



లలిత ఒక్కసారిగా షాక్ తింది . మేడం గురించి స్టాఫ్ కధలు కధలుగా చెప్పుకుంటుంటారు. ఆవిడ దుబారా ఖర్చుల గురించి, విలాసవంతమైన జీవితం గురించి ఎన్నో రూమర్స్ వున్నాయి. ఆమె అసలు యీ ఆశ్రమం చూద్దామనడమే షాకింగ్ అయితే, యిప్పుడు నెలకి ముఫై వేలు యిస్తామనడం, సర్జరీ ఖర్చులు భరిస్తాననడం  యింకా పెద్ద షాక్ అనిపించింది లలితకి. 
తర్వాత మరికొన్ని వివరాలు తెలుసుకుని ధరణి బయల్దేరింది. 'లలితా, నువ్వు నన్ను యిక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు..... నా జీవితంలో యీ రోజు ఒక టర్నింగ్ పాయింట్ లలితా...' అంది. 



ధరణికి గాలిలో తేలిపోతున్నట్టుంది. మనసుకి హాయిగా వుందనిపించింది . రాత్రంతా గిల్టీ ఫీలింగ్. నిద్ర పట్టలేదు. తను చేస్తున్న తప్పులన్నీ ఒక సీరియల్ లా కనిపించాయి. ప్రపంచంలో ఎంతమంది డబ్బు లేక కష్టాలు పడుతున్నారో! తనకి డబ్బు ఎక్కువై ఏం చేయాలో తెలియక విశృంఖలంగా ప్రవర్తిస్తోంది. 



ఇంటికి చేరిన ధరణి వాష్ బేసిన్ దగ్గర నిలబడి మేకప్ ని శుభ్రం చేసుకుంది. పావుగంట పట్టింది. తర్వాత అద్దంలో ముఖాన్ని వివరంగా చూసుకుంది. చర్మంలో కాంతి లేదు. కళ్ళ కింద కొంచం నల్ల చారలు వస్తున్నాయి. చెక్కిళ్ళు కొంచం జారుతున్నట్టున్నాయి. మేకప్ పైపై మెరుగులు పెంచుతూ, అసలు అందాన్ని తగ్గిస్తుంది. వయసుని పదేళ్ళు పెంచేస్తుంది. మేకప్ మానేస్తే యిద్దరు తలస్సేమియా పేషెంట్స్ కి రక్త మార్పిడికి సరిపోతుంది. అలాగని ఆఫీస్ కి మేకప్ లేని ముఖంతో వెళ్తే గుర్తుపట్టరేమో !?... దేశీయ మేకప్ లైట్ గా చేసుకుని , ముఖాన్ని కాపాడుకోవాలి, అని తీర్మానించుకుంది ధరణి. దేశీయ మేకప్ గురించిన వివరాలు గూగుల్ లో సెర్చ్ చేసింది. మంచి సమాచారం దొరికింది. వెంటనే దేశీకి మారిపోవాలని నిర్ణయించింది.



దుస్తులు మార్చుకుంది. తను వేసుకునే నైటీ ధర ఏడువేల అయిదొందలు. వెయ్యి రూపాయల్లో మంచి నైటీ దొరకదా? అందులో మిగిలే డబ్బు పిల్లాడి వైద్యానికో సరిపోతుంది కదా?... అలా చేస్తే తను నైటీలు, డ్రెస్  కొనుక్కునే బౌటిక్ వాళ్ళ ఆదాయం తగ్గిపోదా?... తగ్గుతుందేమో కానీ, వీధిన పడరు కదా?... వాళ్ళ దగ్గిర కొనుక్కునే వాళ్ళు వందల్లో వుంటారు. నామీద పడి బతకడంలేదు కదా!... 



చీరల విషయంలో కూడా పాలసీ మార్చాలి   యికనించి మంచి కాటన్ చీరలు కట్టుకోవాలి. గంజి పెట్టి వుతికించి, యిస్త్రీ చేయించి కట్టుకుంటే అందంగా కనిపించనా?  ... డ్రెస్ మీద కూడా ఎంతో పొదుపు చేయచ్చు; ఎంతో మంది ప్రాణాలు కాపాడచ్చు. 



'ప్రపంచాన్ని మార్చలేను కానీ, నన్ను నేను మార్చుకోగలను,' అనుకుంది ధరణి.
డ్రింక్స్ తయారు చేసుకుంది. ఒక్కో సిప్ చప్పరిస్తూ, సోఫాలో వెనక్కి వాలిపోయి ఆలోచనలో పడింది ధరణి. గుండె బరువు కొద్దిగా తగ్గినట్టనిపించింది. తన అకౌంట్ లో ఎనభై లక్షలున్నాయి; వాటిని యిద్దరి పిల్లల సర్జరీ కి వుపయోగించవచ్చు . తన ఖర్చుల్ని గణనీయంగా తగ్గిస్తే ఆశ్రమంలో పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయచ్చు; మంచి చదువు చెప్పించచ్చు; మంచి జీవితాల్ని యివ్వచ్చు. తన తల్లితండ్రులు కష్టపడి తనకి యింత మంచి చదువు చదివించి, యింత మంచి జీవితాన్నిస్తే, దాన్ని కొద్దిగా అయినా సద్వినియోగం చేయాలి కదా!... ఇంతకాలం బాధ్యతా రాహిత్యంతో బతికింది తను;  ఇక నించైనా కొంచం బాధ్యతతో మెలగాలి, అనుకుంది.



మరో డ్రింక్ తయారు చేసుకుంది. 'స్కాచ్ విస్కీ కి ఇండియన్ విస్కీ కి ఎంత తేడా వుంటుంది? .... రుచిలో కొంచం తేడా, ధరలో చాలా యెక్కువ వ్యత్యాసం... లెట్ మీ షిఫ్ట్  టు ఇండియన్ బ్రాండ్స్, అని నిర్ణయం తీసుకుంది. 



మూడు నెలల్లో తలస్సేమియా పేషెంట్లు యిద్దరికీ బోన్ మారో సర్జరీ చేయించింది ధరణి. తన అకౌంట్ ఆల్మోస్ట్ ఖాళీ అయింది, మనసు సంతృప్తితో నిండిపోయింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#55
'మేడం , మీ గురించి స్టాఫ్ చాలా బాగా చెప్పుకుంటున్నారు.... నాకు చాలా హ్యాపీ గా వుంది మాం ...'
'అది నాకు అంత అవసరం లేదు లలితా... ఆశ్రమం కి వెళ్ళాక అక్కడి దృశ్యం నన్ను కలచి వేసింది... అందుకే అలా చేయాలనిపించింది..... అంతే !'



' విషయాలన్నీ రమేష్ కార్పొరేట్ ఆఫీస్ లో కూడా స్ప్రెడ్ చేసేసాడు...'
'రమేష్ అంటే పోలియో తో ....'



'అవును మేడం ... '



ఒక్క క్షణం ఆలోచించింది. 'అతను నన్ను దొంగతనంగా చూస్తుంటాడు..... నాతో మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు.... కానీ మాట్లాడడు. ఎందుకలా చేస్తుంటాడు ?'



'అతనికి మీరంటే పిచ్చి, మేడం .... అలా అని అతను చెప్పలేదు.... నేనే గమనించాను..... అతను జస్ట్ అకౌంట్స్ అసిస్టెంట్.... అందుకే ధైర్యంగా మీతో  ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి సంశయిస్తుండచ్చు. ఆత్మ న్యూనతా భావం కావచ్చు ...'



' సీ ... మనిషి మంచివా డే కదా?'



'చాలా... అతను , తల్లి యిద్దరే వుంటారు... ముఫై దాటినా పెళ్ళి చేసుకోలేదు... తన అంగవైకల్యాన్ని అమ్మాయీ యాక్సెప్ట్ చేయదనే  భావం వున్నట్టుంది...'



ఆశ్చర్యంగా చూసింది ధరణి.  తర్వాత  చిన్నగా నవ్వింది. తనకి తెలియకుండానే, అంటే మాత్రం ఆలోచించకుండా, నిర్ణయం తీసేసుకుంది.
'ధరణి అంటే భూమి ...... అన్నీ భరిస్తుంది... మరి  భూమిని భరించగలడా రమేష్?'



కళ్ళు పెద్దవి చేసి విస్మయంగా చూసింది లలిత . అర్ధం కావడానికి సమయం పట్టింది. అర్ధమయ్యాక అంది, 'కనుక్కుంటాను మేడం ,' అంటూనే ధరణి కేబిన్ నించి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళింది లలిత.



పరిగెత్తిన లలితవైపే చూస్తోంది ధరణి. తన జీవితాన్ని కొద్ది రోజుల్లో మార్చేసింది. తన తల్లితండ్రులు యెంత ప్రయత్నించినా కాని పని.  లలితకి రుణపడిపడి పోయాను.’ 



[సమాప్తం]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#56
సేవే మా ధ్యేయం
రచన:  NDSV నాగేశ్వరరావు






'హలో నమస్తే సార్! సుబ్రహ్మణ్యం గారా?'



'హలో, ఎవరూ? నేను సుబ్రహ్మణ్యాన్నే మాట్లాడుతున్నాను.'



'సార్! నేను 'సేవే మా ధ్యేయం' సంస్థ నుంచి మాట్లాడుతున్నాను.'



'అవునా! దేని గురించి? నేను చందాలు అవీ ఏవీ ఇవ్వను. సారీ'



'సార్, సార్, ఒక్క నిమిషం. నేను చందాల కోసం కాదు సార్. మీరు మర్చిపోయినట్లున్నారు. క్రిందటి వారం మీ సొసైటీలో వైద్య శిబిరం నిర్వహించాము. గుర్తుందా?'



'ఓహో.... మీరా గుర్తొచ్చింది. చెప్పండి.'



'అదే సార్, ఆరోజు మీకు చెప్పాం కదా, ఏమైనా టెస్టులు కొన్ని అదనంగా చేయవలసి వస్తే, మీ దగ్గర డబ్బులు తీసుకుంటామని.'



'అవునవును గుర్తుంది. కానీ, ఇంకా టెస్టుల రిపోర్టులు రాలేదు కదా.'



'అవును సార్. మీ టెస్టుల్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అందుకే మరికొన్ని టెస్టులు చేసాం. దానికి సంబంధించి మీరు 250 రూపాయలు మాకు కట్టాలి.'



'ఓస్ ఇంతేనా. అలాగే, ఎలా పంపమంటారు?'



'మీకు శ్రమ అవసరం లేదు సార్. మీకు ఇప్పుడు ఒక ఓటిపి వస్తుంది, అది నాకు చెప్తే నేను బ్యాంకు ద్వారా 250 రూపాయలు మీ అకౌంట్ నుంచి మా సంస్థ అకౌంట్ కి వేస్తాను.'



'సరే అయితే. ... ఇప్పుడే నెంబర్ వచ్చింది.'



' చెప్పండి సార్.'



'అది.....3 5 9 0 1 2' 



'సరే సార్. థాంక్యూ మీ రిపోర్టు తొందరలోనే పంపిస్తాం.'



'థాంక్యూ సర్.'
……………….
సుబ్రహ్మణ్యం ఒక్కసారి వారం వెనక్కి వెళ్ళాడు. రోజు అపార్ట్మెంట్ వాళ్ల సొసైటీ బిల్డింగ్ లో చాలా కోలాహలంగా ఉంది. 'సేవే మా ధ్యేయం' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆరోజు సీనియర్ సిటిజన్లకి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం సంస్థ సభ్యులు సొసైటీ ప్రెసిడెంట్ ని కలిసి, కాంప్లెక్స్ లో ఉన్న సీనియర్ సిటిజన్లకి అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని చెప్పారు. దానికి అయ్యే అన్ని ఖర్చులు మరియు ఏర్పాట్లు హైదరాబాదులో ఉన్న ప్రముఖ ఆరోగ్య సంస్థ భరిస్తుందని, వీరు శాంపిల్స్ కలెక్ట్ చేసి హైదరాబాద్ పంపిస్తారని చెప్పారు. దీనివల్ల ' ఆరోగ్య సంస్థకు ఏమి లాభం?' అని ఆచూకీ తీస్తే, త్వరలో పట్టణంలో కూడా వాళ్ళ బ్రాంచ్ ప్రారంభించాలని అనుకుంటున్నారని, దానికి వైద్య శిబిరం ఒక రకమైన ప్రచారం అని అర్థమైంది. 



కాలంలో ఎవరైనా సేవా దృక్పథంతో చేస్తున్నారంటే, దాంట్లో ఎంతో కొంత వ్యాపార ధోరణి కూడా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే తమ సభ్యులకు ఉచిత సేవలు అందుకోవడంలో విధమైన ఇబ్బంది లేదు అనిపించి, సొసైటీ ప్రెసిడెంట్ మిగతా సభ్యులతో సంప్రదించి, వారి ప్రతిపాదనకు అంగీకారం తెలిపాడు. అనుకున్నట్టుగానే సంస్థ వైద్య శిబిరం నిర్వహించింది. దాంతో ఆరోజు చాలామంది తమ శాంపిల్స్ ఇచ్చారు.



ఆలోచనలో ఉన్న సుబ్రహ్మణ్యం, ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో ఉలిక్కిపడి చూసాడు. దాంట్లో తన అకౌంట్ నుంచి 25000 విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళు 250 కదా చెప్పారు, 25000 ఎలా అయింది? మరోసారి కళ్ళజోడు సవరించుకొని మెసేజ్ మళ్లీ చదవాడు. అది చాలా క్లియర్ గా ఉంది 25, 000. ఏం చేయాలో పాలుపోలేదు సుబ్రహ్మణ్యానికి.






మరోసారి ఆరోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. సంస్థ వాళ్ళు శాంపిల్స్ తీసుకునేటప్పుడు తమ వివరాలని కలెక్ట్ చేసారు. అంటే, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఇలా మరి కొన్ని వివరాలు. సంస్థ తమకు ఉచితంగా అన్ని సేవలు చేస్తోంది అనే ఉద్దేశ్యంతో ఎవరూ ప్రత్యేకంగా ప్రశ్నించకుండానే, వివరాలను ఇచ్చారు. కానీ తన ఫ్రెండ్ కృష్ణమూర్తి మాత్రం ఒప్పుకోలేదు. 'వైద్య పరీక్షలకి పేరు, చిరునామా, అవసరమైతే వయస్సు, ఇంకా అవసరం అయితే ఫోన్ నెంబర్ కావాలి గానీ, మిగతావన్నీ ఎందుకు ఇవ్వాలి?' అని ప్రశ్నించాడు. 



సంస్థ వారు ఏమైనా అదనపు టెస్టులు చేస్తే, వాటి ఖర్చులు వసూలు చేసినప్పుడు, డబ్బులు ఎవర్నించి వచ్చిందో తెలుసుకునేందుకోసం, అకౌంట్ నెంబరు ఇతర వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. దాంతో మిగతా వారంతా కృష్ణమూర్తి మాటని కొట్టి పడేశారు. చేసేదిలేక కృష్ణమూర్తి ఒక్కడూ టెస్టులు చేయించుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#57
సుబ్రహ్మణ్యం తను 'అన్ని వివరాలూ ఇచ్చి తప్పు చేశానా' అని తనని తానే ప్రశ్నించుకున్నాడు. లోపున మరో మారు ఫోన్ మోగింది. నెంబర్ చూడగానే అర్థమైంది, ఇందాకటి వ్యక్తే మళ్ళీ ఫోన్ చేశాడు.



ఆదుర్దాగా ఉన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా ఫోన్ తీసుకుని, అవతల వ్యక్తి మీద విరుచుకుపడ్డాడు.
'మీరు 250 అని చెప్పి, 25000 ఎందుకు నా అకౌంట్ నుంచి విత్ డ్రా చేశారు?'



'సారీ సార్. అది చెబుదామనే మీకు ఫోన్ చేశాను. నేను 250 పాయింట్ సున్నా సున్నా అని రాసిస్తే, పొరపాటున మా క్లర్క్ 25000 అని కొట్టాడు. అందుకనే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయడానికి మీకు మళ్ళీ ఫోన్ చేసాను. ఇప్పుడు మీకు మరో ఓటిపి వస్తుంది. అది కనుక చెప్తే 25000 రివర్స్ అయిపోతుంది. తప్పు జరిగి మీకు ఇబ్బంది కలిగించాను కాబట్టి, 250 మా సంస్థ భరిస్తుంది. మళ్లీ క్షమించండి సార్. ఓటిపి నెంబర్ చెప్పండి.'



అతని మాటలతో స్థిమిత పడ్డ సుబ్రహ్మణ్యం ఫోన్లో వచ్చిన ఓటీపీ చూసి, 'సార్ రాసుకోండి. 8 5 9 4 1 2. ఈసారి మాత్రం ఏమీ పొరపాటు చేయకండి సరేనా.'



'అలాగే సార్! ఈసారి పొరపాటు జరగదు. మీ రిపోర్టులు త్వరలోనే పంపిస్తాను.'



అమ్మయ్య అనుకుంటూ ఫోన్ పెట్టాడు సుబ్రహ్మణ్యం.



అదే క్షణంలో బ్యాంక్ అకౌంట్ లో మరో 25 వేలు విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఈసారి మరింత కంగారు పడ్డాడు సుబ్రహ్మణ్యం. కానీ ఇంతకుముందు జరిగినట్టుగానే మళ్లీ పొరపాటు చేశారేమో, ఒకసారి ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది అని నెంబర్ కి ఫోన్ చేశాడు. ఫోను స్విచ్ ఆఫ్ చేసినట్టుగా మొబైల్ సమాచారం వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఫోను పలకడం లేదు. ఈసారి సుబ్రహ్మణ్యం తను 'మోసపోయానా!' అనే ఆలోచనలో పడ్డాడు. ఎందుకైనా మంచిది ఒకసారి కృష్ణమూర్తి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే రోజు అకౌంట్ నెంబర్ ఇవ్వని ఒకే ఒక వ్యక్తి కృష్ణమూర్తి.



పరుగు పరుగున కృష్ణమూర్తి ఫ్లాట్ కి వెళ్ళాడు సుబ్రహ్మణ్యం. అతని గాబరా చూసిన కృష్ణమూర్తి, మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టి, విషయం కనుక్కున్నాడు. అతనికి వెంటనే అర్థమైంది సుబ్రహ్మణ్యం మోసపోయాడు అని. అతను అవతల వ్యక్తికి ఓటిపి చెప్పాడు కాబట్టి, అతని అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసి ఉంటారు. ఎందుకంటే అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ మొదలైన వివరాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి.
 
'ఇప్పుడు ఏం చేయాలి?' అని అడిగాడు సుబ్రహ్మణ్యం. 'నాకు తెలిసి మీ సమస్యకి పరిష్కారం లేదు. ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడూ చెబుతూనే ఉంటాయి, మీ వ్యక్తిగత వివరాలు ఎవరికీ అందజేయొద్దు అని. అయినా సరే వినకుండా మన సభ్యులంతా అన్ని వివరాలు వాళ్ళకి రాసి ఇచ్చారు. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పటికే మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగే ప్రయత్నం చేయవచ్చు. ముందుగా మనం సొసైటీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, అతనికి విషయం చెప్పి మనవాళ్ళందరినీ ఎలర్ట్ చేయాలి. లేదంటే సాయంత్రం లోపు అందరి అకౌంట్లూ ఖాళీ అయిపోవచ్చు.' 



వెంటనే ఇద్దరూ వెళ్లి, సొసైటీ ప్రెసిడెంట్ ని కలిసారు. విషయం తెలుసుకుని ఒక్కసారిగా ఖిన్నుడైపోయాడు సొసైటీ ప్రెసిడెంట్. తప్పులో తన భాగం కూడా ఉండడం అతన్ని బాధించింది. వెంటనే సొసైటీ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు 'ఎవరికైనా ఓటీపీ నెంబర్ చెప్పమని 'సేవే మా ధ్యేయం' సంస్థ నుంచి ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని.' అలాగే వెంటనే మరో నలుగురిని పిలిచి, విషయం చెప్పి, అందరిని తలో ఫ్లోర్ కు వెళ్లి, అందరికీ అర్థమయ్యేలా వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పమని ఆదేశించాడు. 



పావుగంటలో వార్త మొత్తం అన్ని అపార్ట్మెంట్లు సభ్యులకి చేరింది. అప్పటికే మరో నలుగురు తమ ఓటిపి చెప్పి మోసపోయారని వార్త వచ్చింది. అదే సమయంలో, తమ దగ్గర ఉన్న సంస్థ వివరాలతో వెంటనే సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంకులో కూడా వివరాలు అందజేయడం జరిగింది. అలాగే మరో కొంతమంది మోసపోయే అవకాశం ఉండడంతో, వార్త కేబుల్ టీవీ ద్వారా, ఇతర మీడియా ద్వారా ఊర్లో అందరికీ చేరేలా చూసాడు కృష్ణమూర్తి.



ఏది ఏమైనా ఉచితానికి ఆశపడి, వివరాలన్నీ చెప్పి, చదువుకుని కూడా విజ్ఞత ప్రదర్శించలేని తమలాంటి వాళ్ళు మోసపోతూనే ఉంటారని సుబ్రహ్మణ్యం అర్థం చేసుకున్నాడు. ఇకమీదట తనలాగా ఎవరికి జరగకూడదని, దానికి తగిన చర్యలు ప్రతివాళ్ళూ తీసుకోవాలని, తనకు తెలిసిన స్నేహితులందరికీ చెబుతూ వస్తున్నాడు సుబ్రహ్మణ్యం. 



అతని మాటలు విన్న ఒక మిత్రుడు అన్నాడు, 'నీకు గుర్తుంటే ఆరోజు వైద్య శిబిరం నిర్వహిస్తున్నప్పుడు మాట్లాడిన యాంకర్ చాలాసార్లు చెప్పింది షేవే మా ధ్యేయం అని. తనకి భాష రాదు అని మనం నవ్వుకున్నాం. కానీ, విషయం చెప్పకనే చెప్పింది, 'షేవే (shave) మా ధ్యేయం' అనీ, మనకే అది అర్థం కాలేదు.'

************
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#58
హాట్ ఐస్ క్రీం
రచన: L. V. జయ






"అబ్బా! తిరిగి తిరిగి కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి. ఇంక నడవడం నా వల్ల కాదు" అంది జాగృతి. 



"వెకేషన్ కి వచ్చి నడవలేనంటే ఎలా ? పెయిన్ కిల్లర్ వేసుకో. తగ్గిపోతుంది" అన్నాడు సమర్థ్. 



" ఎన్ని రోజులుగా రోజూ నడుస్తున్నామో. పాదాల దగ్గర పొంగిపోయింది. నొప్పులు పెయిన్ కిల్లర్ తో కూడా తగ్గేటట్టు లేవు" అంది జాగృతి. 



"ఇక్కడ రిసార్ట్ లో స్పా వుంది. వెళ్లి మసాజ్ చేయించుకో. కొంచెం హాయిగా ఉంటుంది. రేపు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ లో చాలా నడవాలి". అన్నాడు సమర్థ్. 



" సరే. నేను, శాన్వి వెళ్తాము. శాన్వికి మెడ దగ్గర నొప్పిగా వుంది అంటోంది" అని శాన్వి తో స్పా కి వెళ్ళింది జాగృతి. 



స్పా చాలా నచ్చింది ఇద్దరికీ. చిన్న, చిన్న గుడిసెలు చాలా వున్నాయి. కొంచెం దూరంలో బీచ్. లోపల మంచి మ్యూజిక్, చిన్న వాటర్ ఫౌంటెన్. అలా వాటర్ పడుతున్న సౌండ్ వింటూ మసాజ్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు ఇద్దరూ. 



జాగృతికి ఫుట్ మసాజ్ చెయ్యడానికి వచ్చింది ఒక అమ్మాయి. పేరు విలాన్. నవ్వుతూ పలకరించింది. మసాజ్ చేస్తున్నంతసేపూ మాట్లాడుతూనే వుంది. "మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని రోజులు వుంటారు బాలి లో ? ఇదేనా మొదటిసారి రావడం బాలికి ? ". ఇలా చాలా ప్రశ్నలు.



 అన్నిటికి సమాధానం చెప్పింది జాగృతి. 



"మీకు బాలి నచ్చిందా ? ఏం చూసారు ఇప్పటి వరకు ?" అని అడిగింది శాన్విని. 



"గరుడ విష్ణు కెంచన, సరస్వతి టెంపుల్, మంకీ సాంక్చువరి, ది గేట్స్ అఫ్ హెవెన్. ఇలా చాలా చూసాం" చెప్పింది శాన్వి.



"మీరు హిందూనా? నేను కూడా హిందునే. బాలి లో చాలా మంది హిందూస్ వున్నారు. కానీ మీవి, మావి కొన్ని ట్రేడిషన్స్ లో తేడా ఉండచ్చు". 



"మీరు వీగనా, వెజిటేరియేనా? మీరు ఇక్కడ రెస్టరెంట్స్ లో తింటున్నారు? ఇండియన్ రెస్టౌరెంట్స్ కి వెళ్తున్నారా? ". ఇలా మాట్లాడుతూ మసాజ్ చెయ్యటం విలాన్ కి అలవాటేమో అనుకుని అన్నిటికి సమాధానం చెప్పింది జాగృతి. 



"నాకు ఇండియా అన్నా, ఇండియన్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఢిల్లీ లో పని చేస్తుంది. ఇండియన్ ని పెళ్లి చేసుకుంది. అక్కడే హ్యాపీగా ఉంటోంది. నాకు కూడా ఇండియా వెళ్లాలని వుంది. అంతా చూడాలని వుంది. ముఖ్యంగా జైపూర్. అక్కడ అందమైన పాలస్ లు చూడాలని వుంది. మంచి రుచికరమైన ఫుడ్ తినాలని వుంది. " మాట్లాడుతూనే వుంది విలాన్. 



"యెల్లో బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా తెస్తుంది నాకోసం ". 



"యెల్లో బాల్స్ ఏంటి?" అడిగింది జాగృతి. 



" యెల్లో బాల్స్. ఇండియా లో చాలా ఫేమస్ కదా". 



అర్ధం కాలేదు జాగృతికి. 



" దేవుడి దగ్గర పెడతారు కదా అవి " అంది విలాన్. 



"ఓహ్ తినే పదార్థమా ? లడ్డూ నా ?" అడిగింది జాగృతి. 



"అవును. గణేష్ కి పెడతారు. చాలా స్వీట్ గా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది" అంది విలాన్. 
లడ్డూ ని యెల్లో బాల్ చేసేసింది అనుకుని నవ్వుకున్నారు జాగృతి, శాన్వి. 
 
"మీరు తినే ఆరంజ్ కలర్ థింగ్ ని ఏమంటారు?" ఇంకో ప్రశ్న. 



అది కూడా తిండికి సంబంధించింది మళ్ళీ. ఆలోచించారు జాగృతి, శాన్వి. ఏం తింటాం ఆరంజ్ కలర్ ది అని. 



"ఆరంజ్ కాదు. రెడ్ కలర్ లో ఉంటుంది. కట్ చేసి బిర్యానీ లో వేస్తారు. " 



శాన్వి కి అర్ధం అయ్యింది ఉల్లిపాయ గురించి అడుగుతోంది అని. 



"రెడ్ ఆనియన్ " అని చెప్పింది శాన్వి. 



"వైట్ కలర్ లో వుండే దాన్ని ఏమంటారు మరి ?". 



"అది కూడా ఆనియన్. వైట్ ఆనియన్" చెప్పింది శాన్వి. 



"ఓహ్. నేను ఇంకా బ్రదర్ ఆనియన్, సిస్టర్ ఆనియన్ అని అనుకున్నాను. " అంది విలాన్. 



రెడ్ ఆనియన్, వైట్ ఆనియన్ కి వచ్చిన కొత్త పేర్లు విని నవ్వుకున్నారు శాన్వి, జాగృతి. 
"పర్పల్ కలర్ లో ఉంటుంది అది ఏమిటి?" అడిగింది విలాన్. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#59
సన్నంగా వుంది కానీ తిండికి సంబంధించిన ప్రశ్నలు ఇన్ని అడుగుతోంది ఏంటి అమ్మాయి. ఏమిటో ఇలా చిక్కుపోయాం. అమ్మాయి పేరు విలాన్ కాదు విలన్ అయ్యి ఉంటుంది. మధ్యలో వెళ్ళిపోటానికి కూడా లేదు అని అనిపించింది ఒక నిమిషం జాగృతికి. తనకి వచ్చిన ఆలోచనకి నవ్వుకుని శాన్విని చూసింది. 



శాన్వికి అర్ధం అయ్యి " పోనిలే అమ్మ. టైంపాస్ అవుతోంది. నవ్వు వస్తోంది" అంది. 



"నేను, నా ఫ్రెండ్ ఇక్కడ ఒకసారి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము. ఐస్ క్రీం ఆర్డర్ చేసాం. ఫస్ట్ టైం చూసాను అలాంటి ఐస్ క్రీం. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి" అని చేతులు ఊపుతూ చెప్పింది విలాన్. 



పుస్ పుస్ పుస్ అని చూపించిన విధానానికి నవ్వు వచ్చింది జాగృతికి, శాన్వికి. 



"చాలా బాగుంది. మీరు కూడా తింటారా అది ? ". 



దేని గురించి మాట్లాడుతోందో అర్ధంకాక ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు జాగృతి, శాన్వి. 



"కుల్ఫీ నా?" అడిగింది శాన్వి. 
"కాదు. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి" అని మళ్ళీ చేతులు పూవులు విచ్చుకున్నట్టు చూపిస్తూ చెప్పింది విలాన్. 



" పుస్ పుస్ పుస్ ఐస్ క్రీం ఏమిటి" నవ్వుకున్నారు జాగృతి, శాన్వి. 



". గుర్తు వచ్చింది దాని పేరు. హాట్ ఐస్క్రీమ్". 



"ఐస్ క్రీం హాట్ గా ఉండడం ఏమిటి ? "అంది జాగృతి. 



"బౌల్ లో తెచ్చి ఇచ్చారు. పుస్ పుస్ పుస్ అని పొగలు వచ్చాయి. " సారి కూడా చేతులు ఊపుతూనే చెప్పింది. 



"వేడి తట్టుకోలేక చిన్న టవల్ లో పట్టుకుని వచ్చారు. ఐస్ క్రీం అడిగితే హాట్ ఐస్క్రీమ్ తెచ్చారు. ఎలా తినాలా అనుకున్నాం. చూడడానికి వేడి గా వుంది. కానీ తింటే చల్లగా వుంది. అది చేస్తున్నప్పుడు కూడా చూసాం మేము. పాన్ మీద చేసారు. ఫ్రైడ్ ఐస్ క్రీమా దాని పేరు, హాట్ స్క్రీమా. మర్చిపోయా ". 



"అబ్బా. అర్ధం అయ్యింది. ఐస్ క్రీం రోల్స్" అంది జాగృతి. ఐస్ క్రీం రోల్స్ కి కూడా కొత్త పేరు ఇచ్చింది విలాన్ అని నవ్వుకున్నారు జాగృతి, శాన్వి. 



"మళ్ళీ రేపు రండి. నా దగ్గరే మసాజ్ చేయించుకోండి. " అంది విలాన్. 
"మళ్ళీ ఇలా కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తారా? " అంది నవ్వేస్తూ అంది శాన్వి. 



"తప్పకుండా " నవ్వేస్తూ బై చెప్పింది విలాన్. 



మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ 30 నిముషాలు ఎలా గడిచాయో కూడా తెలియదు. విలాన్ మాట తీరు, నవ్వు మొహం, అమాయకత్వం అన్ని నచ్చాయి వాళ్ళకి. తనతో ఒక ఫోటో తీయించుకుని, టిప్ ఇచ్చి, నొప్పులు తగ్గినందుకు హాయిగా నవ్వుకుంటూ బయటికి వస్తుంటే విలాన్ అడిగింది "రేపు వస్తారా మళ్ళీ. మీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. రేపు కూడా వస్తే ఇంకా కొంచెం నొప్పి తగ్గుతుంది". 



"మేము రేపు వెళ్ళిపోతున్నాం. ఇంక రావడం కుదరదేమో. నైస్ టు మీట్ యు " అని చెప్పి బయటకి వస్తూవుంటే అడిగింది విలాన్ "నేను గుర్తు ఉంటానా మీకు" అని. 



వెనక్కి తిరిగి చెప్పారు ఇద్దరు ఒకేసారి. "ఎలా మర్చిపోతాం. ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం మీ దగ్గర " అంటూ నవ్వుతూ బై చెప్పి వచ్చారు జాగృతి, శాన్వి. 



యెల్లో బాల్స్, బ్రదర్ ఆనియన్, సిస్టర్ ఆనియన్, పుస్ పుస్ పుస్ హాట్ ఐస్ క్రీం గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. 



సమాప్తం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#60
అందిన ద్రాక్ష తియ్యన
రచనతాత మోహనకృష్ణ



సుబ్బారావు నూనూగు మీసాల వయసు నుంచి..అందమైన పెళ్ళాం కోసమే కలలన్నీ. ఎక్కడో చదివినట్టు, అందమైన అమ్మాయి పెళ్ళాం అయితే, లైఫ్ చాలా  బాగుంటుందని నమ్మకం. అందుకే ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా, వద్దని చెప్పేసేవాడు. వయసు ఆగదు కదా... అది రోజు రోజు కు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సుబ్బారావు వయసు ముప్పై దాటింది..



"ఒరేయ్ కన్నా! ముప్పై దాటితే..ముదిరిన బెండకాయ అంటారు రా! పెళ్ళి చేసుకోరా..చెప్పింది వినరా!" అంది అమ్మ..



"నా సినిమా హీరోలు అందరూ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. వాళ్ళకి నా కన్నా ఎక్కువ వయసే కదా అమ్మా!..నా కేంటి చెప్పు?"



"ఒరేయ్! వాళ్ళు సెలబ్రిటీస్...వాళ్ళకి ఎప్పుడైనా అమ్మాయిలు లైన్ కడతారు. నువ్వు ఒక చిన్న ఉద్యోగి...తర్వాత నీ ముఖం కుడా ఎవరూ చూడరు. ఎందుకు నీకు ఇంత పట్టుదల చెప్పు..! పెళ్ళానికి అందం కాస్త తక్కువ అయితే ఏమిటి  చెప్పు..మంచి మనసుంటే చాలదూ...?"



అవును రా! నీ మరదలు రమ్య..నువ్వంటే చాలా ఇష్టపడుతుంది. చిన్నప్పుడు నువ్వు, రమ్య చాలా స్నేహంగా ఉండేవారు. అప్పట్లో మేమంతా ఇద్దరి జంట చూసి మురుసిపోయాము. ఇప్పుడేమో.. నువ్వు నీ మరదలంటే ఇష్టం లేదంటావు.. ? నీ మరదలైతే.. ఇంకా నీ గురించే ఆలోచిస్తోంది..



"లేదమ్మా! నేను ఇంకో రెండేళ్ళు వెయిట్ చేస్తాను..అందమైన పెళ్ళాం వస్తుందేమో..!"



"ఇంకో సంవత్సరం పొతే...నీ మరదలు కుడా నిన్ను చేసుకోదు.. దిక్కు లేకపోతే, మావయ్య కూతురే దిక్కని అప్పుడు అనుకున్నా.. ఏమీ ప్రయోజనం ఉండదు.."



"మరీ భయపెట్టకే అమ్మా! నువ్వు గట్టిగా ప్రయత్నించు..నీకు మంచి అందమైన కోడలు వస్తుంది. నువ్వు నీ కోడలు గురించి, మీ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పుకోవచ్చు.."



రెండు సంవత్సరాలు గడచింది...అప్పట్లో, నెలకొక పెళ్ళి సంబంధం వస్తే...ఇప్పుడు సంవత్సరానికి ఒక్కటే మహా కష్టం అయింది. సుబ్బారావు కు తన చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని...సరదాగా ఉంటుంటే, ఎక్కడో బాధనిపించింది. మంచి ఉద్యోగం ఉంది..కానీ ఏం ప్రయోజనం..? వయసేమో కరిగిపోతోంది. ఇంకా కొంతకాలం ఆగితే, కష్టమని గ్రహించాడు సుబ్బారావు.



"అమ్మా! నువ్వు చెప్పినట్టే పెళ్ళి చేసుకుంటాను...అందాన్ని ఏమైనా కొరుక్కు తింటామా ! మంచి మనసుంటే చాలు..నన్ను బాగా చూసుకుంటే చాలు. అందం శాశ్వతం కాదు కదా..!"



"నీ కళ్ళు చాలా లేట్ గా తెరుచుకున్నాయి కన్నా..! ఇప్పుడు చామన ఛాయ గా ఉన్న అమ్మాయి కూడా నీకు 'నో' అంటోంది..వారికీ డిమాండ్ బాగా పెరిగింది. మావయ్య కూతురికి కుడా ఇంకో సంబంధం చూస్తున్నారు..."



"నేను వెళ్లి మాట్లాడతాను నా మరదలితో..." అన్నాడు సుబ్బారావు.



"అదేంట్రా! రమ్య కు అంత సీన్ లేదన్నావు కదా..!"



సుబ్బారావు తన మరదలిని కలవడానికి బయల్దేరాడు. ముందు ఫోన్ చేద్దాం అనుకున్నాడు. కానీ, రమ్య ని కలిసి మాట్లాడితే బాగుంటుందని అనుకున్నాడు. ఇంట్లో అయితే.. మావయ్య ఉంటాడు..ఎలా అని ఆలోచించాడు సుబ్బారావు. రమ్య కు కాల్ చేసాడు.



"హలో రమ్య! నేను నీ బావ ని.."



"హలో బావా..! ఏమిటి విషయం? ఏమిటి నేను సడన్ గా గుర్తొచ్చాను..?"



"నీతో మాట్లాడాలి రమ్య..అలా మన పక్క సందు లో ఉన్న పార్క్ కు వస్తావా..?"



"అలాగే బావ.."



రమ్య పార్క్ లో తన బావ సుబ్బారావు ని కలిసింది..



"మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా రమ్య..! నేనంటే నీకు చాలా ఇష్టమని కుడా చెప్పావు. చిన్నప్పుడు మనం ఆడుకున్న ఆటలు, చేసిన అల్లరి గుర్తుకు లేవా..? ఇప్పుడు మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటావా..?"



"నువ్వంటే, నాకూ చాలా ఇష్టమే బావ..కానీ, నీకు నేను అందంగా లేనని అత్తయ్య చెప్పింది. అయినా, మీ అంతటి వారికి మేము ఎలా నచ్చుతాము చెప్పండి..?"



"ఛా...! నీకు ఎవరు చెప్పారు...నువ్వు ఐశ్వర్య రాయి కి కాస్త అటూ..ఇటు గా ఉంటావు..అందుకే ఇన్నాళ్ళు.. నేను నీకు సరిపోతానో లేదో అని ఆలోచించాను. అంతే..!"



"పో బావా..! నువ్వు మరీను. నా అందం గురించి అంతగా పొగడకు.. నాకు సిగ్గేస్తోంది.."



"అయితే నన్ను పెళ్ళి చేసుకుంటావా మరి..?" అడిగాడు సుబ్బారావు.



"నా కోసం మరి నాన్న ఓకే చేసిన సంబంధం మాట ఏమిటి చెప్పు..? అబ్బాయి అభిషేక్ బచ్చన్ లాగ ఉంటాడు తెలుసా..?"
"అందం లో ఏముంది చెప్పు...! నిన్ను నేను దేవత లాగ చూసుకుంటాను..నన్ను పెళ్ళి చేసుకో రమ్య..ప్లీజ్..!!!.." అని మరదలు కాళ్ళు పట్టుకునే అంత పని చేసాడు సుబ్బారావు.. 






****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)