
మాయం....
EP: 1. సూసైడ్ చేసుకోవటం ఎలా..??
EP : 2. తన పేరు నాన్సీ.....
EP : 3. చెల్లి తో
EP : 4. ఇంటి ముందు ప్రేమ జంట
EP: 1. సూసైడ్ చేసుకోవటం ఎలా..??
EP : 2. తన పేరు నాన్సీ.....
EP : 3. చెల్లి తో
EP : 4. ఇంటి ముందు ప్రేమ జంట
# dasara special మాయం
|
![]()
మాయం....
EP: 1. సూసైడ్ చేసుకోవటం ఎలా..?? EP : 2. తన పేరు నాన్సీ..... EP : 3. చెల్లి తో EP : 4. ఇంటి ముందు ప్రేమ జంట
04-09-2024, 08:32 PM
(This post was last modified: 05-09-2024, 09:17 PM by latenightguy. Edited 3 times in total. Edited 3 times in total.)
EPISODE: 1
టైమ్ రాత్రి పన్నెండున్నర ఒక చల్లని శీతాకాలపు పొగమంచు తో కూడిన నిశీధి.. మహారాష్ట్ర లోని సిటీ కి శివారు ప్రాంతం లో ఒక నిర్మానుష్యం గా ఉన్న రైల్వే స్టేషన్ లో చీకటి లో ఒక బెంచ్ మీద ఒక పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక అబ్బాయి తల కింద లగేజ్ దిండుగా పెట్టుకుని పడుకుని తన స్వెట్టర్ పోకెట్ లోంచి మొబైల్ తీసాడు... అనౌన్స్మెంట్ : ట్రెయిన్ నెంబర్ ఎక్ దో ఆట్... తోడి హి దేర్ మే ఏక్ నెంబర్ ప్లాట్ఫాం పర్ అయేగి... మెల్లగా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నాడు Random యూట్యూబర్ : ఈ రోజు సింపుల్ గా సూసైడ్ చేసుకునే మార్గాలు ఏంటో చూద్దాం...... వీడియో కి అడ్డం పడుతూ మొబైల్ వైబ్రేట్ అయ్యింది ....."పిన్ని కాలింగ్"......కాల్ కట్ చేశాడు.... యూట్యూబర్: మీరు పైకి పోయే ముందు ఒకసారి నా ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చెయ్యటం మర్చిపోకండి..ఇక వీడియో మొదలు పెడదాం.... దూరం నుంచి ట్రైన్ వస్తూ ఉండటం తో వీడియో బంద్ చేసి లేచి లగేజ్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు... రావలసిన ట్రెయిన్ వచ్చింది... ఎక్క వలసిన భోగి ఎక్కేసాడు...ట్రెయిన్ కదిలింది మళ్ళా ఫోన్ వచ్చింది..... పిన్ని కాలింగ్ ... అర్థరాత్రి కావటం తో పడుకున్నవాళ్ళు డిస్టబ్ అవుతారు అని లగేజ్ కింద పెట్టేసి.... డోర్ దగ్గరకి వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు.... లిఫ్ట్ చేసి హాలో అన్నాడు.. పిన్ని : కరణ్ ...అక్షయ చెప్తుంది నిజమా..నువు ఇంటికి తిరిగి వచేస్తున్నావ్ అంటా... కరణ్ : పిన్ని అది నేను పిన్ని : నిన్ను ఇంత కాలం చూసిందే ఎక్కువ...నువు అలా తిరిగి వచ్చేస్తే నిన్ను భరించే వాళ్ళు లేరు ఇక్కడ...మీ బాబాయి ది కూడా ఇదే మాట కరణ్ నోట మాట పడిపోయింది... కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి...ఫోన్ కట్ అయ్యింది... ఇంటికి వెళ్తే చూసే దిక్కు లేదు...వెనక్కి వెళ్తే ఎక్కడో రాష్ట్రం కాని రాష్ట్రం లో కాలేజ్ లో రాగింగ్ చేసి చంపుతున్నారు... ఏడుస్తున్న కళ్ళతోనే డోర్ దగ్గర ఉండి నిండు చందమామ ని చూస్తూ నిలబడ్డాడు కాసేపు.... చిమ్మ చీకటి లో ట్రైన్ గంటకి 100 కిలో మీటర్ల స్పీడ్ తో వెళ్తుతుంది .....ఆ వేగానికి గాలి ఒరిపిడి కరణ్ ను తాకి వెనక్కి నెడుతుంది... కాసేపు గాలికి .... మనసులో బాధకి అక్కడే ఊగిసిలాడిన కరణ్..జీవితం లో తర్వాత అడుగు ఎటు వెయ్యాలో తెలీక..ఒక్క అడుగు ముందుకి వేశాడు..... అంతే దొర్లుకుంటూ గాఢాంధకారం లోకి పడిపోయాడు... ట్రెయిన్ కూత పెడుతూ పండు వెన్నెల లో దూసుకుపోతుంది..
04-09-2024, 10:03 PM
(04-09-2024, 08:32 PM)latenightguy Wrote: EPISODE: 1 కథనం ఆసక్తికరంగా ఉంది. ఎటు మలుపుతిరుగుతుందో చూడాలి! అభినందనలు, మీ కృషి ఫలించాలని
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు ![]() మా తెలుగు తల్లికి మల్లె పూదండ ![]()
05-09-2024, 06:41 AM
Excellent start
05-09-2024, 06:57 AM
Excellent start
05-09-2024, 11:27 AM
Good start
05-09-2024, 11:47 AM
Excellent narration continue the story.
Try to give bigger updates pls
05-09-2024, 02:35 PM
(This post was last modified: 05-09-2024, 09:15 PM by latenightguy. Edited 5 times in total. Edited 5 times in total.)
EPISODE : 2
అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసే సరికి కరణ్ కళ్ళ ఎదుట కాస్త దూరం లో మంట వెలుగుతూ కనిపించింది.. స్పష్టంగా చూడలేకపోతున్నాడు...ఒళ్ళు అంతా నొప్పి కాస్త మైకం లో తను ఎక్కడ ఉన్నాడో తనకే అర్థం కావట్లేదు... కాస్త ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా తన స్థితి ని గ్రహించటం మొదలు పెట్టాడు... చుట్టూ చూస్తే తను మంట వెలుగు లో ఒక చిన్న గుడిసె లో ఒక మంచం మీద వెచ్చని గుడ్డ పీలికల మధ్య లో చక్కగా పడుకోబెట్టి ఉన్నాడు.... లేవటానికి ప్రయత్నించాడు కాని లేవటం కష్టం గా ఉంది...అంత లో ఒక పండు ముసలిది వచ్చి లేవబోతున్న కరణ్ ని ఆపింది... కరణ్ భయం తో ఆమె ను చూసాడు...మొహం అంతా వడిలిపోయి చర్మం ముడతలు ముడతలు గా ఉంది... కరణ్ : ఎవరు నువ్వు ఆమె వణుకుతున్న స్వరం తో ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగింది కరణ్ : హా కొద్దిగా పర్లేదు...అన్నాడు ఇబ్బందిగా ఆమె కరణ్ కాళ్ళు చేతులు మెడ తడుముతూ నొప్పి లేదు కదా అని అడిగింది... కరణ్ : లేదు ఆమె లేచి అప్పటి వరకు మంట మీద కాగుతున్న చిన్న డబ్బా లోని ద్రవాన్ని ఒక కప్ లోకి ఒంపి వణుకుతూ తెచ్చి కరణ్ కి ఇచ్చి పక్కన కూర్చుంది.. ఆమె : తాగు బాగుంటుంది అని నవ్వుతుంది కరణ్ మెల్లగా వేడి గా ఉన్న ద్రవాన్ని తాగుతూ ఎవరు నువ్వు అని అడిగాడు మరోసారి ఆమె : నాన్సీ నా పేరు అంటూ మరో సారి బోసి నవ్వు నవ్వింది కరణ్ : ఓహ్ ఆమె : అది సరే నీ సంగతి చెప్పు...రెండు రోజుల నుంచి అలా పడి ఉన్నావు..ఎమ్ అయింది నీకు కరణ్ జరిగిన ఘటన ని తలుచుకుంటూ దిగులు పడటం మొదలు పెట్టాడు.. ఆమె కరణ్ కళ్ళలోకి చూస్తూ ఉంది కరణ్ : చనిపోదాం అనుకున్నా...కుదరలేదు నాన్సీ కరణ్ గడ్డం పట్టుకుని నవ్వుతూ ఉంది కరణ్ : నాకు ఎవరూ లేరు నాన్సీ....అన్నాడు దీనంగా నాన్సీ ఒంటి పన్ను తో హి హి హి హి హి అని నవ్వుతుంది కరణ్ : ప్చ్చ్...నవ్వకు ఆమె : నీ పేరు చెప్పలేదు కరణ్ : కరణ్ ఆమె : చూడు కరణ్....నాకు కూడా ఎవరూ లేరు...నేను మాత్రమే బ్రతుకుతున్నా ఈ అడవి లో...జీవితం చాలా హాయిగా ఉంది..కాని ఒకటే బాధ... కరణ్ : ఎంటి ఆమె : వృద్ధాప్యం కరణ్ జాలిగా చూసాడు ఆమె : హా...ఈ ఒంగిపోయిన శరీరం తో కాస్త బాధ తప్ప...ఒంటరి తనం అనేది ఒక వరం లాంటిది... అంటూ కి కి కి కి కి అని నవ్వుతుంది... కరణ్ కూడా ఆమెతో నవ్వు కలిపి...ఈ అడివి లో ఒంటరిగా ఉంటున్నావా అని అడిగాడు ఆమె : హా కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా... కరణ్ : అవునా ఆమె : హా!!! కరణ్ కి కాస్త ఒంటి మీద పట్టు వచ్చింది..కాస్త లేవగలుగుతూ... నాన్సీ ఇక నేను వెళ్తాను అని అన్నాడు ఆమె ..ఇంత రాత్రి మీద ఎటు వెళ్తావ్...పైగా కారడివి ..అంత మంచిది కాదు అని చెప్పింది కరణ్ : లేదు నాన్సీ...నాకు ఇక్కడ ఉండాలని లేదు... వెళ్లిపోతా... ఆమె : చెప్పేది విను...నువు నా మనవడి లాంటి వాడివి...ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు బయలుదేరు...అని తల మీద ప్రేమగా చెయ్యి వేసింది... కరణ్ కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి నాన్సీ నవ్వుతూ ఎందుకు ఏడుస్తున్నావు అని అంది కరణ్ : నన్ను ప్రేమగా చూడటానికి ఎవరు లేరు...కనీసం ప్రేమించిన అమ్మాయి కూడా....వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నాడు... నాన్సీ కోపంగా చూస్తూ మాటి మాటికి ఏడ్చేవాళ్ళని అది తీసుకుపోతుంది తెలుసా అని హెచ్చరించింది... కరణ్ ఏడుపు ఆపి ఎవరు అని అడిగాడు నాన్సీ కళ్ళు పెద్దవి చేసి బ్రహ్మ రాక్షసి అని చెప్పింది కరణ్ కి మనసు లో ఆహ్లాదంగా అనిపించింది...ఇలాంటి పిట్ట కథలు చెప్పటానికి తనకి ఎలాంటి నాయనమ్మ లేదు.. కరణ్ : అవునా నాన్సీ : హా కరణ్ : ఎక్కడ ఉంటుంది ఆ బ్రహ్మరాకాసి నాన్సీ : ఇక్కడే ఈ అడవి లోనే నాన్సీ చెప్తుంటే కరణ్ ఆసక్తి గా వింటూ ఉన్నాడు... మధ్య మధ్యలో వింటున్నావా అని అడిగి మరీ కథ చెప్తుంది ...కరణ్ కూడా ఊ కొడుతూ మరీ వింటున్నాడు అలా కథ చెప్పటం పూర్తి చేసింది నాన్సీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కరణ్ కి నాన్సీ : అలా అప్పటి నుండి చీకటి అయితే ఎవరూ బయటకి రారు కరణ్ : అమ్మో!!! అంటే అది ఇప్పటికీ బ్రతికే ఉందా నాన్సీ : చెప్తున్నాగా దానికి చావు లేదు...అని నవ్వుతుంది... కరణ్ : చాలా బాగుంది నాన్సీ కథ...నాకు ఇంక నిద్రోస్తుంది... నాన్సీ : హా నిద్రపో నిద్రపో...ఎమ్ భయం లేదు నేనున్నా గా అంటూ దుప్పటి కప్పింది... కరణ్ నిద్రలోకి జారుకున్నాడు... తెల్లారింది... కరణ్ కి తెలివి వచ్చింది...చుట్టూ చూశాడు నాన్సీ కనిపించలేదు కరణ్ కి శరీరం అంతా తేలికగా అనిపించింది... ఎలాంటి నొప్పి లేదు...చక్కగా లేచి బయటకి వచ్చాడు...ఎక్కడ కూడా నాన్సీ జాడ లేదు.. కరణ్ తనని పిలుస్తూ చుట్టూ చూశాడు...కాని అక్కడ ఎవరూ లేరు కరణ్ ఎటు పోయింది ఈ నాన్సీ...అనుకుంటూ అలా అడవి లోంచి నడుచుకుంటూ తిరుగుతున్నాడు...ఎక్కడ కూడా మనిషి జాడ లేని అడివి అది...కరణ్ కి భయం పట్టుకుంది... దారి కూడా తప్పిపోయాడు.... వెనకా ముందు చూస్కున్నా దట్టంగా పొడువైనా చెట్లు తప్ప మరేం లేదు....ఏదో క్రూరమృగం అలికిడి వినపడటం తో భయం మొదలయ్యి వేగంగా పరుగులు పెట్టాడు ...కాసేపు పరుగుల ప్రయాస తర్వాత అనూహ్యంగా అడవి లోంచి బయట పడినట్లు గా గుబురు చెట్ల మధ్యలోంచి దూరంగా ట్రాక్ మీద ఆగి ఉన్న ట్రైన్ కనిపించింది.... అంతే పట్టలేని ఆనందం కలిగింది....మళ్ళా పరుగు తీసి చెట్లు ని నెట్టుకుంటూ అడవి లోంచి బయట పడి... ట్రైన్ దగ్గరకి చేరుకున్నాడు...చూస్తే ట్రైన్ చాల కాలిగా ఉంది..అప్పుడే గుర్తుకు వచ్చింది...తన దగ్గర ఫోన్ కాని మనీ కాని లేదు...ఉత్తగా అలా నిలబడి ఎమ్ చెయ్యాలా అని చూస్తున్నాడు...అంత లో గ్రీన్ సిగ్నల్ వెయ్యటం తో ట్రెయిన్ కదిలింది...వేరే మార్గం లేక ఆలస్యం చెయ్యకుండా ఎక్కేసాడు... ట్రైన్ వేగం పుంజుకుంది....తిరిగి డోర్ దగ్గర నిలబడి వెనక్కి వెళ్లిపోతున్న కారడివి ని...అలా చూస్తూ నాన్సీ కి ఒక మాట చెప్పాల్సింది ఛా అని బాధ పడుతూ వెనుదిరిగే లోపల ఒక దృశ్యం కరణ్ కంట పడింది.... నాన్సీ డెడ్ బాడి ని కొంత మంది కూలీలు ట్రాక్ పక్కగా తీసుకు వెళ్తున్నారు... అంతే కరణ్ కి ఒక్కసారిగా గొప్ప దుఃఖం తన్నుకు వచ్చేసి నాన్సీ అని ఒక గావు కేక వేశాడు....కాని అప్పటికే ట్రైన్ చాలా మైళ్ళు దాటేసింది...ఏడుస్తున్న కళ్ళ తో ఆ దృశ్యాన్ని కనుమరుగయ్యే వరకూ అలా చూస్తూ ఉండిపోయాడు....ఏడుపు పొంగుకొచ్చేస్తుంది... కాని ఎమ్ చెయ్యలేని పరిస్తితి..తనకి ఎమ్ అయిందో తెలియదు.....కాసేపు అలాగే నిలబడి తన గురించి ఆలోచిస్తూ...ఇంక చేసేది లేక ఫేస్ వాష్ చేసుకుందామని వాష్ రూం కి వెళ్ళాడు....నీళ్ళు మొహం మీద జల్లుకొని అద్దం లో చూస్కున్నాడు... అంతే అద్దం లో తను లేడు... కరణ్ కి రాత్రి నాన్సీ చెప్పిన బ్రహ్మ రాక్షసి కథ గుర్తుకు వచ్చింది...శరీరాలు మారుస్తుంది కాని దానికి చావు లేదు అని.. |
« Next Oldest | Next Newest »
|