|
|
RAMULUJ's Most Liked Post |
Post Subject |
Numbers of Likes |
RE: నిన్ను కోరే వర్ణం |
16 |
|
Post Message |
Super ga raastunnaru pl continue
"ఏం చేస్తున్నావ్ బావా.." అర్ధరాత్రి చెరువు గట్టున చెట్టు మీద శివ ఒళ్ళో కూర్చుని అడిగింది నిధి.
శివ : నిజం చెప్పనా.. ఇంకా నేనేం అనుకోలేదు, వీళ్ళు ఏదో ఒకటి చెయ్యి అని గోల పెడుతుంటే సరేలే అని కొబ్బరికాయ కొట్టాను
నిధి అయ్యా అని నవ్వింది, మరి ఎలా ?
ఎందుకు నువ్వు కూడా అదే షాపులు పెట్టకూడదు. వాళ్లకి పొటీగా పెట్టి తొక్కేయి బావ. అప్పుడు అర్ధం అవుతుంది.
శివ : వాళ్ళు నా అమ్మకి అన్నలు, నా తాత కొడుకులు, నా మేనమావలు, మీ నాన్న
నిధి : వాళ్ళు అనుకోవాలిగా
శివ : డబ్బులు అందరికీ పైనే కనపడతాయి నిధి.. బంధాలు లోపల ఎక్కడో ఉంటాయి అవి అవసర తీవ్రత బట్టి కానీ బయటకు రావు. నాకు వాళ్ళ గురించి తెలుసు, అమెరికాలో ఉండలేక అక్కడ బతికిన బతుకు ఇక్కడా బతకాలంటే వాళ్లకి ఆ షాపులు తప్ప ఇంకేవి లేవు. ఇవన్నీ నేనెప్పుడో ఊహించాను. వాళ్ళ వయసుకి ఇవన్నీ చెప్పి నన్ను అడగలేక ఇలా చేశారు అంతే
నిధి : ఇంత ముందుచూపు ఉన్నవాడివి మరి నువ్వెందుకు జాగ్రత్త పడలేదు ?
శివ : నేను జాగ్రత్త పడి ఉంటే మీరంతా బాధపడేవారు, నిధి ముక్కు పట్టుకుని చెప్పాడు
నిధి : నువ్వింత మంచిగా ఉండకూడదు బావా
శివ : నేను ఊరికి వెళ్లి రావాలి
నిధి : ఎక్కడికి
శివ : నానమ్మ దెగ్గరికి
నిధి : వాళ్ళు నీతో బానే ఉన్నారా ?
శివ : ఎందుకు అలా అడిగావు, మా నాన్న పోయాక ఇక్కడే ఉన్నాననా
నిధి : అలా కాదు.. అవును
శివ : నాన్న పోయాక నానమ్మ వాళ్ళు అమ్మని ఉండమన్నారు కానీ అమ్మ నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చేసింది. ఏడాదికోసారి అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం. నువ్వు ఇక్కడ ఉంటే కదా నీకు అవన్నీ తెలిసేది
నిధి : ఏం చెయ్యను నా మొగుడు ఆపలేదుగా మరి.. అంటే బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఎప్పుడు వెళుతున్నావ్
శివ : రేపేళ్ళొస్తాను. తెల్లారుతుంది పద వెళదాం
నిధిని వదిలి తిరిగి వస్తుంటే గడ్డి వాము కిందకి దిగుతూ కనిపించాడు రామరాజు.
శివ : నువ్వసలు పడుకోవా, దెయ్యం తిరిగినట్టు రాత్రిళ్ళు ఊళ్ళో తిరుగుతావ్, అమ్మమ్మ ఏమనట్లేదా
రామరాజు సిగ్గుపడుతూ నవ్వాడు : దానికి టాబ్లెట్లు వేసుకున్నాక సొయ ఉండదు కదరా
శివ : ఈ టైములో రాజమ్మ గడ్డివాము పైన ఏంటి పనీ ?
రామరాజు : రాజమ్మ మొగుడు ఊరికి పోయాడంట.. గడ్డివాములో పాము దూరిందంటే చూడ్డానికి వచ్చా
శివ : అమ్మమ్మకి తెలియాలి, నీ పంచెలో ఉన్న పాముకి వాతలు పెట్టుద్ది
రామరాజు : పోరా.. ఇంకొన్ని రోజులు అయితే ముసలోడిని అయిపోతాను
శివ : అవును మరి ఈడొచ్చిన పిల్లోడా
రామరాజు : పోరా గాడిద కొడకా అని నవ్వుతూ పోతుంటే రేపు నానమ్మ దెగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాడు.
xxxxxx
ఊళ్ళో బస్సు దిగగానే మావయ్య బండి మీద ఒక కాలు పెట్టి నిలుచుని సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఛాతి మీద రెండు బొత్తాలు లేవు, కింద ఆకు పచ్చ గళ్ళ లుంగీ.
ఈయన పేరు సిద్దయ్య, ఆ పేరు ఎందుకు పెట్టారో కానీ భలే చామత్కారం ఉంటుంది ఈయన దెగ్గర. నా అత్త.. అదే నాన్న చెల్లెలి మొగుడు తను.
సిద్దయ్య : రారా అల్లుడు, ఎన్నాళ్లకి ఎన్నాళ్ళకి దర్శనం. బస్సు ప్రయాణం బాగా జరిగిందా.. మర్యాదల్లో లోపాలు ఏవి లేవుగా ?
శివ : టికెట్ ఏ ఊరికి అని అడిగే కొట్టాడు మావా
ఇద్దరు నవ్వుకున్నారు. లుంగీ ఎగ్గట్టి బండి ఎక్కి స్టార్ట్ చేస్తే వెనక కూర్చున్నాను. ఇంటికి పోనించాడు. గేటు లోపలికి వెళుతుంటే చెంబు పట్టుకుని నిలుచుంది గీత. నాకు మరదలు. దాని కళ్ళలో అసహనం ఉన్నా కానీ నన్ను చూడగానే నవ్వింది.
శివ : నువ్వేం మారలేదు మావయ్యా.. ఇవన్నీ అవసరమా అని గీత వైపు చూపించాను
సిద్దయ్య : ఆమ్మో.. మర్యాద మర్యాద.. నువ్వెళ్ళి అలా కూర్చో నేనెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తా
శివ : అవేమి వద్దు..
సిద్దయ్య : నువ్వు లోపలికి పోరా.. అని అరుస్తూ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
చెప్పినా వినడు, లోపలికి నడుస్తుంటే అత్త "రారా" అంది నవ్వుతూ.
గీతని చూసి నవ్వుతూ "నీకు ఈ పని మాత్రం తప్పలేదే.. దా కడుగు" అని కాళ్ళు చూపిస్తే కాళ్ళ మీద నీళ్లు కొట్టింది. అత్త పక్కన నుంచి కోపంగా చూస్తుంటే గీత నడుము వంచి కాళ్ళ మీద నీళ్లు పోసింది.
శివ : ఎలా ఉన్నావ్ అత్తా
పేరు రజిత.. చాలా మంచిది కాదు, చెప్పాలంటే అన్నీ నక్క ఆలోచనలు. సిద్దయ్య మావయ్య కాబట్టి వేగుతున్నాడు కానీ ఇంకొకళ్ళు అయితే పారిపోయేవాళ్ళే. గీత ఒక్కటే కూతురు. అత్త బుద్దులు అమ్మాయికి రాలేదు అదే సంతోషం.
లోపల బాబాయి సోఫాలో కూర్చుని ఉన్నాడు. న్యూస్ పేపర్ కిందకి దించి అప్పుడే నన్ను చూసినట్టు, అస్సలు నేను వస్తున్నట్టు తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నాడో.. "ఎరా ఎలా ఉన్నావ్, అమ్మ బాగుందా.. అక్కడంతా ఎలా ఉన్నారు ?"
ఈయన పేరు గోవిందు.. మా నాన్న పోయేవరకు ఈయన్ని గాలోడు అని పిలిచేవాళ్ళు అంతా. ఇప్పుడు ఈయనే పెద్ద. పెద్దరికం ఎవ్వరు ఇవ్వలేదు, ఆయనే తీసుకున్నాడు. పలకరించి నా రూములోకి వెళ్ళాను అంటే నాన్న గది. బ్యాగు పెట్టేసి నానమ్మ గదిలోకి వెళితే పడుకుని ఉంది. మళ్ళీ పలకరిద్దామని తిరిగి వచ్చేసాను.
తాతయ్య లేడు, మూడేళ్లు అవుతుంది దేవుడి దెగ్గరికి వెళ్లి, మా నాన్నమ్మ తన కాలక్షేపం తీసుకెళ్లిన దేవుడికి మొక్కడం మానేసి గదిలోనే ఉంటుంది. ఎప్పుడో కానీ బయటకి రాదు. నేనొస్తే వస్తుంది, తీసుకొస్తాను.
గీత లోపలికి వచ్చింది. దాని చేతిలో టవల్. నవ్వొచ్చింది నాకు.
గీత : నీకు బాగుంది కదా, ఇంద పట్టు
శివ : ఇష్టం లేదని చెప్పేయ్యచ్చుగా ఎందుకు ఇవన్నీ
గీత : నువ్వు చెప్పు, అత్తయ్యా నాకు గీత అంటే ఇష్టం లేదు, నాకు చిన్నప్పటి నుంచి నిధి అంటేనే ఇష్టమని నువ్వు చెప్పు
శివ : ఆమ్మో నాకా గొడవలు వద్దు
గీత : సేమ్ ఫీలింగ్
శివ : ఎలా ఉంది తమరి చదువు
గీత : అయిపోయింది, జాబ్ చెయ్యనివ్వరట.. ఇరుక్కుపోయాను ఇక్కడ.. నీతో పెళ్ళైయ్యాక నువ్వు ఒప్పుకుంటే కనీసం అత్తింట్లో అయినా ఉద్యోగం చేసుకుంటా
శివ : సరే అయితే
గీత : మా అమ్మ వస్తుంది బాత్రూంలోకి దూరు లేకపోతే ఇప్పుడే మొదలు పెడుతుంది.
స్నానం చేసి కూర్చుంటే అత్తయ్య గ్లాసులో కూల్ డ్రింక్ పోసిచ్చింది. "మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను" అని వెళ్ళగానే గీత ఎదురు కూర్చుంది.
గీత : ఏదో ఒకటి చెప్పు
శివ : నాకు నా ఆస్తి కావాలి, అది నా చేతిలో పడే వరకు నేనేం మాట్లాడను
గీత : వాళ్లకి కావాల్సింది అదే.. నన్ను నీకిచ్చి చేస్తే ఇంట్లో వాళ్ళే అనుభవిస్తారని వాళ్ళ ప్లాన్. సచ్చిపోతున్నా నేనిక్కడ, నాకంటే ఒక సంవత్సరం చిన్న నువ్వు.. నిన్ను బావా అని పిలవమని ఒకటే నస
శివ : పిలవ్వే ముద్దుగా ఉంటది
గీత : ఎహె పో.. అవును నిధి వచ్చిందంటగా.. ఎలా ఉంది మేడం
శివ : సూపర్
గీత : సర్లే.. వాళ్ళు వస్తున్నారు. వచ్చిన పని చూడు.
xxxxxxx
అన్నం తిని కూర్చున్నాక అందరూ తలా ఓ పక్కన సెటిల్ అయ్యారు.
గోవిందు : ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం, ఆస్తి గురించి మాట్లాడాలన్నావట
శివ : నాకు అవసరం వచ్చింది, వాటాలు పంచితే బాగుంటుంది కదా
గోవిందు : ఇంతక ముందే మాట్లాడుకున్నాం కదా.. గీతని చేసుకునే రోజు బహుమతిగా ఇస్తాము
శివ : మా నాన్న వాటా అది నాది ఎవరు నాకు బహుమతిగా ఇస్తారు ?
రజిత : అన్నయ్యా దీనికి నేను ఒప్పుకోను, అందరూ కలిసి నా కూతురికి అన్యాయం చేద్దామని చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి బావా అనే పదాన్ని ఊపిరిగా బతుకుతుంది నా కూతురు.
శివ వెటకారంగా ఏమే అన్నట్టు గీతని చూస్తే గీత పళ్ళు ఇకిలించి నవ్వుతుంది.
గోవిందు : నువ్వాగు.. ఇప్పుడేమంటావ్ ? అని శివని చూసాడు
శివ : నాకో కష్టం వచ్చింది. అందరూ ఒకమాట మీద నిలబడాలి కదా
గోవిందు : అయినా వాళ్ళు అలా నీ కష్టాన్ని లాగేసుకుంటుంటే మమ్మల్ని పిలవాలనిపించలేదా ?
ఇక్కడ ఇంత మందిమి పెట్టుకుని వాళ్లకి సేవలు చేసావ్. మనోళ్లు ఎవరో బైటోళ్ళు ఎవరో ఇంకా తెలుసుకొకపోతే ఎవ్వరు మాత్రం ఏం చెయ్యగలరు. నేనిస్తా చెయ్యి వ్యాపారం. మనమే సంపాదించుకుందాం.
మూలన కూర్చున్న సిద్దయ్య నవ్వాడు. ఎవ్వరికి వినిపించలేదు.
గోవిందు : మీ అమ్మకి ఎందుకురా మేమంటే అంత కచ్చి, నిన్ను మాకు దూరంగా తీసుకెళ్లిపోయింది. నువ్వు మా రక్తం.. రక్తాన్ని వేరు చెయ్యగలరా
వెంటనే తల ఎత్తాడు సిద్దయ్య
సిద్దయ్య : ఆరోజు పెద్ద బావ పోయినప్పుడు ఒక్కరు కూడా వాడిని దెగ్గరికి తీయలేదు. అప్పుడు ఏమైంది బావా రక్తం
రజిత : ఏయి నువ్వు ఊరుకో.. పట్టించుకోకండి తాగున్నాడు
సిద్దయ్య : చెప్పుతో కొడతాను.. ముయ్యి నోరు.. ఏ బావా ఆరోజు ఎందుకు అనలేదు. ఆరోజు వసుధమ్మ ఆయమ్మి శివ చెయ్యి పట్టుకుని పోతుంటే ఎవ్వరైనా ఆపినారా.. ఎందుకు ఆపలేదు, ఆస్తిలో ఒకరు తగ్గితే వాటా మొత్తం మీరే తినేయ్యొచ్చు అనే కదా
పది సంవత్సరాల తరువాత అదీ శివ లాయరు ద్వారా గుర్తు చేయించాడు.. ఏమనీ.. తాత ఆస్తి మనవడికి దక్కుతుంది దానికి ఎవ్వరి సంతకాలు అవసరం లేదు. పెద్ద బావ వాటా శివకి చెందుతుంది అని కోర్టు ఆర్డర్ ఇచ్చాక నువ్వెళ్ళి వాళ్ళని ఇంటికి పిలుచుకున్నావ్.. ఇవన్నీ మర్చిపోయావా బావా
ఇప్పటికి వాడు అనుకుంటే ఎప్పుడో తీసుకునే వాడు. కానీ మనకి గౌరవం ఇస్తూ మనం మన చేతుల మీదగా ఆస్తులు ఇవ్వాలని వాడి ఆలోచన. ఇప్పుడు కూడా వాడు ఎమన్నాడో విన్నారా.. నాకు కష్టం వచ్చింది, కుటుంబం రాకపోతే ఎలా అన్నాడు తప్పితే నా ఆస్తి నాకు కావలి అని అడగలేదు. ఇప్పటికైనా మీరు మారకపోతే అది మంచిది కాదు.
సిద్దయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోపల రూములో నుంచి "శివా.." అన్న మాట నానమ్మ దెగ్గర నుంచి వినగానే శివ అటు వెళ్ళాడు. రజిత కోపంగా మొగుడి దెగ్గరికి పోయింది.
రజిత : ఏంటి మీకు నోటికొచ్చింది వాగడమేనా ?
సిద్దయ్య : ఏయి.. నేను మీలా కాదే.. నాకంటూ మానం అభిమానం రెండూ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వచ్చి వెళుతున్నాడు. వాడు వచ్చేది ఆస్తి కోసమని మీకు తెలుసు, వాడెప్పుడు అడగలేదు. ఈ సారి అడిగాడు అంటే వాడికి అవసరం అనే కదా..
రజిత : మన కూతురు
సిద్దయ్య : నేను విన్నాను. వాడి కష్టం అంతా వాళ్ళ మేనమామలు లాగేసుకుంటే వీడు ఒక్కమాట కూడా మాట్లాడలేదట. అయినా చూడు ఎలా ఉన్నాడో.. వాడి కళ్ళలో నేనే కాదు నాతో ఉన్నవాళ్ళని కూడా సాక్కునే దమ్ము నాకుంది అని నీకు కనిపించట్లేదు.
ఆస్తి కోసం మాట్లాడడానికి ఎవరైనా సరే ఈ రోజుల్లో తోడపుట్టిన వాడు కూడా పది మందితో కలిసి వస్తున్నాడు. వాడు ఒక్కడే వచ్చాడు. వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని మోండోడిని చెయ్యకండి. వాడి ధైర్యం మిమ్మల్ని కూల్చేస్తుంది
వాడు నా అల్లుడు, నా బిడ్డని వాడికి ఇస్తాను. నాకున్నది ఒకే కూతురు. వీళ్ళు రేపు నన్ను చూస్తారో లేదో నాకు తెలీదు కానీ నా బిడ్డ దెగ్గరికి పోతే నాకో ముద్ద కూడు పెడుతుంది. అది వాడి మంచితనం. నువ్వు కూడా ఆలోచించడం మొదలు పెడితే మంచిది.
రజిత ఇంకేం మాట్లాడలేకపోయింది.
xxxxxxx
శివ : నానమ్మ..
నానమ్మ : ఎలా ఉన్నావు.. అమ్మ ఎలా ఉంది ?
శివ : బాగున్నారు నానమ్మా
నానమ్మ : నేను పోతే రాయ్యా
శివ : ఊరుకో నానమ్మా.. పదా అలా బైటికి వెళదాం
నానమ్మ : వద్దు
శివ : వస్తావా.. ఎత్తుకోనా
నానమ్మని ఎత్తుకుని బైట మంచం మీద కూర్చోపెడితే గీత కూడా వచ్చింది. బాబాయి పిల్లలు కూడా వచ్చారు. నానమ్మ గీత చెయ్యి నా చేతిలో పెట్టింది. గీత సిగ్గు పడింది.
శివ : చంపుతా నటించావంటే
గీత : ఏం చెయ్యను మరీ.. ఏడవాలా.. నన్నెలా వదిలించుకుంటావో నీ ఇష్టం.. బావా.. పాలకోవా అని లేచి వెళ్ళిపోయింది.
నానమ్మతో ముచ్చట్లు పెడుతూ ఆ రాత్రి గడిపేశాడు. తెల్లారి ఫస్ట్ బస్సుకి సిద్దయ్య ఎక్కిస్తే సీటులో కూర్చుని టాటా చెప్పాడు.
సిద్దయ్య : నీతో చాలా మాట్లాడాలిరా అల్లుడు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడదాం
శివ : ఉంటా మావా
సిద్దయ్య : అక్కడే ఉండకు అల్లుడు అప్పుడప్పుడు రా అంటే శివ నవ్వాడు, సిద్దయ్య కూడా నవ్వాడు.
నచ్చితే Rate చెయ్యండి
|
|