Posts: 3,321
Threads: 37
Likes Received: 45,375 in 2,260 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
9,959
(17-12-2022, 03:12 PM)Kushulu2018 Wrote: చంపకుండ కథ ముగించరు కదా
ఇది sad story అని ముందే చెప్పాను నేను
నా తప్పు లేదు
Posts: 177
Threads: 0
Likes Received: 332 in 154 posts
Likes Given: 1,973
Joined: Feb 2022
Reputation:
13
(17-12-2022, 03:19 PM)Takulsajal Wrote: ఇది sad story అని ముందే చెప్పాను నేను
నా తప్పు లేదు
మీలో మంచి humor ఉందండి
ఒక ప్యూర్ కామెడీ స్టోరీ రాయచ్చు కదా
కొంచెం సెక్సీగా
Posts: 51
Threads: 0
Likes Received: 42 in 28 posts
Likes Given: 113
Joined: Oct 2019
Reputation:
1
(17-12-2022, 09:35 AM)Takulsajal Wrote: ఇవతల మండపంలో హారిక తన ఇద్దరు ఆడపిల్లలతో మాట్లాడుతుండగా కవిత కూడా ఐస్ క్రీం తింటూ వెళ్లి కుర్చీల్లో కూర్చుంది.
కవిత : హమ్మయ్యా.. అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి
హారిక : మా ఆయన మీ ఆయన ఇద్దరు కనిపించట్లేదేంటి
కవిత : వాళ్ళేక్కడికి పోతారు మందుకెళ్ళుంటారు
హారిక : గమనించనే లేదు అందరూ వెళ్లిపోయారు మనమే ఉన్నది.. పేమెంట్లు అన్నీ అయిపోయాయా
కవిత : ఎప్పుడో.. పదండి ఇంటికి వెళదాం, చిన్నా లావణ్య ఇద్దరు ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయారు
హారిక : వాడికి కొన్ని రోజులు పడుతుందిలే వాడు ఉన్నట్టుండి పెళ్ళికి ఒప్పుకోవడమే నాకు ఇంకా నమ్మబుద్ది కావట్లేదు
కవిత : కూతురు కోసం ఒప్పుకోనుంటాడు
హారిక : ఉండు ఐస్ క్రీం తిని వెళదాం అని లేచింది.
ఉన్నట్టుండగా ఒకేసారి ఆరు వైపుల నున్న తలుపులు కిటికీలు అన్ని పెళ్ళున మూసుకుపోయాయి.. కిటికీ అద్దాలన్ని పగిలిపోయాయి ఇటు హారికకి అటు కవితకి జల్లు మంది. ఇద్దరు లేచి నిలబడ్డారు.. హారిక వెళ్లి తలుపులు తీయబోతే రాలేదు.
అవి రావు అన్న బేస్ వాయిస్ ఒకటి వినిపించింది కానీ ఎవ్వరు లేరు, కవిత కూడా హడలిపోయింది ఎందుకంటే ఆ గొంతు కవిత గుర్తుపట్టేసింది. ఏమి అర్ధం కాకపోయినా వెంటనే పిల్లల ఇద్దరి చేతులు పట్టుకుంది.
హారిక : ఎవరు..
నేనే అప్పుడే మర్చిపోయావా.. (అదే బేస్ వాయిస్)
హారిక చుట్టూ చూసింది కానీ ఎవ్వరు కనిపించలేదు.. భయపడి ఎవరు.. ఎవరు అని గట్టిగా అరిచింది
కవిత : అక్షితా...
పరవాలేదే ఇంకా ఒకరికి గుర్తున్నాను అని నవ్వింది గట్టిగా.. ఇంతవరకు ఎవ్వరికి మాటలు తప్ప ఏమి కనిపించలేదు. పెద్దవాళ్లు ఇద్దరు భయపడుతుంటే పిల్లలకి కూడా భయమేసింది. స్టేజి మీద నల్లని పొగలలో ముందు ఎర్రని కళ్ళతో అక్షిత ఒక కాలు మడుచుకుని ఇంకో కాలు చాపుకుని కూర్చుని ఉంది. పిల్లలిద్దరు అది చూసి ఏడుపు లంకించుకున్నారు. అక్షిత చెయ్యి లేపగానే పిల్లలు ఇద్దరు గాల్లోకి లేచారు. అక్కడే గాల్లో ఆపేసింది.. పిల్లలిద్దరు కేకలు.
ఇదంతా చూస్తున్న హారికకి వెన్నులో పుట్టింది వణుకు, వెంటనే తేరుకొని తన పిల్లలని చూసి అక్షిత కాళ్ళ మీద పడిపోయింది ఏడుస్తూ.. కవిత కూడా భయంతో చెమటలు పట్టాయి కానీ దెగ్గరికి వెళ్లే ప్రయత్నం చెయ్యలేదు. అది చూసి అక్షిత చెయ్యి ఊపగానే రెండు బాడీలు రక్తపు ముద్దలతో కవిత ఎదురుగా పడ్డాయి. కవిత మొగుడిని అల్లుడిని చూసి కేకలు కేకలుగా ఏడుస్తూ వాళ్ళ మీద పడిపోయింది అది చూసి అక్షిత గట్టి గట్టిగా నవ్వుతూ పిచ్చిది అయిపోయింది.
హారిక అటు పిల్లలని ఇటు తన మొగుడు తండ్రిని అందరినీ చూసి ఏం చెయ్యాలో తెలీక ఏడుస్తుంటే అక్షిత వెంటనే నవ్వడం ఆపి హారిక గొంతు పట్టుకుని గాల్లోకి లేపింది అది చూసిన కవిత పరిగెత్తుకుంటూ వెళ్లి అక్షిత కాళ్ళ మీద పడిపోయింది తప్పైపోయింది కనికరించమంటూ.
అక్షిత : ఏంటి మీవేనా ప్రాణాలు నావి కావా
కవిత : అక్షిత.. అక్షిత..
అక్షిత : చెప్పు ఏం చెపుతావో నేను కూడా వింటాను
.............................................................
కార్ వేగంగా నడుపుతున్న చిన్నాకి ఫోన్ రాగానే ఎత్తాడు
చిన్నా : హలో
సర్ నేను CI ని మాట్లాడుతున్నాను, మీ ఫాదర్ కారుకి ఆక్సిడెంట్ అయ్యింది కానీ ఇక్కడ వాళ్ళు ఇద్దరు లేరు, కారు చిత్తు చిత్తు అయ్యింది బతికే అవకాశమే లేదు కానీ వాళ్ళ బాడీలు కూడా దొరకలేదు.
చిన్నా : నేను వస్తున్నాను అని ఏడుస్తూ ఫోన్ పెట్టేసి ఇంకా వేగంగా మండపం వైపు తొక్కాడు కారుని.
చిన్నా వెళ్లడం తలుపులు అన్ని మూసి ఉండడంతో కిటికీలో నుంచి లోపలికి దూకాడు. అక్షిత తప్ప అందరూ అటు వైపు చూసారు. కవిత పరిగెత్తింది.. చిన్నా చిన్నా వదిలేయ్యమని చెప్పు.. చూడు నాన్నని బావని చంపేసింది.. పిల్లలు అని ఏడవటం మొదలు పెట్టింది. పిల్లలు కూడా మావయ్యా మావయ్యా అని ఏడవటం మొదలు పెట్టారు.
అక్షిత చిన్నా వైపు చూసింది, చిన్నా ఏం మాట్లాడలేదు ఒకసారి తన నాన్న బావ వైపు చూసి మళ్ళీ అక్షితని అలా చూస్తూ ఉండిపోయాడు. చిన్నగా నడుచుకుంటూ అక్షిత ముందుకు వెళ్లి నిల్చున్నాడు.
అక్షిత : ఏంటి అలా చూస్తున్నావ్.. వదిలేయ్యాలా వీళ్ళని.. చెప్పు.. చెప్పు చెప్పు చెప్పు అని ఏడుస్తూ అరిచింది గట్టిగా
చిన్నా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి రెండు చేతులతో కళ్ళు మూసుకుని ఏడుస్తూ అక్కు... నన్ను కూడా నీతో పాటు తీసుకుపో.. నన్ను కూడా తీసుకుపో అని ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసాడు అది చూసి అక్షిత హారిక గొంతు వదిలేసి మాములుగా మారిపోయింది, హారిక పిల్లలు చిన్నగా కిందకి దిగిపోయారు.. పసి పిల్లలు ఇప్పటి వరకు భయపడినా అక్షితని మామూలుగా చూడగానే అంతా మర్చిపోయి అత్తయ్యా అని తన దెగ్గరికి పరిగెత్తారు.. అక్షితని వాటేసుకోబోతే దూరారు తప్ప పట్టుకోలేకపోయారు పిల్లల ప్రేమ చూసి ఒక చూపు హారిక వైపు విసిరింది అందులో చూసావా నీ పిల్లలకి ఎంత ప్రేమ పంచానో అన్న గర్వం ఉంది.. హారిక తల దించుకుంది.. చిన్నాని దాటుకుని కవిత వైపు వెళ్ళింది.
అక్షిత : అత్తయ్యా.. నాకు నువ్వంటే ఇష్టం లేదనొ లేక నన్ను బెదిరించి ఉంటెనో లేక ఇది మా పరిస్థితి మాకు డబ్బులు కావాలంటేనొ నేను నా బుజ్జి దాన్ని తీసుకుని మీ అందరికి దూరంగా వెళ్లిపోయే దాన్ని కదా.. ఎందుకు నన్ను చంపేశారు.. నీ కూతురుని రెండు నిముషాలు గొంతు పట్టుకుంటే విల విల లాడిపోయావు, ఏ.. నాది ప్రాణం కాదా.. ఎందుకు డబ్బు లేనోళ్లంటే అంత చులకన.. కనీసం నా బిడ్డని ముట్టుకోలేని పరిస్థితి నాది.. పాపం చిన్నూ నాకోసం ఎంత ఏడ్చింది ఎంత వెతుక్కుంది, నిద్రలో కూడా నన్నే కలవరిస్తుంది.. నాకు నా బిడ్డ కావలి.. నా బిడ్డకి నన్ను ఇవ్వగలవా.. అని ఏడ్చేసింది.. వదినా నువ్వు కూడానా.. నీకు నీ పిల్లలకి నీ తమ్ముడు బంగారం చేపించాడు ఆస్తులు ఇచ్చాడు ఒక్కసారి కూడా నేను మీ విషయాల్లో జోక్యం చేసుకోలేదు.. ఒక్క మాట కూడా నేను వాడిని అడగలేదు.. నేను మిమ్మల్ని నా కుటుంబం అనుకున్నాను.. నాకు ఒక కుటుంబం ఉంది.. నాకు ఏదైనా అయితే నన్ను చూసుకోడానికి ఇంత మంది ఉన్నారనుకున్నాను కానీ ఇలా నమ్మించి చంపేస్తారనుకోలేదు.. హారిక భయపడి చూస్తుంటే.. భయపడకు నేను నిన్ను ఏమి చెయ్యను.. నా బిడ్డ నేను లేక ఎంత తపించిపోతుందో చూస్తూనే నిన్ను నీ పిల్లలకి దూరం చెయ్యలేను.. నన్ను చంపినా నా బిడ్డని ముట్టుకోడానికి ఒప్పుకోలేదు మీరు అందుకు థాంక్స్ అత్తయ్యా.. అని కింద కూర్చుని భారంగా కోపంతో రోదిస్తుంటే మండపం మొత్తం అదిరింది.
ఇంతలో చిన్నూ గొంతు వినిపించేసరికి అక్షిత ఏడవటం ఆపి మాములుగా అయిపోయి అన్ని తలుపులు తెరిచింది. చిన్నూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అక్షిత ముందు ఆగిపోయింది.. సారీ మమ్మి.. ముట్టుకోవద్దని చెప్పావు కదా మర్చిపోయాను.. లావణ్య అమ్మ కూడా వచ్చింది.. అదిగో అని చూపించింది.. లావణ్య కళ్ళ నిండా నీళ్లతో లోపలికి వచ్చి అక్షిత ముందు నిలుచుంది.. అక్షిత ముందుకు జరిగి లావణ్య కాళ్ళ దెగ్గర తన చేతులు పెట్టింది.
అక్షిత : థాంక్స్.. నా బిడ్డ కోసం నీ భవిష్యత్తుని అడిగాను.. వెంటనే ఒప్పుకున్నావు.. ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేనిది.. అని చేతులెత్తి మొక్కింది.. లావణ్య బాధగా తన తల అక్షిత మీద పెట్టింది ఆ గాలిని తాకుతూ.. అక్షిత పాప వైపు చూసింది.. చిన్నూ..
చిన్ను : అమ్మా.. పద ఇంటికి వెళదాం నిన్ను నేను కట్టేయ్యాలి..
అక్షిత : (నవ్వుతూ కళ్ళు తుడుచుకుని) ఇలారా.. అదిగో అమ్మ అక్కడుంది.. ఇక నుంచి తనే నీకు అమ్మ
చిన్నూ : మరి నువ్వు ?
అక్షిత : నేను వెళుతున్నా.. చాలా పనులున్నాయి నాకు.. నువ్వు ఎలా ఉన్నావా.. నా మీద బెంగ పెట్టుకున్నావా.. అని నిన్ను చూసి పోదాం అని వచ్చాను.
చిన్నూ : నన్ను వదిలి వెళ్ళకు మా.. ప్లీజ్.. డాడీ అయితే నీకోసం రోజూ ఏడుస్తాడు.. రాత్రంతా నేను పడుకున్నానని అనుకుని నీ ఫోటో ముందు కూర్చుని ఏడుస్తూ ఎప్పుడో పడుకుంటాడు.. మమ్మల్ని వదిలి వెళ్లకమ్మా
అక్షిత : ఇవన్నీ నీకెలా తెలుసు.. దొంగ పడుకునట్టు నటించి నాన్నని మోసం చేస్తున్నావా అనగానే చిన్నూ.. హి హి హి.. అని నవ్వింది.. నేను వెళుతున్నాను నువ్వు అమ్మ దెగ్గరికి వెళ్ళు
చిన్నూ : మళ్ళీ ఎప్పుడు వస్తావు
అక్షిత : నువ్వు ఎప్పుడంటే అప్పుడే.. కళ్ళు మూసుకుని తలుచుకో నీ మైండ్ లోకి వచ్చేస్తాను.. అప్పుడు నువ్వు నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్నిటికి సమాధానం చెపుతాను సరేనా.. లావణ్య అమ్మని విసిగించకు.. సరేనా
చిన్నూ : ఒక్కసారి నిన్ను ముట్టుకోనా అమ్మా
అక్షిత : వద్దు తల్లి.. నాకు ఒంట్లో బాలేదు.. ఇక వెళ్ళు నేను కూడా వెళ్ళాలి..
చిన్నూ : నాకు ఏడుపొస్తుంది మా
అక్షిత : ఎందుకు తల్లీ.. చూడు నువ్వు ఏడుస్తే లావణ్య అమ్మ కూడా ఏడుస్తుంది.. వెళ్లి ఓదార్చు పో అని నవ్వుతూ పంపించేసింది.. పసిది పాపం ఏం అర్ధం కాకపోయినా అమ్మ మాట ఎప్పుడు కాదనదు కాబట్టి ఏం అర్ధం కాకపోయినా నవ్వుతూ లావణ్యని ఓదార్చడానికి వెళ్ళిపోయింది.
చిన్నూ లావణ్య దెగ్గరికి వెళ్లి అమ్మా ఏడవకు నేనేం ఏడవట్లేదు చూడు అని నవ్వించే ప్రయత్నం చేస్తుంటే లావణ్య ఏడుస్తూ అక్షితని చూసింది. చిన్నూ కూడా వెనక్కి చూడడంతో అక్షిత టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతుంటే.. త్వరగా రావాలి లేదంటే అని వేలు చూపించి చిన్నూ వార్నింగ్ ఇస్తుంటే అక్షిత వెళ్ళమని లావణ్యకి సైగ చేసింది. లావణ్య బైటికి వెళ్ళిపోయి చిన్నూని ఎత్తుకుని కారులో కూర్చుంది.
అక్షిత : (కోపంగా) ఏ డబ్బు కోసం అయితే ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసారో ఆ డబ్బు మీకు ఎప్పటికి దక్కదు.. మీకు ఏ శిక్షా పడకపోవచ్చు కానీ జీవితాంతం మీరు మానసిక క్షోభ అనుభవించాల్సిందే అని నెమ్మదించింది.. హారిక ఏడుపులని కవిత ఏడుపుని అస్సలు పట్టించుకోలేదు.
చిన్నా : అందరితో మాట్లాడావు.. అందరికి కనిపించావు నన్ను ఒక్కణ్ణి మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.. నేను నీకు అంత అన్యాయం చేసానా
అక్షిత : నన్ను ప్రేమించడమే నువ్వు చేసిన పెద్ద తప్పు.. నీ స్థాయి దాటేసి నా లాంటి దాని కోసం అన్ని వదిలేసి మరి వచ్చావ్ అయినా కూడా నేను చచ్చాను.. నా చిట్టి తల్లి.. నా చిన్నూ.. అని ఏడుపు ఆపుకుని చిన్నాతో ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి మాయం అయిపోయింది.
కవిత, హారిక ఇద్దరు చిన్నాని చూసి ఏడుస్తుంటే పట్టించుకోకుండా బైటికి వెళ్ళిపోయాడు, చిన్నూ కారులో నుంచే తన నాన్నని చూసి నాన్న ఐస్ క్రీం అని అరిచింది.. కళ్ళు తుడుచుకుని రమ్మన్నాడు చిన్నూ వెంటనే కారు దిగి తండ్రి దెగ్గరికి పరిగెత్తింది. ఎత్తుకుని తీసుకెళ్లి ఐస్ క్రీం కొనిచ్చి కార్ దెగ్గరికి తీసుకెళతూ చిన్నూ అన్నాడు
చిన్నూ : ఆ..
చిన్నా : నేను కూడా మమ్మీతో వెళ్ళనా
చిన్నూ : నన్ను కూడా తీసుకెళ్ళు నేను కూడా వస్తాను
చిన్నా : నువ్వు కూడా వచ్చేస్తే మరి లావణ్య అమ్మకి తోడుగా ఎవరుంటారు.. అక్కడ అమ్మకి పనులున్నాయి కదా ఒక్కటే పని చెయ్యాలి కదా పాపం, అదే నేనుంటే సాయంగా ఉంటాను కదా
చిన్నూ : ఏం వద్దు.. నువ్వుంటేనే ఇంకా లేట్ అవుతుంది.. ఎప్పుడు అమ్మని విసిగిస్తావ్
చిన్నా : అబ్బా ప్లీజ్ ప్లీజ్
చిన్నూ : పని అయిపోగానే అమ్మని తీసుకుని వచ్చేస్తావా
చిన్నా : అమ్మ వస్తానంటే వచ్చేస్తా లేకపోతే తనతోనే ఉంటా.. నీకు తోడుగా లావణ్య అమ్మ ఉంది కదా ఇంకేం భయం
చిన్నూ : అబ్బా..
చిన్నా : వీళ్లంటే నీకు పడదు కానీ లావణ్యని పుట్టినప్పటి నుంచి చూస్తున్నావ్ చిన్నప్పటి నుంచి ఆడుతున్నావ్ ఇంకేం భయం.. అమ్మా అని కుడా పిలుస్తున్నావ్
చిన్నూ : అవుననుకో కానీ ఎంతైనా నువ్వో ఆమ్మో.. ఇద్దరు లేకపోతే నాకు బాధగా ఉంటుంది కదా
చిన్నా : నీకేం చెప్పాను.. మన ఇన్స్పిరేషన్ ఎవరు
చిన్నూ : లలిత అమ్మమ్మ
చిన్నా : కదా.. మరి అమ్మమ్మ లాగా స్ట్రాంగ్ గా ఉండాలి.. ఉంటావా.. నాకు నీ మీద డౌటే
చిన్నూ : ఏం కాదు.. నేను అమ్మమ్మ కంటే స్ట్రాంగ్
చిన్నా : మరి లావణ్య అమ్మతో ఉంటావా
చిన్నూ : ఉంటాను
చిన్నా : ఎప్పుడు ఏడవనని.. లావణ్య అమ్మని బాగా చూసుకుంటానని నాకు ప్రామిస్ చెయ్యి
చిన్నూ : సరే ప్రామిస్.. ఇంకొక ఐస్ క్రీం హి హి..
చిన్నా : (ముద్దు పెడుతూ) అలాగే పదా.. అని ఇంకొకటి కొనిచ్చి కార్ దెగ్గరికి వెళుతుండగా చిన్నూని దించాను.
చిన్నూ : బై నాన్నా అని గట్టిగా వాటేసుకుంది.. నవ్వుతూ
చిన్నా : చిన్నూ నాతరపున లావణ్య అమ్మకి ఒక గిఫ్ట్ ఇస్తావా
చిన్నూ : ఏంటి నాన్నా
చిన్నూని గట్టిగా వాటేసుకుని రెండు బుగ్గల మీద ముద్దు పెట్టి వెంటనే నుదిటి మీద కూడా ముద్దు పెట్టి ఆ వెంటనే చిన్నూ పెదాల మీద కూడా ముద్దు పెట్టాడు..
చిన్నా : ఇదే ఇవ్వు..
చిన్నూ : ఆమ్మో.. నీ సంగతి.. నాకు అమ్మ కనిపించని.. ఎందుకు.. కళ్ళు మూసుకుంటే వస్తుందిగా అని కళ్ళు మూసుకుని మమ్మీ నాన్న చూడవే.. నువ్వు వెళ్ళగానే అల్లరి చేస్తున్నాడు.. నీ దెగ్గరికి పంపిస్తున్నా నువ్వే కంట్రోల్లో పెట్టాలి మరి అని కళ్ళు తెరిచి చిన్నాని చూసి హిహి.. అని నవ్వుతూ కార్ దెగ్గరికి పరిగెత్తింది నవ్వుతూ.. చివరిగా కార్ ఎక్కుతూ నవ్వి టాటా చెప్పేసి కార్ ఎక్కి కూర్చుని ఐస్ క్రీం తింటుంది.
లావణ్య : చిన్నూ.. నాన్న ఎక్కడా
చిన్నూ : నాన్న రాడు నువ్వు పోనీ
లావణ్య : అలాగా సరే.. అని నవ్వుతూ చిన్నూని ముద్దు పెట్టుకుని గేర్ ముందుకు మార్చింది.
కొంత దూరం వెళ్ళాక చిన్నూకి నాన్న చెప్పింది గుర్తొచ్చి వెంటనే లావణ్యని పిలిచింది.
చిన్నూ : అమ్మా కార్ ఆపు, ఈ ఐస్ క్రీంలో పడి నేనొకటి మర్చిపోయాను
లావణ్య పక్కకి ఆపి ఏంటో అది అని అడిగింది బాధని కనపడనివ్వకుండా చిన్నూని నవ్వించే ప్రయత్నం చెయ్యాలని.
చిన్నూ : ఇలా దెగ్గరికి రా.. నాన్న నీకు ఒకటి ఇవ్వమన్నారు
లావణ్య చిన్నూ దెగ్గరికి వచ్చి.. ఏం ఇవ్వమన్నారు అని అడిగింది. చిన్నూ వెంటనే లావణ్య మొహం తన రెండు బుజ్జి చేతులతో పట్టుకుని ఆ బుగ్గ మీద ఈ బుగ్గ ముద్దు పెడుతుంటే లావణ్య సిగ్గు పడింది.. అక్కడితో చిన్నూ ఆగలేదు తండ్రి ఎలా పెట్టాడో అంతే ప్రేమగా లావణ్య నుదిటి మీద ముద్దు పెట్టి కిందకి వచ్చి లావణ్య పెదాల మీద కూడా ముద్దు పెట్టి తనని చూసి నవ్వింది.. దానికి లావణ్య కూడా నవ్వింది.. చిన్నూ సరిగ్గా కూర్చునేసరికి లావణ్య కూడా కార్ ముందుకు పోనించింది.
లావణ్య : ఇంతకీ మీ డాడీ ఎక్కడికి వెళ్లారు, నీకు చెప్పలేదా
చిన్నూ : అమ్మ దెగ్గరికి (తాపీగా ఐస్ క్రీం నాకుతూ చెప్పింది)
లావణ్య ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి మళ్ళీ కార్ సైడ్ తీసి ఆపింది.
లావణ్య : ఏంటి చిన్నూ
చిన్నూ : అవును అమ్మ దెగ్గరికి వెళతా అన్నాడు, వస్తే ఇద్దరు కలిసే వస్తారట లేకపోతే రారట
లావణ్య వెంటనే భయం భయంగా ఫోన్ తీసి చిన్నాకి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా భయం పట్టుకుంది.
లావణ్య : చిన్నూ డాడీని ఎలా పంపించావ్ అలా అని అడుగుతూనే కార్ రివర్స్ చేసి తిరిగి మండపం వైపు వెళ్ళింది.
చిన్నూ : నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కానీ అమ్మకి తోడుగా అక్కడ ఎవ్వరు లేరట, అమ్మతో వెళ్తా అని ఏడుస్తూ అడిగాడు అందుకే ఒప్పుకున్నా.. నేను వాళ్ళ కోసం ఏడవనని ప్రామిస్ చేసాలె.. అని ఐస్ క్రీం అవ్వగొట్టే పనిలో పడింది.
లావణ్య వేగంగా వెళ్లి కార్ దిగి మండపంలోకి వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయి పడి ఉన్న హారికని కవితని అడిగింది వాళ్ళు బిక్క మొహం వేశారు.. వెంటనే బైటికి పరిగెత్తుకుంటూ వచ్చింది రోడ్డు మీద చిన్నా పర్సు ఇంకొంచెం దూరంలో తన ఫోన్ విసిరేసి ఉంది.
ఇంతలో లావణ్య అమ్మ ఫోన్ చేసింది
లావణ్య : నేనే వస్తున్నాను అని కొంత ఏడుస్తూనే చెప్పి ఫోన్ పెట్టేసి ఆ రోడ్డు మొత్తం వెతికి నేరుగా తన ఇంటికి వెళ్ళింది. అప్పుడే ఫోన్ కి ఒక టైం మెసేజ్ వచ్చింది. చిన్నా నుంచి..
చిన్నా : లావణ్య.. అక్షిత లేకుండా ఇన్ని రోజులు నరకం అనుభవించాను.. ఎందుకు బతికున్నానంటే అది కేవలం చిన్నూ కోసమే.. తనకి ఇప్పుడు అక్షిత కంటే మంచి అమ్మ దొరికింది.. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నేను నీకు ఇస్తున్న నా విలువైన ఆస్తి.. నా ప్రాణం.. చిన్నూ వీలైతే నన్ను క్షమించు.. ఒకసారి నా రూంలో ఉన్న అక్షిత ఫోటోని చూడు.
లావణ్యకి ఏడుపు ఆగలేదు కానీ ఇంతలోపే చిన్నూ లోపలికి రావడంతో కళ్ళు తుడుచుకుని మాట్లాడింది.
లావణ్య : చిన్నూ కొంతసేపు పడుకుందామా.. చాలా అలిసిపోయి ఉంటావు అని దెగ్గరికి తీసుకుని తన మీద పడుకో బెట్టుకుని జో కొట్టి చిన్నూని నిద్రబుచ్చింది.. లావణ్య కంట్లో నుంచి కన్నీరు కారుతూనే ఉన్నాయి. ఒకసారి తన మెడలో ఉన్న తాళి బొట్టుని పట్టుకుని గట్టిగా పిసికింది.
వారం గడిచింది.. లావణ్య జరిగినవన్ని అంగీకరించి తేరుకొని ఒక నిర్ణయానికి వచ్చింది కారణం లేకపోలేదు.. లావణ్య అమ్మా నాన్న ఒక సలహా ఇచ్చారు.. చిన్నా బతికున్నాడో లేదో తెలీదు తన బాడీ కూడా దొరకలేదు.. చిన్నూని పిల్లల ఆశ్రమంలో జాయిన్ చేసి ఇంకో పెళ్లి చేసుకొమ్మని సలహా ఇచ్చారు.
ఆ మాటలు మళ్ళీ నిద్రలో వినపడగానే లావణ్య ఉలిక్కి పడి లేచింది, పక్కనే ఉన్న చిన్నూని గట్టిగా వాటేసుకుని పడుకుని, ముద్దు పెట్టుకుని లేచి ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళింది.. చిన్నూ ప్రతీ మాట ప్రతీ పనిలోనూ వెళ్లే ప్రతీ దారిలోనూ తన అమ్మా నాన్నని తలుచుకుంటుంది. ఇక ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని స్నానం చేస్తుంటే తలుపు తెరుచుకున్న శబ్దం విని అటు వైపు చూసింది.. చిన్నూ కళ్ళు నలుపుకుంటూ సిగ్గుగా లోపలికి బుజ్జి బుజ్జి అడుగులు వేస్తుంటే లావణ్య నగ్నంగానే వెళ్లి నవ్వుతూ చిన్నూని ఎత్తుకుని గీజర్ ఆన్ చేసి చిన్నూని కూడా ఆడిస్తూ కవ్విస్తూ స్నానం చేపించింది.
లావణ్య తన బట్టలు పిల్ల బట్టలు సర్దుతుంటే చిన్నూ హెల్ప్ చేసింది ఇదంతా గమనించిన తన తల్లి దండ్రులు అడిగారు.
లావణ్య అమ్మ : ఎక్కడికి ప్రయాణం
లావణ్య : నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను
లావణ్య అమ్మ : ఎక్కడికి
లావణ్య : ఆస్ట్రేలియా
లావణ్య నాన్న : మళ్ళీ ఎప్పుడు వచ్చేది
లావణ్య : ఇక రాను (సూటకేస్ జిప్ పెడుతూ చెప్పేసింది)
లావణ్య అమ్మ : ఏం మాట్లాడుతున్నావో.. ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా
లావణ్య : అన్ని సరిగ్గానే చేస్తున్నాను.. చిన్నూ భవిష్యత్తు కోసం వెళ్ళిపోతున్నాను.. మళ్ళీ వస్తానో రానో కూడా నాకు తెలీదు.. కంపెనీ ఎలానొ నాన్న పేరు మీదె ఉంది.. అమ్మేసి రిటైర్ అవ్వమను.. నా దెగ్గర కొంత డబ్బుంది అది నాకు నా బిడ్డకి సరిపోతుంది.
లావణ్య అమ్మ : అది నీ బిడ్డ కాదు
లావణ్య : అవును బిడ్డ కాదు.. నా ప్రాణం.. నేను వెళుతున్నాను.. ఎయిర్పోర్ట్ వరకు వస్తున్నారా
లావణ్య తండ్రి : సరే నువ్వనుకున్నట్టే చేద్దువు కానీ ఇంత తొందరగా ఎందుకు ఇంకొన్ని రోజులు ఆగి వెళ్ళు
లావణ్య : ఫ్లైట్ టైం అవుతుంది.. వెళ్ళాలి అని వాచ్ చూసుకుంటూ తల ఎత్తింది.
లావణ్య తమ మాట వినదని అర్ధమయ్యి తన తల్లి తండ్రులు ఇక తనకి నచ్చజెప్పలేక కార్ ఎక్కి కూర్చున్నారు.. ముందు చిన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళింది.. అంతా హాల్లోనే పిల్లలతో పాటు కూర్చుని ఉన్నారు.. ఇంకా ఎవరో ఉండేసరికి లావణ్య వాళ్ళతో మాట్లాడగా అప్పులోళ్ళు అని అర్ధమయ్యింది.. లావణ్య పట్టించుకోకుండా లోపలికి వెళ్లి చిన్నా రూం తెరిచి అక్షిత ఫోటో ఉన్న చిన్న రూం తెరిచింది అక్కడ ఒక ఫైల్ అందులో కొన్ని డాకుమెంట్స్ ఫిక్సడ్ డిపాజిట్స్ ఇంకొన్ని చెక్స్ సైన్ చేసినవి ఉన్నాయి.. వాటితో పాటు చిన్న లెటర్.. ఒక బాక్స్.. కొన్ని పేపర్స్ తన అమ్మ వాళ్ళకి కొన్ని చిన్నూకి.. వాటితో పాటు చిన్నా అక్షితల ఫోటో ఆల్బమ్ ని అన్నీ తీసుకుని బైటికి వచ్చి. అప్పులోళ్లతో మాట్లాడి చెక్స్ మీద అమౌంట్ రాసి వాళ్ళకి ఇచ్చి పంపించేసింది.. మిగతా కొన్ని డాకుమెంట్స్ చిన్నా అమ్మ వాళ్ళకి ఇచ్చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బైటికి వచ్చేసింది. లావణ్య బైటికి వెళ్లిపోతుంటే గొంతు తెచ్చుకుని మాట్లాడింది
కవిత : చిన్నూ ఎక్కడా
లావణ్య : బైట ఉంది.. మీరు తనని చూడటం నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నుంచి దూరంగా వెళ్లిపోతున్నాం అని చెప్పేసి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బైటికి వచ్చేసి కార్ ఎక్కి కూర్చుంది. కారు నేరుగా ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళింది.
చివరిగా లావణ్య లోపలికి వెళుతుంటే అడిగింది..
లావణ్య అమ్మ : ఒకే ఒక్క ప్రశ్న.. నువ్వు చిరంజీవిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావ్
లావణ్య : నా పద్దెనిమిదవ ఏట మొదటి సారి పార్టీకి కలకత్తా వెళ్ళినప్పటి నుంచి.. అని చెపుతూ చిన్నా ఇచ్చిన బాక్స్ లో ఉన్న చైన్ చిన్నూ మెడలో వేసి కుర్చీ మీద నిల్చోబెట్టి అందులో ఉన్న పట్టీలు కాలికి పెట్టింది చిన్నూని చూసి నవ్వుతూ.. ఫ్లైట్ ఎక్కడానికి చిన్నూని ఎత్తుకుని ఒకసారి తన అమ్మా నాన్నల వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది.
చిన్నా చనిపోయిన మరుక్షణం..
అక్షిత జలపాతం పక్కన కొండ గట్టున కూర్చుని ఎదురు చూస్తుంది, చిన్నా ఆత్మ వెళ్లి తన పక్కన కూర్చుంది.
చిన్నా : నువ్వు వెళ్ళిపోయావు నిన్ను ఎక్కడ వెతకాలో ఏమో అని కంగారు పడ్డాను
అక్షిత : నువ్వొస్తావని నాకు తెలుసు అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను అని చిన్నా చెయ్యి పట్టుకుని గాల్లోకి ఎగురుతూ రా నీకింకో కొత్త లోకం చూపిస్తాను అంది.
రెండు ఆత్మలు గాల్లో కలిసిపోయాయి
సమాప్తం
❤️❤️❤️
❤️ mind antaa cheduga iyyipoindi
Posts: 3,807
Threads: 0
Likes Received: 2,517 in 2,038 posts
Likes Given: 37
Joined: Jun 2019
Reputation:
18
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Posts: 1,818
Threads: 0
Likes Received: 1,381 in 1,096 posts
Likes Given: 2,040
Joined: Dec 2021
Reputation:
24
Posts: 1,818
Threads: 0
Likes Received: 1,381 in 1,096 posts
Likes Given: 2,040
Joined: Dec 2021
Reputation:
24
Kanne malle chinnu ne thanega vadhilesaru kadha , and lavanya kuda thanega ayipoyindhe kadha ji, adhe bhadha anipinchindhe
Posts: 12,666
Threads: 0
Likes Received: 6,997 in 5,326 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
91
Excellent Story
Nice Ending Sir
Posts: 4,930
Threads: 0
Likes Received: 4,085 in 3,043 posts
Likes Given: 16,052
Joined: Apr 2022
Reputation:
68
Excellent story bro challa bagundhi
Posts: 283
Threads: 0
Likes Received: 237 in 170 posts
Likes Given: 515
Joined: Jan 2021
Reputation:
1
Posts: 491
Threads: 0
Likes Received: 416 in 311 posts
Likes Given: 1,065
Joined: Nov 2019
Reputation:
6
Wonderful update bro
Ending lo Adipinchesaru
Posts: 371
Threads: 0
Likes Received: 666 in 251 posts
Likes Given: 5,127
Joined: Nov 2018
Reputation:
25
Posts: 14,609
Threads: 8
Likes Received: 4,300 in 3,180 posts
Likes Given: 1,240
Joined: Dec 2018
Reputation:
164
Posts: 1,731
Threads: 1
Likes Received: 7,720 in 1,435 posts
Likes Given: 9,626
Joined: Nov 2018
Reputation:
60
Superb story but inknchm detailed ga rasunte Inka tiruguledu
ఇట్లు
మీ Sexykrish69.....
Posts: 3,321
Threads: 37
Likes Received: 45,375 in 2,260 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
9,959
•
Posts: 886
Threads: 0
Likes Received: 2,542 in 841 posts
Likes Given: 4,574
Joined: Dec 2021
Reputation:
97
మళ్ళీ ఇంకోసారి ఇంకో స్టోరీ క్లైమాక్స్ తో ఎడిపించేసారు......ఇది సాడ్ స్టోరీ అని ముందే చెప్పారు అనుకోండి....కానీ లాస్ట్ ఎపిసోడ్ చవుతుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్య......జస్ట్ ఇప్పుడే క్లైమాక్స్ చదివా....అందుకే లేట్ గా కామెంట్ పెట్టా.....కానీ ఇలాంటి ఎమోషనల్ సీన్స్ రాయటం లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రో.......
ధన్యవాదాలు
And finally......
ఈ సైట్ లో నాకు తెలిసినంత వరకు 5000 రేటింగ్ పాయింట్స్ వచ్చిన మొట్టమొదటి రైటర్ మీరే.....
A big congrtas bro......
Posts: 3,321
Threads: 37
Likes Received: 45,375 in 2,260 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
9,959
•
Posts: 3,321
Threads: 37
Likes Received: 45,375 in 2,260 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
9,959
Posts: 122
Threads: 0
Likes Received: 188 in 105 posts
Likes Given: 2,438
Joined: Dec 2022
Reputation:
7
చాలా బాగా రాసారు
కానీ షార్ట్ స్టోరీ
Takulsajal గారు నాకు ఇంకా మీ కథలని చదవాలని ఉంది
ఈ సైట్ లోనే కాక ఇంకెక్కడైనా రాసుంటే చెప్పండి
Meeru oka great writer & narrator andi
Please keep going
Shemale kadha kudaa nenu edho anukunna
Kaani adhi kuda chala baga rasthunnaru
మంచి కధనం
Thankyou once again
Posts: 179
Threads: 0
Likes Received: 135 in 113 posts
Likes Given: 2,725
Joined: Jul 2022
Reputation:
8
For the first time ee site lo nannu edipinchina story. Great one writer gaaru... Salute.
Posts: 3,321
Threads: 37
Likes Received: 45,375 in 2,260 posts
Likes Given: 9,083
Joined: Dec 2021
Reputation:
9,959
(14-02-2023, 09:34 PM)Thokkuthaa Wrote: చాలా బాగా రాసారు
కానీ షార్ట్ స్టోరీ
Takulsajal గారు నాకు ఇంకా మీ కథలని చదవాలని ఉంది
ఈ సైట్ లోనే కాక ఇంకెక్కడైనా రాసుంటే చెప్పండి
Meeru oka great writer & narrator andi
Please keep going
Shemale kadha kudaa nenu edho anukunna
Kaani adhi kuda chala baga rasthunnaru
మంచి కధనం
Thankyou once again
ఇంకెక్కడా రాయలేదు
Thankyou very much for the appreciation ❤️
•
|